Anusha Botcha retweeted
తాడేపల్లి
శ్రీ వైయస్ జగన్ గారిని కలిసిన భీమిలి అసెంబ్లీ సమన్వయకర్త బొత్స అనూష గారు
ఇటీవలే భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా అనూషకు బాధ్యతలు అప్పగించిన వైఎస్సార్‌సీపీ
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌ను భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అనూష మర్యాదపూర్వకంగా కలిశారు.
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూషను నియమిస్తూ ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన బొత్స అనూష, తనపై నమ్మకం ఉంచి భీమిలి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు. భీమిలి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత బలోపేతంపై బొత్స అనూషకు శ్రీ వైయస్ జగన్ పలు సూచనలు చేశారు.
కర్లంలో ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం!
చీపురుపల్లి మండలం కర్లం గ్రామంలో విజయనగరం జిల్లా ప్రచార కమిటీ, రాగోలు జెమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా & నేత్ర వైద్య శిబిరాన్ని యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష గారు ప్రారంభించారు.
చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల సోషల్ మీడియా సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా పార్టీ క్షేత్ర స్థాయి కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించాను. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా కూడా అండగా ఉంటానని తెలియజేశాను - డాక్టర్ బొత్స అనూష.
ఈ కార్యక్రమంలో యువ నాయకులు బెల్లాన వంశీ కృష్ణ గారు, గరివిడి మండల పార్టీ అధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు గారు, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడు వాసు నాయుడు, కో కన్వీనర్ కెల్ల సురేష్, సెక్రటరీ శేషపు ప్రకాష్ మరియు నాలుగు మండలాల సోషల్ మీడియా సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Anusha Botcha retweeted
విజయనగరం జిల్లా YSRCP సంస్థాగత నిర్మాణ కార్యక్రమం, జిల్లా విస్తృతస్థాయి సమావేశం. పార్టీ బలోపేతం, ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అంశాలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల పై పోరాటం.. తదితర అంశాల పై దిశానిర్దేశం. #YSRCP #BotchaSatyanarayana #Vizianagaram #Cheepurupalli















