Pinned Tweet
I assure the people of Anantapur that I will fulfil every promise made within 1,000 days!
My heartfelt gratitude to every citizen of Anantapur for placing their trust in me and electing me as the YSRCP Mayor.
I sincerely thank YS Jagan Mohan Reddy Garu, Sajjala Ramakrishna Reddy Garu, Anantha Venkatramireddy Garu, Peddireddy Ramachandra Reddy Garu, Mithun Reddy Garu and Naren Kumar Reddy Garu for their unwavering support in my victory.
With your trust and support, I am committed to serving Anantapur.
–Chitlur Ramesh Goud, Anantapur Mayor
@ysjagan
@SRKRSajjala
@avr_tweet
@peddireddyysrcp
@MithunReddyYSRC
ఈరోజు హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ **శ్రీ హఫీజ్ ఖాన్ గారిని** అనంతపురం మేయర్ ** సి. రమేష్ గౌడ్ గారు** మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా అనంతపురం మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన మద్దతు, సహకారం అందించినందుకు శ్రీ హఫీజ్ ఖాన్ గారికి రమేష్ గౌడ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
#YSRCP
#YSJagan
#HafeezKhan #RameshGoud #AnantapurMayor
#YSRCongressParty
#ATPMayor #Hyderabad
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగ దీపావళి.
ఈ పండుగ ప్రతి ఇంటా ఆనంద సిరులను కురిపించాలని కోరుకుంటూ. దీపావళి శుభాకాంక్షలు.
అనంతపురం మేయర్ సి రమేష్ గౌడ్..
#dipavali
#diwalivibes
#ananthapur
#rameshgowd
#mayor
కురువ భాస్కర్ పరామర్శించిన జిల్లా అధ్యక్షులు అనంత, మేయర్ రమేష్ గౌడ్
అనంతపురం : అనంతపురం నగరంలోని 3వ డివిజన్లో టీడీపీ గుండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపి కార్యకర్త కురువ భాస్కర్‌ను వైఎస్ఆర్సీపి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్ తదితర వైసీపీ నేతలు పరామర్శించారు.
ఈ సందర్భంగా వారు గాయపడిన కార్యకర్త ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. భాస్కర్‌కు అవసరమైన వైద్య సహాయం అందించాలని, పార్టీ తరపున పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ దురహంకారంతో పార్టీ కార్యకర్తలపై దాడులు జరగకూడదని తీవ్రంగా ఖండించారు.
మేయర్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల వాతావరణంలో కూడా ప్రజల భద్రతకు రక్షణ కరువైందని, కార్యకర్తల పట్ల అహంకారంతో వ్యవహరించే శక్తులను చట్టపరంగా శిక్షించాలని తెలిపారు. గాయపడిన కురువ భాస్కర్ త్వరగా కోలుకోవాలని కోరుతూ, పార్టీ కార్యకర్తలందరికీ ఆదర్శంగా నిలబడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#rameshgowd
#ananthapur
#mayor
#ysjagan
#ysrcongressparty
*అనంతపురం అర్బన్ పరిధిలోని రాజీవ్ కాలనీ పంచాయితీ వైయస్సార్ సీపీ నాయకురాలు లీలావతి గారు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ గారు స్థానిక నాయకులతో కలిసి లీలావతి గారి భౌతికకాయానికి నివాళులర్పించారు.*
#rameshgowd
#ananthapur
#mayor
#ysjagan
#ysrcongressparty
*అనంతపురం అభివృద్ధ్యే లక్ష్యంగా పనిచేయండి*
– ప్రజల నమ్మకాన్ని మరింతగా నిలబెట్టుకోండి
– డివిజన్ స్థాయిలో పార్టీ మరింత బలోపేతం కావాలి
– అవినీతి వ్యవహారాలు, వివాదాలకు దూరంగా ఉండండి
– పదవులంటే అలంకారం కాదు.. సేవ చేసే అవకాశం
– వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి సూచన
అనంతపురం, నవంబర్ 06 :
