FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) header
FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) profile picture

Official Account of Fact Check Wing of Government of Andhra Pradesh. Report any misleading post/tweet at [email protected]

Joined December 2020
చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (SVCET) కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడం వల్ల కళాశాలకు ఫీజు చెల్లించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని, అందులో ఒక విద్యార్థిని మరణించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు. ఆ కళాశాలకు చెందిన ఒక విద్యార్థిని కడుపు నొప్పి, కిడ్నీలో రాళ్ల సమస్యతో తీవ్ర నొప్పిని అనుభవిస్తూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరింది. కళాశాలలో ఎక్కడా ఏ విద్యార్థిని లేదా విద్యార్థి కూడా ఆత్మహత్యాయత్నం చేయలేదని పోలీసుల విచారణలో తేలింది. విద్యార్థిని ఆరోగ్య విషయంపై ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారనే సమాచారం తెలియగానే చిత్తూరు పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. విచారణ జరిపి పూర్తి వివరాలు తెలుసుకున్న అనంతరం, ఆందోళన చేస్తున్న విద్యార్థులకు అసలు విషయం తెలిపారు. అంతే తప్ప సంబంధిత కళాశాలలో ఏ విద్యార్థి లేదా విద్యార్థిని కూడా ఆత్మహత్యాయత్నం చేయలేదు. అంతేకాకుండా కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల పేర్లను ఉటంకిస్తూ, వారి గోప్యతకు భంగం కలిగిస్తూ అసత్య ప్రచారం చేయడం క్షమించరాని నేరం. వాస్తవాలు నిర్ధారించుకోకుండా ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేయడం సబబు కాదు. #FactCheck #AndhraPradesh
15
20
2
56
4,267
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంతరిక్షం నుండి రాత్రివేళల్లో సూర్యరశ్మిని (Sunlight) అందించే సాంకేతికత గురించి మాట్లాడిన వీడియోను కొందరు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ, అటువంటి సాంకేతికత అసలు లేదని తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారు. వాస్తవం (Fact): ఈ సాంకేతికత పూర్తిగా నిజమైనది మరియు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దీనిపై ముమ్మరంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్న సమయంలో వేదికపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' (Skyroot Aerospace) సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ దాకా కూడా ఆశీనులై ఉన్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన 'రిఫ్లెక్ట్ ఆర్బిటల్' (Reflect Orbital) అనే అంతరిక్ష స్టార్టప్ సంస్థ, భూకక్ష్యలో భారీ అద్దాలతో (Reflectors) కూడిన ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, రాత్రి సమయంలో భూమిపై ఎంపిక చేసిన ప్రాంతాలకు సూర్యకాంతిని ప్రతిబింబించే ప్రాజెక్టును చేపడుతోంది. ఈ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు 'రిఫ్లెక్ట్ ఆర్బిటల్' సంస్థ, భారత్‌కు చెందిన 'స్కైరూట్ ఏరోస్పేస్'తో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. స్కైరూట్ రూపొందించిన 'విక్రమ్' రాకెట్ల సహాయంతో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. ఈ సాంకేతికత వల్ల కలిగే ముఖ్య ఉపయోగాలు: నిరంతరాయ సౌర విద్యుత్ ఉత్పత్తి: సాధారణంగా సోలార్ పవర్ ప్లాంట్లు పగటిపూట మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అంతరిక్షం నుండి రాత్రిపూట కూడా సూర్యరశ్మిని సోలార్ ఫామ్‌లపైకి మళ్లించడం ద్వారా, సూర్యాస్తమయం తర్వాత మరియు తెల్లవారుజామున పీక్ డిమాండ్ సమయంలోనూ సౌర విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించవచ్చు. విద్యుత్ నిల్వ (బ్యాటరీ) ఖర్చుల తగ్గింపు: రాత్రివేళల్లో విద్యుత్ అవసరాల కోసం భారీ స్థాయిలో ఖరీదైన బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గుతుంది. విపత్తు నిర్వహణ & సహాయక చర్యలు: తుఫాన్లు, భూకంపాలు లేదా వరదలు సంభవించి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిన ప్రాంతాల్లో, రాత్రిపూట సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన వెలుతురును ఈ ఉపగ్రహాల ద్వారా అందించవచ్చు. వ్యవసాయ & పారిశ్రామిక అవసరాలు: చలి ప్రదేశాల్లో లేదా పగటి సమయం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పంటల ఎదుగుదలకు అవసరమైన వెలుతురును అందించడానికి, అలాగే నిరంతరాయంగా పనిచేసే భారీ నిర్మాణ ప్రాజెక్టులకు ఇది ఉపయోగపడుతుంది. అంతరిక్షం నుండి రాత్రిపూట సూర్యరశ్మిని అందించే సాంకేతికత అనేది కల్పితం కాదు. 