ప్రజలకు విజ్ఞప్తి
రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయంటూ ప్రచారంలో ఉన్న మెసేజ్ లు పూర్తిగా అవాస్తవమని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.
- నవంబర్ 4 ఉదయం కొన్ని జిల్లాల్లోని రైతులకు ఈ తరహా సందేశాలు వచ్చినట్లు వ్యవసాయ శాఖ దృష్టికి వచ్చింది. అయితే, ఈ సందేశాలు నిజమైనవి కావని తేల్చింది.
- ఈ విషయంపై సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) సంస్థలతో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ సందేశాలు మోసపూరితమైనవని వ్యవసాయ శాఖ నిర్ధారించింది.
- ఈ సందేశాలను ఎవరు పంపిస్తున్నారు, వాటి వెనుక ఎవరున్నారు అనే విషయాలను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. దీనిపై తగిన విచారణ చేపట్టాలని కోరింది.
- రైతులు అనుమానాస్పద సందేశాల్లోని లింకులను క్లిక్ చేయవద్దని వ్యవసాయ శాఖ సూచించింది. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించింది.
డైరెక్టర్, వ్యవసాయ శాఖ
తెలంగాణ ప్రభుత్వం
Public Advisory
Messages circulating among farmers claiming that Rythu Bharosa funds have been credited to their accounts are completely false and baseless.
➤ The Agriculture Department clarified that some farmers in a few districts received such messages on the morning of November 4. The messages are not genuine.
➤ Following consultations with the Centre for Development of Advanced Computing (C-DAC) and the National Informatics Centre (NIC), the department confirmed that the messages were false.
➤ The department has informed the Cyber Crime Police to investigate the circulation of these messages and identify those responsible.
➤ Farmers are advised not to click on suspicious links or share personal or banking details in response to such messages.
Director, Agriculture Department, Telangana
టామ్‌కామ్ విదేశీ నియామకాల పై వస్తున్న కొన్ని వార్తా కథనాలు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి.
టామ్‌కామ్ ద్వారా జరిగే అన్ని విదేశీ నియామకాలు, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నిబంధనలకు కట్టుబడి ఉంటాయి .
నియామక ప్రక్రియ
➤ టామ్‌కామ్ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నిబంధనల ప్రకారం పనిచేస్తోంది. దేశాన్ని బట్టి, నియామక కార్యక్రమాన్ని బట్టి, చెల్లించే ఫీజులు మారుతుంటాయి. కార్యక్రమానికి సంబంధించిన అర్హతలు, చెల్లింపుల షెడ్యూల్, ఎంపిక నిబంధనలను అభ్యర్థులకు ముందుగానే తెలియజేస్తారు. వాటికి అంగీకరిస్తూ అభ్యర్థులు అధికారికంగా సంతకాలు కూడా చేస్తారు.
జర్మనీ కార్యక్రమం: ఫీజుల వివరాలు
➤ అభ్యర్థుల నుంచి రూ.2.60 లక్షల- రూ.4.10 లక్షల వరకు వసూలు చేశారన్న ఆరోపణలో వాస్తవం లేదు. ఫెయిర్స్టీట్ (Fairsteet) ఔస్బిల్డుంగ్ (Ausbildung) కార్యక్రమం మొత్తం ఖర్చు రూ.4,10,400. కాగా, ఈ మొత్తాన్ని నాలుగు విడతల్లో అభ్యర్థులు చెల్లిస్తారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, దీనికి సంబందించిన, చివరి విడత రూ.1,53,400ను ఏ అభ్యర్థి నుంచి ఇంకా వసూలు చేయలేదు.
జర్మన్ భాషా పరీక్షల ఫీజులు
➤ పరీక్ష స్లాట్ల బుకింగ్ కోసం అదనంగా రూ.20,000 వసూలు చేశారన్న ఆరోపణ అవాస్తవం. అభ్యర్థులు పరీక్ష ఫీజులను నేరుగా భాషా పరీక్షలు నిర్వహించే కేంద్రాలకు చెల్లిస్తారు. టామ్కామ్కు దీనికి సంబంధించి ఏ చెల్లింపులు జరగలేదు.
