నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లా పరిషత్ నూతన చైర్మన్ శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు, వైస్ చైర్మన్ శ్రీ పొట్టేళ్ల ప్రసాద్ గారు, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తనకు అన్ని విధాలా మద్దతుగా నిలిచి, విజయానికి సహకరించినందుకు ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి సత్కరించారు. జిల్లా పరిషత్ నూతన చైర్మన్‌గా ఎన్నికైన శ్రీ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి, వైస్ చైర్మన్ శ్రీ పొట్టేళ్ల ప్రసాద్ గారికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు.
#VemireddyPrabhakarReddy #NelloreMp #Nellore #NDASweepsAP
ప్రతి రోజు కడలికి ఎదురిగి, ప్రాణాలకు తెగించి సముద్ర ఆటు పోటులను ఎదుర్కొంటు దేశ సంపదకు సహాయపడుతు కుటుంబాన్ని కాపాడుకునే ప్రతి మత్స్యకార సోదరుడికి హృదయపూర్వక ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు.
#WorldFisheriesDay #FishermensDay #MatsyakaraDinotsavam
Vemireddy Prabhakar Reddy retweeted
అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు సంపూర్ణ మద్దతు: వీపీఆర్ దంపతులు.
- జడ్పీ నూతన ఛైర్మన్ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైస్ ఛైర్మన్ పొట్టేళ్ల ప్రసాద్‌కు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారి శుభాకాంక్షలు
- కూటమి నేతల ఐక్యతకు, టీడీపీ బలానికి జడ్పీ ఛైర్మన్ ఏకగ్రీవ ఎన్నిక నిదర్శనమని వెల్లడి
నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా నూతనంగా ఎన్నికైన పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (ఇందుకూరుపేట జడ్పీటీసీ సభ్యులు) గారికి, వైస్ ఛైర్మన్‌గా ఎన్నికైన పొట్టేళ్ల ప్రసాద్ (మనుబోలు జడ్పీటీసీ సభ్యులు) గారికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంపూర్ణ మద్దతు, జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు ఏకగ్రీవ ఎన్నిక జరగడం ఆనందంగా ఉందన్నారు.
నెల్లూరులోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నూతన జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అనంతరం జడ్పీ ఛైర్మన్‌గా పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని, వైస్ ఛైర్మన్‌గా పొట్టేళ్ల ప్రసాద్‌ను జడ్పీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి హిమాన్షు శుక్లా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు.. జడ్పీ నూతన ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ప్రశాంతి రెడ్డిగారు కోవూరు జడ్పీటీసీలను గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
#VemireddyPrashanthiReddy #VemireddyPrabhakarReddy #Nellore #TeluguDesamParty
దాదాపు 25 ఏళ్ల తర్వాత నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం సంతోషంగా ఉంది. జిల్లాలోని 35 జడ్పీటీసీ స్థానాలకు గాను 33 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ప్రజలు మనపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం.
ఈరోజు నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బీద రవిచంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని, నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాను.
ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలి. ఇప్పటి నుంచే ప్రజలకు మరింత చేరువవుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని, 2029లోనూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చేలా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి.
#VemireddyPrabhakarReddy #NelloreMP #TeluguDesamParty
కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమిదే విజయం: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
- కూటమి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీగారు
- చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపు
- రెండున్నరేళ్లలో కావలి అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు వెచ్చించినట్లు వెల్లడి
- ప్రజలందరూ కూటమి ప్రభుత్వం వైపే ఉన్నారని విశ్వాసం
- భారీ మెజారిటీ సాధనే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేయాలని కూటమి శ్రేణులకు ఎంపీ గారు పిలుపు
కావలి మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేశారు. గడిచిన రెండున్నరేళ్లలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్‌తో పాటు 44 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల పరిచయ కార్యక్రమం గురువారం సాయంత్రం కావలి పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం కావలి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సైతం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో రోడ్లు, బైపాస్‌లు, తాగునీటి పథకాలు తదితర అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.450 కోట్ల నిధులు తీసుకువచ్చినట్లు తెలిపారు. కావలిలో వైసీపీది నామమాత్రపు పోటీ మాత్రమేనని, ప్రజల మద్దతు కూటమి వైపు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.. కూటమిలోని మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని, ప్రతి వార్డులో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. చైర్మన్ అభ్యర్థి భరత్ కుమార్‌తో పాటు 44 మంది కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజయాన్ని కానుకగా అందించాలని పిలుపునిచ్చారు.
#VemireddyPrabhakarReddy #NelloreMP
భారత మహిళా శక్తికి, ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం, మాతృభూమి స్వేచ్ఛ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#JhansiLakshmiBai #JhansiLakshmiBaiJayanthi
సింహపురిలో ఆధ్యాత్మిక శోభ.. 11వ కార్తీక మాస లక్ష దీపోత్సవానికి శ్రీకారం.
నెల్లూరులో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 11వ కార్తీక మాస లక్ష దీపోత్సవానికి ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు దంపతులు శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి, ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
డిసెంబర్ 4, 5, 6 తేదీల్లో వీఆర్సీ గ్రౌండ్స్‌లో మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుకలు జరగనున్నాయి.
