Challa Dharmareddy (@DharmareddyTRS) header
Challa Dharmareddy (@DharmareddyTRS) profile picture

Member of Legislative Assembly, Parkal Constituency

Joined June 2020
Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)Photo by Challa Dharmareddy (@DharmareddyTRS)
#Adminpost కేటీఆర్ సభను విజయవంతం చేయాలి: చల్లా ధర్మారెడ్డి.. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వ పాలనపై విసుగు చెందుతున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లోకి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని, రాష్ట్రానికి మళ్లీ పూర్వవైభవం రావాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు. ఈ నెల 22న వరంగల్‌లో కేటీఆర్ గారి సమక్షంలో వివిధ పార్టీల నాయకులు, మేధావులు, విద్యావంతులు భారీగా బీఆర్ఎస్‌లో చేరనున్నారని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, నవంబర్ 22న జరిగే కేటీఆర్ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. #ChallaDharmaReddy #BRS #Warangal #Telangana @BRSparty @KTRBRS @KCRBRSPresident @BRSHarish
4
17
747
GWMC 16వ డివిజన్ గరీబ్ నగర్‌లో బీఆర్ఎస్ నాయకులు బొజ్జం తిరుపతి కుమార్తె జ్యోతి, రామంచ కమలమ్మ మృతిచెందగా వారి పార్థీవదేహాలను సందర్శించి నివాళులర్పించడం జరిగింది. అనంతరం వారి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. #ChallaDharmaReddy #Parakala #BRS #Warangal #Viralpost @BRSparty @KTRBRS @BRSHarish @KCRBRSPresident
1
2
152
తెలంగాణ మాదిగ పోరాట సమితి కరపత్రం ఆవిష్కరణ.. తెలంగాణ మాదిగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 29న రవీంద్రభారతిలో జరగనున్న రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. #ChallaDharmaReddy #Parakala #Viralpost #telangana #viralreels
1
5
155
గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో అకాల మరణం చెందిన కార్యకర్త కుటుంబానికి అండగా.. #ChallaDharmaReddy #Parakala #Geesugonda #BRSFamily #Viralpost
1
1
102
పరకాల మండలం పోచారం గ్రామంలో ఇటీవల మృతిచెందిన ఇప్ప శ్రీవాణి కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబసభ్యులను ఓదార్చడం జరిగింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చాను. #ChallaDharmaReddy #Parakala #ViralPost #BRS #StandWithTheFamily
2
2
176
నియోజకవర్గంలోని పలు వివాహవేడుకల్లో... #wedding #trendingsong #viralpost #parkal #BRSParty
1
2
164
జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు! “నేటి బాలలే రేపటి భారత భవిష్యత్తు.. ప్రతి చిన్నారి చిరునవ్వులోనే దేశ ప్రగతి దాగి ఉంది. బాలల కలలకు రెక్కలు తొడిగి, వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే మనందరి బాధ్యత.” #NationalChildrensDay #ChildrensDay #FutureOfIndia #EveryChildMatters #HappyChildrensDay
2
95
ప్రజా కవి కాళోజీకి ఘన నివాళులు.. 💐 తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక.. ప్రజల గుండె చప్పుడు తన కలంగా మలిచిన మహోన్నత ప్రజాకవి **కాళోజి నారాయణరావు** గారు. తన కలంతో ప్రజల్లో చైతన్యం రగిలించి, అన్యాయాలపై అక్షర యుద్ధం చేసిన కాళోజీ గారి ఆశయాలు, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. #KalojiNarayanarao #PeoplePoet #Telangana #TributesToKaloji #TelanganaPride
1
2
117
పంట చేతికి రాక.. బ్యాంకుల వేధింపులు తట్టుకోలేక రైతన్నలు బలవన్మరణాలకు.. ఇదేనా కాంగ్రెస్ పాలన? కరువుతో పంటలు ఎండిపోయి రైతు తీవ్రంగా నష్టపోతుంటే.. మరోవైపు బ్యాంకుల నోటీసులు, రికవరీ ఒత్తిళ్లతో రైతులను మరింత వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. రుణమాఫీ పూర్తిచేస్తామన్న కాంగ్రెస్ హామీని నమ్మిన రైతన్నలు నేడు బ్యాంకుల గడప ముందు అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు తట్టుకోలేక పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంటున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కరువు ప్రాంతాల్లో రైతుల బ్యాంకు రుణాలను తక్షణమే రీషెడ్యూల్ చేయాలి. పెండింగ్‌లో ఉన్న రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలి. రైతుకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వమే.. రైతు మెడపై బ్యాంకు కత్తి పెట్టింది! ఇది రైతు ప్రభుత్వం కాదు.. రైతును అప్పుల ఊబిలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం!