'రిఫ్లెక్ట్ ఆర్బిటల్' మరియు భారతీయ సంస్థ 'స్కైరూట్ ఏరోస్పేస్' భాగస్వామ్యంతో ఈ ప్రయోగం వాస్తవ రూపం దాల్చుతోంది. భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల ఈ నూతన ఆవిష్కరణ గురించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు, కానీ కొందరు దీనిపై అవగాహన లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. #FactCheck #AndhraPradesh
26
38
6
141
19,179
గుంటూరు 71వ డివిజన్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్ (వెంగళరావునగర్) లో విద్యార్థులతో బాత్ రూమ్ లు శుభ్రం చేయిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారమైన వార్తలలో ఎలాంటి నిజం లేదు. సదరు పాఠశాలలో బాత్ రూమ్ లు శుభ్రపరచడానికి ప్రత్యేకంగా TMF (Toilet Maintenance Fund) ఆయా అందుబాటులో ఉన్నారు. విద్యార్థి బాత్ రూమ్ ఉపయోగించుకోవడానికి వెళ్లిన సమయంలో నీరు కిందకి పడటంతో అక్కడ నిలిచి ఉన్న నీటిని పక్కనే ఉన్న వాటర్ వైపర్/స్టిక్ తో తోయడం మాత్రమే జరిగింది తప్ప విద్యార్థికి ఎలాంటి క్లీనింగ్ పని అప్పగించలేదు. సమయానికి నీటిని శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం వహించిన సదరు ఆయాపై చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు (MEO గుంటూరు ఈస్ట్) స్పందించి వివరణ ఇచ్చారు. అంతే కాకుండా పర్యవేక్షణ లోపం ఉన్నందున పాఠశాల ప్రధానోపాధ్యాయునికి (Headmaster) షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు కూడా వివరణ ఇచ్చారు. రాష్ట్రం లోని అన్ని పాఠశాలల్లో బాత్ రూమ్ లలో పరిశుభ్రత పాటించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ అంశం పై తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
1
9
11
1,242
నెల్లూరు జిల్లా సంగంలోని వికాస్ ఈ.ఎమ్ హైస్కూల్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి దారా దీక్షిత్‌పై తోటి విద్యార్థులు బలవంతంగా పురుగుల మందు తాగించి హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని వార్తా ఛానళ్లలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. పాఠశాల ఆవరణలో లేదా పాఠశాల సమయంలో బలవంతంగా తాగించారనే వార్తల్లో వాస్తవం లేదు. విద్యార్థి దారా దీక్షిత్ స్వయంగా పురుగుల మందు మింగడం జరిగింది. ఆ సమయంలో ఒక స్థానికుడు గమనించి హెచ్చరించడంతో బాటిల్‌ను బయట పడేసాడు. మొదట్లో విద్యార్థి పురుగుల మందు తాగిన విషయాన్ని ఇంట్లో చెప్పకపోవడంతో కామెర్లు అనుకుని స్థానికంగా వైద్యం అందించారు. అనంతరం చెన్నై ఆసుపత్రికి తరలించిన తర్వాత విద్యార్థి అసలు విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాఠశాల విద్యార్థులు, వారి మానసిక ధైర్యం మరియు కుటుంబాల శ్రేయస్సుకు సంబంధించిన విషయాలలో వాస్తవాలు తెలుసుకోకుండా వదంతులను వ్యాప్తి చేయడం వల్ల అనవసర భయాందోళనలు వ్యక్తమవుతాయి. అధికారికంగా సంబంధిత అధికారులు లేదా పోలీసుల నుండి పూర్తిస్థాయి నివేదికలు వచ్చేవరకు ఏ వార్తనైనా ధ్రువీకరించుకోవడం, అలాగే అసత్య కథనాలను వ్యాప్తి చేయకపోవడం మన అందరి కనీస బాధ్యత. బాధ్యతాయుతమైన సమాజంలో ఇటువంటి సున్నితమైన అంశాల మీద అసత్య ప్రచారాలు చేయడం చట్ట ప్రకారం నేరం, తప్పుడు పరిచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాము. #FactCheck #AndhraPradesh
1
12
21
2,082