మూడు రోజుల పాటు భక్తిభావంతో సాగే ఈ మహత్తర ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని, పరమశివుని కృపకు పాత్రులు కావాలని వీపీఆర్ దంపతులు ఆహ్వానించారు.
#VPRLakshaDeepotsavam #LakshaDeepotsavam #VPRFoundation #KarthikaMasam
#Nellore
సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ, ప్రజల్లో చైతన్యం నింపుతూ, సామాజిక మార్పులో భాగస్వాములవుతున్న పత్రికా రంగానికి జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక అభినందనలు.
#NationalPressDay #PowerOfPen #JournalismForSociety
Heartiest congratulations to Team India U-19 on a spectacular victory in the #AsiaCupU19Final
Our young champions showcased exceptional skill, grit and team spirit to defeat Pakistan in a thrilling final.
A proud moment for Indian cricket.
#INDvsPAK #TeamIndia #U19AsiaCup
నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన దేశ తొలి ప్రధాని, భారతరత్న శ్రీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
#ChildrensDay #HappyChildrensDay
నెల్లూరు పార్లమెంటులో కూటమి ప్రభంజనం
మూడు జెండాలు, ఒకే అజెండా – ఓటర్ల బ్రహ్మరథం
#NDAsweepsAP #VemireddyPrabhakarReddy #ChandraBabuNaidu #APLocalBodyElections #CheppaamChestunnaam #Nellore #TeluguDesamParty #Janasena #BJP
పవిత్ర నాగుల చవితి పర్వదినం సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికి నాగుల చవితి శుభాకాంక్షలు.
#HappyNagulaChavithi #Nagadevatha
ఇదే ఐక్యత.. ఇదే స్ఫూర్తి.. 2029లోనూ కూటమి విజయమే లక్ష్యం.
కావలి నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయంపై నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో అభినందనలు తెలిపిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు.
4 జడ్పీటీసీ స్థానాల్లో 4 స్థానాలు, 47 ఎంపీటీసీ స్థానాల్లో 45 స్థానాలు కైవసం చేసుకుని 97 శాతం స్ట్రైక్ రేట్ సాధించడం కూటమి నాయకులు, కార్యకర్తల సమష్టి కృషికి నిదర్శనమని ఎంపీ గారు పేర్కొన్నారు.
ఎన్నికల్లో చూపిన ఇదే ఐక్యతను ప్రజా సేవలోనూ కొనసాగిస్తూ, ప్రజల సమస్యల పరిష్కారం మరియు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని సూచించారు.
కావలి నియోజకవర్గం పారిశ్రామికంగా కొత్త దిశగా అభివృద్ధి చెందబోతోందని, BPCL పరిశ్రమ, దగదర్తి విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులతో పాటు మరిన్ని పరిశ్రమలు రావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
#VemireddyPrabhakarReddy #Kavali #NDASweepsAP #APLocalBodyElections
కార్తీక మాసం సందర్భంగా శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు.
-నెల్లూరు మూలపేటలోని శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు
-వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేసిన అర్చకులు
-ప్రజలందరికీ కార్తీకమాస శుభాకాంక్షలు తెలియజేసిన వేమిరెడ్డి దంపతులు
నెల్లూరు నగరంలోని మూలపేటలో వెలసిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. కార్తీకమాస ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి, వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి దంపతులు ప్రజలందరికీ కార్తీకమాస శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
#VemireddyPrabhakarReddy #KarthikaMasam #Nellore
ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.
గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి 720 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది.
నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం నుంచి మరో మంచి అవకాశం. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
#VemireddyPrabhakarReddy #IdhiManchiPrabhutvam #Group2 #APPSC #AndhraPradesh
Vemireddy Prabhakar Reddy retweeted
విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లకు, కుప్పం మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది, ఉద్యోగులు, అధికారుల శ్రమ, పనితీరు వల్లనే ఈ ఘనత సాధ్యమైంది. 6 జాతీయ అవార్డులు దక్కించుకోవడం గర్వకారణం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి, ఆ శాఖ ఉన్నతాధికారులకు అభినందనలు. ఇదే స్పూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం.
@rashtrapatibhvn
@Dr_NarayanaP
స్వాతంత్ర్య సమరయోధులు, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రివర్యులు, భారతరత్న శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ.. జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు.
#MaulanaAbulKalamAzad
#AbulKalamAzadJayanti
#EducationDay
#NationalEducationDay
దీపాల కాంతులతో మీ జీవితాల్లో నూతన వెలుగులు నిండాలని, ప్రతి అడుగులో విజయం, ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటూ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.
#HappyDiwali #Deepavali #Diwali #Diwali2026 #FestivalOfLights
స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న నా కుటుంబ సభ్యులైన నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తూ బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.
#NDAsweepsAP #APLocalBodyElections #CheppaamChestunnaam #Nellore #VemireddyPrabhakarReddy
















