1
214
ఆ నాగేంద్రుని ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. #NagulaChavithi #NagendraSwamy #FestivalGreetings #Telangana #ChallaDharmaReddy
4
275
🪔 చీకటిని తరిమికొట్టి వెలుగులను నింపే దీపావళి పండుగ..🪔 చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. పరకాల నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. #HappyDiwali #DiwaliWishes #ChallaDharmaReddy #Parkal #FestivalOfLights @BRSparty
1
6
164
కార్యకర్తల కుటుంబాలకు అండగా.. కష్టసుఖాల్లో తోడుగా..!! గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ఇటీవలే మృతిచెందిన పార్టీ కార్యకర్త తగరపు చంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. #ChallaDharmaReddy #BRS #Parakala #BRSFamily #Tribute
1
7
246
“నా తెలంగాణ కోటి రతనాల వీణ..” 🎶 నిజాం నిరంకుశ పాలనకు తన కలంతో ఎదురొడ్డి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్షరాల్లో ఆవిష్కరించిన మహాకవి, ప్రజాకవి శ్రీ దాశరథి కృష్ణమాచార్యులు. తన సాహిత్యంతో ప్రజల్లో చైతన్యం నింపి, తెలంగాణ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన మహనీయుడి ఆశయాలు, రచనలు చిరస్మరణీయం. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. 🙏 జై తెలంగాణ! ✊ #DasarathiKrishnamacharyulu #TelanganaPoet #JaiTelangana #TelanganaPride #TelanganaHistory @BRSparty
4
168
యూరియా కోసం చెప్పుల క్యూలో అన్నదాత.. ఇదేనా రైతు సంక్షేమం? తెల్లవారకముందే యూరియా కోసం చెప్పులు పెట్టి క్యూలో నిలబడాల్సిన దుస్థితి రైతుది. ఇప్పుడు యూరియాకు యాప్ అంట.. స్మార్ట్‌ఫోన్ లేని రైతుకు ఎరువు అందని పరిస్థితి! ఒకవైపు కరెంటు లేదు.. సాగునీళ్లు లేవు.. ఎండిపోతున్న పంటను కాపాడుకుందామంటే ఎరువు కూడా దొరకడం లేదు. కేసీఆర్ పాలనలో ఎరువు రైతు ఇంటి వద్దకు వచ్చింది.. రేవంత్ పాలనలో రైతు బతుకే క్యూలో నిలబడింది! అన్నదాతను అనుమానిస్తూ, ఎరువు కోసం ఇబ్బందులు పెట్టే ఈ విధానంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతుకు కావాల్సింది యాప్‌లు కాదు.. సమయానికి ఎరువులు, సాగునీరు, నాణ్యమైన కరెంటు! #RevanthReddy #UttamKumarReddy #BhattiVikramarka #ThummalaNageswaraRao #CongressParty
101
పట్టభద్రుల ఓటరు నమోదుపై సమీక్ష.. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం..! ✊ #ChallaDharmaReddy #BRS #GraduateMLC #Parakala #Telangana
2
6
192
*హామీల పేరుతో అధికారంలోకి వచ్చి.. ప్రజలను నిలువునా ముంచిన కాంగ్రెస్ సర్కార్! 🔥* మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు కుదేలు.. రైతులకు సాగునీరు లేదు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు.. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు.. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? 420 హామీలు.. ఆరు గ్యారెంటీలు.. కానీ ప్రజలకు దక్కింది కష్టాలు, కన్నీళ్లే! కేసీఆర్‌ను విమర్శించడం, బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం తప్ప ప్రజలకు చేసిందేమిటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం? పట్టభద్రులారా.. మీ ఓటే మీ గొంతుక! వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి. గతంలో ఓటు హక్కు ఉన్నవారు సైతం నూతన ఓటరు జాబితాలో తిరిగి నమోదు చేసుకోవాలి. ఆత్మకూరు మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి సాంబారి సమ్మారావుతో కలిసి ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించి, గ్రామాల వారీగా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పాలనను ప్రశ్నిద్దాం.. పట్టభద్రుల ఓటు హక్కును కాపాడుకుందాం! #ChallaDharmaReddy #BRS #Parakala #GraduateMLC #VoterRegistration
2
2
455
ఓట్ల దొంగతనంపై కాంగ్రెస్ ధర్నా.. పక్కనే ఓటుకు నోటు కేసు ఉన్న నేత! దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగిందంటూ ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్.. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డిని పక్కనే నిలబెట్టుకోవడం విడ్డూరం. దేశమంతా ఓట్ల చోరీ కనిపిస్తుంది.. కానీ పక్కనే ఉన్న ఓటుకు నోటు కేసు మాత్రం కనిపించదా? కాంగ్రెస్ ద్వంద్వ వైఖరిపై ప్రజలకు సమాధానం చెప్పాలి! #RahulGandhi @INCIndia #BRS
3
5
201
స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ.. నవంబర్ 22న హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనం పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది. విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం కోసం స్వేరోస్ చేస్తున్న కృషి అభినందనీయం. ఈ సమ్మేళనం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. #ChallaDharmaReddy #Swaero #Parakala #Hanamkonda #Education @BRSparty @KTRBRS @BRSHarish @KCRBRSPresident
2
5
214
కాంగ్రెస్ సర్కార్‌కు పట్టభద్రులు ఓటుతో బుద్ధి చెప్పాలి.. 🔥 మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో హామీలన్నీ హుళక్కి.. రైతులకు సాగునీరు కరువు.. తెలంగాణ అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లింది. కాంగ్రెస్ వైఫల్యాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే సరైన సమాధానం కావాలి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పరకాల మండలం నాగారం, పరకాల పట్టణం,గీసుగొండ, GWMC పరిధిలోని 15,16,17 డివిజన్లలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై వేర్వేరుగా నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. #ChallaDharmaReddy #BRS #GraduateMLCElections #Parakala #Telangana
3
6
309
అడుగడుగున మీరే నా సంతోషం... #ChallaDharmaReddy #KCR #KTR #BRS #Parakala
3
4
180