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రైతును ముట్టుకోవడానికి ఇష్టపడలేదని, ఆయన సహాయం చేయబోతే వద్దని వారించారని సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. ఈ ప్రచారం పూర్తిగా అసత్యం. పొలంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సీఎం గారికి సహాయం చేయడానికి రైతు ముందుకు వచ్చారు. అయితే, రైతు ఇబ్బంది పడకూడదని, తన బరువు అతనిపై పడకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారు వద్దని స్వయంగా ముందుకెళ్లారు. ఆ వెంటనే అదే రైతు భుజంపై చేయి వేసి లోతు నీటిలో కలిసి నడిచారు. చాలాసేపు అతనితో మాట్లాడుతూ పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీడియోలోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే కట్ చేసి దుష్ప్రచారానికి వాడుకున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలను భయాందోళనకు గురిచేసేలా లేదా నాయకులు, అధికారుల పరామర్శలపై తప్పుడు ప్రచారాలు చేయడం విపత్తు నిర్వహణ చట్టం-2005 (సెక్షన్ 54) మరియు ఐటీ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టించినా, వ్యాప్తి చేసినా శిక్షకు అర్హులవుతారు. #FactCheck #AndhraPradesh
2
44
157
15,564
అమరావతిలో కురిసిన వర్షాలకు నీటిని బయటకు తోడేందుకు మోటార్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తన ఎక్స్ (@KethireddyMLA) ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ ప్రచారం చేశారు. ఈ ప్రచారం పూర్తిగా అసత్యం మరియు తప్పుదోవ పట్టించేలా ఉంది. పోస్టులో ఉపయోగించిన వీడియో ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతికి సంబంధించింది కాదు. రెండవ స్క్రీన్‌షాట్‌లో బెంగాలీ భాషా శీర్షిక ("একযোগে চালানো হচ্ছে অনেকগুলা মেশিন" - Arif Hossain 5.0 ఖాతా) స్పష్టంగా కనిపిస్తోంది. ఇది బంగ్లాదేశ్ ప్రాంతంలో ఆక్వాకల్చర్, వ్యవసాయం లేదా నీటి నిర్వహణకు సంబంధించిన పాత దృశ్యం. ప్రస్తుతం అమరావతి రాజధాని ప్రాంతంలో వేల కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డ్రైనేజీలు, డక్టింగ్ కోసం తవ్విన గోతులు, రైతుల ప్లాట్ల కోసం నిర్మిస్తున్న రోడ్లు మరియు డ్రెయిన్ పనుల కారణంగా భారీ వర్షాలు పడినప్పుడు కొన్ని చోట్ల నీరు నిలిచిపోవడం సహజం. ఇటీవల సంభవించిన అర్నబ్ మరియు మురసు తుఫాన్ల వల్ల కోస్తా జిల్లాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు మరియు రాజకీయ నాయకులు నిజా నిజాలు పరిశీలించకుండా వేరే ప్రాంతాల వీడియోలతో రాష్ట్ర రాజధానిపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, వేరే ప్రాంతపు దృశ్యాలను రాజధానికి ఆపాదిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేయడం బాధ్యతారాహిత్యం. వేరే ప్రాంతానికి చెందిన బెంగాలీ వీడియో ఆధారంగా అమరావతి రాజధాని నిర్మాణాలు మరియు నీటి ఉపసంహరణపై చేసిన ఈ ప్రచారం పూర్తిగా అసత్యం. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. #Factcheck #AndhraPradesh
28
199
23
613
114,269
భారీ వర్షాల కారణంగా అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ పరిసరాలు, రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని, రాజధాని ప్రాంతమంతా వరదతో మునిగిపోయిందని కొన్ని వార్తా చానల్స్, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అర్నబ్, మురుసు తుఫాన్ ల కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాలలో తీసిన గోతులలో, చేసిన తవ్వకాలలో నీరు చేరిన మాట వాస్తవమే. అమరావతి పరిధిలోని రోడ్లకు ఇరువైపులా ప్రస్తుతం డ్రైనేజీ (Drainage), డక్టింగ్ (Ducting) మరియు అండర్ గ్రౌండ్ పనుల కోసం పెద్ద ఎత్తున గోతులు తవ్వడం జరిగింది. నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న వేళ, వర్షం నీరు నిర్మాణ పనుల గోతుల్లో నిలవడం సహజం. అయితే, దీనిని ఆధారంగా చేసుకుని "రాజధాని అంతా మునిగిపోయింది", "వరద బీభత్సం" అని ప్రచారం చేయడం అతిశయోక్తి మరియు తప్పుడు కోణంలో చూపించడమే అవుతుంది. ఒక టీవీ ఛానెల్లో మరీ బాధ్యత లేకుండా శాఖమూరు రిజర్వాయర్ విజువల్స్ వేసి ‘‘అమరావతి మునిగిపోయింది’’ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరొక ఛానెల్లో డ్రైనేజి, డక్టింగ్ పనుల గుంతలను, వాటిలో చేరిన నీటిని చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ ఛానెళ్లు చూపిన తప్పుడు వీడియోలను మరి కొందరు సోషల్ మీడియా హ్యాండల్స్ లో షేర్ చేసుకుంటున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఎక్కడా ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితి లేదు. ఈ తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు. #FactCheck #AndhraPradesh