అనంతపురం నగర అభివృద్ధ్యే లక్ష్యంగా ముందుకు సాగాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు, అనంతపురం నియోజకవర్గ సమన్వయకర్త అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో కార్పొరేషన్ మేయర్‌గా ఎన్నికైన రమేష్‌గౌడ్‌తో పాటు కార్పొరేటర్లుగా గెలిచిన, ఓడిపోయిన అభ్యర్థులు, స్థానిక నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంతి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ అర్పించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం వెనుక ప్రతి ఒక్కరి కష్టం ఉందన్నారు. అధికార పార్టీ నేతలు దాడులు, దౌర్జన్యాలు చేసినా భయపడలేదన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు. డివిజన్ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. కొన్ని డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. ఓటమికి ఎవరూ చింతించాల్సిన అవసరం లేదని, మనమంతా బలంగా నిలబడడం వల్లే మేయర్ స్థానాన్ని గెలుచుకోగలిగామని తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారంతా ప్రజలకు మరింత చేరువ కావాలని అన్నారు. అవినీతికి తావులేకుండా అనంతపురం నగరాన్ని ప్రశాంతంగా ఉంచడమే మన ముందున్న ప్రథమ కర్తవ్యమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో దాడులు, దౌర్జన్యాలు, భూకబ్జాలు ఎక్కువయ్యాయన్నారు. ప్రజలు అన్నింటినీ గమనించే వైసీపీకి పట్టం కట్టిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. అందరూ సమన్వయంతో పనిచేసి అనంతపురం కార్పొరేషన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ రాదని, వచ్చిన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేయర్, కార్పొరేటర్ పదవులు అంటే అధికారం చలాయించడానికి కాదని, ప్రజలకు సేవ చేసే అవకాశాలు అని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే ఆలోచిస్తుందని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి వీలైంత వరకు డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. మేయర్‌గా గెలిచిన రమేష్ గౌడ్ మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పని చేసి అనంతపురం నగరాన్ని సుందరమైన, స్వచ్ఛమైన నగరంగా తీర్చిదిద్దుదామన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుదామని తెలిపారు. తనను మేయర్‌గా గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
#YSRCP
#YSJagan
#RameshGowd
#YSRCongressParty
#ATPMayor
అనంతపురం స్థానిక ఎన్నికల్లో వైసిపి 62 డివిజన్ ల కార్పొరేటర్ గా పోటీ చేసిన అభ్యర్థులందరికీ జిల్లా పార్టీ కార్యాలయం నందు సమావేశం ఏర్పాటు చేసుకొని దిశ నిర్దేశాలు, కీలక అంశాలు మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు అనంత వెంకట్రామిరెడ్డి గారు, అనంతపురం మేయర్ శ్రీ రమేష్ గౌడ్ గారు, 62 డివిజన్ లలో పోటీ చేసిన కార్పొరేటర్ అభ్యర్థులు, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
#rameshgowd
#ananthapur
#mayor
#ysjagan
#ysrcongressparty
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ రమేష్ గౌడ్ ని కలిసి హార్థిక శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు
#rameshgowd
#ysjagan
#anantapur
#ysrcongressparty
#mayor
అనంతపురం నగర శివారులోని రాయల్ నగర్లో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి నగర ప్రజల సంక్షేమం, తన పాలనా బాధ్యతల కోసం దైవాన్ని ప్రార్థించారు.
#rameshgowd
#ysjagan
#anantapur
#ysrcongressparty
#mayor
అనంత ప్రజల రుణం తీర్చుకుంటా..!