26
61
3
160
9,992
విశాఖ 14వ వార్డు YSRCP అభ్యర్థి కిడ్నాప్ ప్రచారం పూర్తిగా అసత్యం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, ముఖ్యంగా @Telugufeedsite ఖాతా ద్వారా ప్రచారం చేస్తున్న "విశాఖపట్నం 14వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డి కిరణ్మయి కిడ్నాప్‌కు గురయ్యారని, కూటమి నేతలు ఆమెను బెదిరించి బలవంతంగా నామినేషన్ ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారనే" వార్తల్లో ఎలాంటి నిజం లేదు. 14వ వార్డు అభ్యర్థి శ్రీమతి రెడ్డి జీవన్ కిరణ్మయి (27) తన భర్త దాసుతో కలిసి 21-10-2026న అరిలోవ పోలీసు స్టేషన్‌కు నేరుగా వచ్చారు. "17-10-2026న జీవీఎంసీ 14వ వార్డు అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరుపున నామినేషన్ వేశాను. అయితే, సొంత ఆస్తులు లేకపోవడం, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం మరియు పార్టీ నుంచి కూడా ఎలాంటి ఆర్థిక మద్దతు లభించకపోవడంతో ఆస్తులు అమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేయడం ఇబ్బందికరమని గ్రహించాను, అందుకే నా వ్యక్తిగత కారణాల వల్ల స్వచ్ఛందంగానే పోటీ నుంచి తప్పుకుంటున్నాను" స్పష్టం చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ‘‘14వ వార్డ్ అభ్యర్ధి కిడ్నాప్ అయ్యారు’’ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని, సదరు ప్రెస్ నోట్‌లోని "కిడ్నాప్" వార్తలు పూర్తిగా అబద్ధమని, తన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. అదేవిధంగా, తను పోటీ విరమించుకోవడంతో తను పోటీ చేసిన రాజకీయ పార్టీ కేడర్ నుంచి తనకు, తన కుటుంబానికి ఇబ్బందులు రాకుండా పోలీసు రక్షణ కల్పించాలని పోలీసులను వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చి అభ్యర్థించారు. రెడ్డి కిరణ్మయి కిడ్నాప్ అయినట్లుగానీ, బలవంతంగా విత్‌డ్రా చేయించినట్లుగానీ ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అరిలోవ పోలీస్ ఇన్ స్పెక్టర్ అధికారికంగా ధ్రువీకరించారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ప్రజలు, సోషల్ మీడియా వినియోగదారులు నమ్మవద్దని, షేర్ చేయవద్దని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. #FactCheck #AndhraPradesh
26
1
42
3,157
పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, దాచేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నడికుడి-మాచర్ల టర్నింగ్ వద్ద ఒక మహిళ ప్రమాదానికి గురైతే గంట సేపైనా అంబులెన్స్ రాలేదని, ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రచారం అవుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారం పూర్తిగా అసత్యం మరియు తప్పుదోవ పట్టించేలా ఉంది. బాధితురాలి ప్రకటన :- ప్రమాదానికి గురైన దేవుళ్ళ లలిత అనే మహిళ స్వయంగా స్పందిస్తూ వీడియో ద్వారా స్పష్టత ఇచ్చారు. దాచేపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తనకు స్వల్ప గాయాలయ్యాయని, ప్రమాదం జరిగిన వెంటనే అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి తమను హాస్పిటల్‌కు తరలించారని ఆమె తెలిపారు. ఆసుపత్రిలో వైద్యులు వెంటనే ప్రథమ చికిత్స అందించారని చెప్పారు. పాల వ్యాన్ డ్రైవర్ కూడా వచ్చి వైద్య సహాయానికి, చికిత్సకు అయ్యే ఖర్చులకు సహకరించారని తెలిపారు. సంఘటన స్థలంలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి, వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రభుత్వంపై, అధికారులపై ఆరోపణలు చేస్తూ వీడియో తీశాడని బాధితురాలు స్పష్టం చేశారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యక్తి ఎవరో కూడా తమకు తెలియదని బాధితురాలు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖలు (పోలీస్ & వైద్య విభాగాలు) వేగంగా స్పందించి బాధితురాలికి సకాలంలో సహాయం అందించాయి. మద్యం మత్తులో ఒక వ్యక్తి తీసిన వీడియోను ఆసరాగా చేసుకుని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్నారని స్పష్టమవుతోంది. ఇలాంటి తప్పుడు వార్తలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. #FactCheck #AndhraPradesh
8
12
1,921