- నగర అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తా
- ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
- మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్
- అనంత ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు
అనంతపురం, నవంబర్ 5 :
అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌గా తనను గెలిపించి, ప్రజాసేవకు మరో అవకాశం కల్పించిన నగర ప్రజలందరికీ నూతన మేయర్ చిట్లూరు సి.రమేష్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి, విజయాన్ని అందించిన ప్రతి ఒక్క ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలు తనకు అప్పగించిన ఈ బాధ్యతను ఎంతో గౌరవంగా స్వీకరిస్తున్నానని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. తన విజయానికి సహకరించిన నగరంలోని ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత, మహిళలు, వివిధ ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా పార్టీ నాయకులు అందించిన సహకారం, కార్యకర్తలు చేసిన క్షేత్రస్థాయి ప్రచారం, అభిమానులు చూపిన ఆదరాభిమానాలు తన విజయానికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. ఈ విజయం తన వ్యక్తిగత విజయం మాత్రమే కాదని, అనంతపురం నగర ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి, పార్టీ శ్రేణుల సమష్టి కృషికి దక్కిన ఫలితమని అభివర్ణించారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన వారితో పాటు ఓటు వేయని వారందరినీ సమానంగా గౌరవిస్తూ, నగరంలోని ప్రతి ప్రాంతాన్ని సమదృష్టితో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం నగరంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రహదారుల అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, దోమల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణ వంటి అంశాలపై దృష్టి సారిస్తానని పేర్కొన్నారు. నగరంలోని ప్రతి డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. యువతకు మెరుగైన అవకాశాలు, మహిళలకు సురక్షితమైన వాతావరణం, వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా పని చేస్తానని వెల్లడించారు. నగరాభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ, వారి సూచనలు, సలహాలకు తగిన ప్రాధాన్యత ఇస్తానన్నారు. పదవి అనేది హోదా కోసం కాదని, ప్రజలకు సేవ చేసేందుకు లభించిన బాధ్యతగా భావిస్తున్నానని రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటలను గుర్తుంచుకుని, సాధ్యమైనంత త్వరగా అభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందిస్తానన్నారు. నగరపాలక సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని తెలిపారు. అనంతపురం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని, ప్రజలు తనకు అందించిన ఆదరాభిమానాలను ఎప్పటికీ మరచిపోనని మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్ అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని అభివృద్ధి పనుల రూపంలో నిలబెట్టుకుంటానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ అనంతపురం నగర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటానని మేయర్ చిట్లూరు రమేష్ గౌడ్ స్పష్టం చేశారు.
#rameshgowd
#ysjagan
#anantapur
#ysrcongressparty
#mayor
అందరికీ నమస్కారం, గత 20 రోజుల నుంచి నన్ను కలవడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సమయభావం వల్ల అందరినీ కలవలేక పోతున్న నన్ను క్షమించండి. 2 రోజుల తరువాత నుంచి ప్రతి ఒక్కరిని కలుస్తాను.
#RameshGowd
#BCRameshGowd
#YSJagan #YSRCP
#AnantapurMayor #Anantapur
#YSRCongressParty
చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చేసింది ఏమీ లేదు. సంక్షేమ పథకాలు అందించలేదు, రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు కాబట్టి నిజాయితీ గెలవలేరని తెలిసి గొడవలు,దౌర్జన్యాలు చేస్తూ గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని న్యాయమైన విజయం కోసం వైసిపి నాయకుల విజయం కోసం దగ్గరుండి పోరాడి గెలిపించుకుంటాం. సాక్షి బిగ్ క్యూస్షన్ లైవ్ డిబేట్ నందు తెలియజేసిన అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ గారు.
#rameshgowd
#ysjagan
#anantapur
#ysrcongressparty
#mayor
అనంతపురం నగర కార్పొరేషన్లో ఎలాంటి అవినీతికి తావు లేకుండా నగర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.
-రమేష్ గౌడ్, అనంతపురం వైయస్ఆర్సీపీ మేయర్
#RameshGowd
#bcrameshgowd
#anantapurmayor #anantapur
#YSRCP
అనంతపురం మేయర్‌గా నన్ను గెలిపించిన నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.మీ నమ్మకమే మాబలం, నగర అభివృద్ధి వైయస్ఆర్ సీపీ లక్ష్యం...
#RameshGowd
#BCRameshGowd
#YSJagan #YSRCP
#AnantapurMayor #Anantapur
#YSRCongressParty
అనంతపురం మేయర్‌గా నన్ను గెలిపించిన నగర ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
#RameshGowd
#BCRameshGowd
#AnantapurMayor #Anantapur
#YSRCongressParty



