అభ్యర్థుల నియామకాలు, జర్మనీకి వలస
➤ టామ్‌కామ్ ద్వారా మొత్తం 109 మంది అభ్యర్థులు జర్మనీకి వెళ్లారు. వీరిలో 12 మంది ఔస్బిల్డుంగ్ కార్యక్రమం ద్వారా వెళ్లారు. మరో నలుగురికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ప్రస్తుతం వారు ఈ విషయమై శిక్షణలో ఉన్నారు.
➤ ఇతర అభ్యర్థులు భాషా ప్రావీణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. కానీ, నైపుణ్య పరీక్షలు లేదా ఉద్యోగ ఇంటర్వ్యూల్లో అర్హత సాధించలేదు.
తదుపరి శిక్షణ, ఉద్యోగ అవకాశాలు
➤ ఉద్యోగాలు పొందని అభ్యర్థులకు టామ్‌కామ్ మళ్లీ శిక్షణను అందిస్తోంది. వివిధ సంస్థల్లో ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశాలను కల్పిస్తోంది. భాషా నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్, ఇతర వృత్తి నైపుణ్యాలలో శిక్షణ కల్పిస్తుంది.
బుట్చరీ ఉద్యోగంపై వివరణ
ఇంజినీరింగ్ పట్టభద్రుడికి మాంసం దుకాణంలో పని కల్పించారన్న ఆరోపణపై టామ్‌కామ్ స్పందించింది. సదరు అభ్యర్థి స్వయంగా బుట్చరీ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపుతూ 2026 ఫిబ్రవరి 7న సంస్థకు లిఖితపూర్వకంగా అంగీకారాన్ని అందించారు.
➤ టామ్‌కామ్ అధికారులు అభ్యర్థులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని సంస్థ తెలిపింది. అభ్యర్థులతో చేసుకున్న ఒప్పందాల ప్రకారం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (TOMCOM)
Reports regarding TOMCOM’s overseas recruitment programmes and placement process are MISLEADING.
TOMCOM has clarified that its recruitment programmes follow Ministry of External Affairs (MEA) norms, with candidates informed in advance about programme requirements, payment schedules and selection conditions..
1. Recruitment process and payment terms
➤ TOMCOM follows Ministry of External Affairs (MEA) norms. Service charges vary across countries and recruitment programmes. Candidates are informed of the requirements, payment schedules and selection conditions in advance and sign agreements accepting the terms.
2. Germany programme: Fee structure
➤ The allegation that candidates were charged ₹2.60 lakh to ₹4.10 lakh is incorrect. The total cost of the Fairsteet Ausbildung programme was ₹4,10,400, payable in four instalments. The final instalment of ₹1,53,400, including TOMCOM service charges, was not collected from any candidate.
3. German language examination fees
➤ The allegation that an additional ₹20,000 was collected for examination slot bookings is false. Candidates pay examination fees directly to the language testing centres.
4. Candidate placements and migration
➤ A total of 109 candidates have migrated to Germany through TOMCOM, including 12 under the Ausbildung programme. Four more have received job offers and are undergoing pre-departure orientation.
➤ Other candidates cleared language proficiency tests but did not qualify in skill assessments or job interviews.
5. Further training and employment opportunities
➤ TOMCOM is providing refresher training and facilitating further interview opportunities for candidates who have not secured placements. Language, soft-skills and skill-development classes are also continuing.
6. Clarification on the butchery placement
➤ Responding to the allegation concerning an engineering graduate being offered a butchery placement, TOMCOM stated that the candidate had himself expressed interest in the placement in a letter dated February 7, 2026.
7. Continued support to candidates
➤ TOMCOM stated that its officials remain in regular contact with candidates and reiterated its commitment to facilitating employment in accordance with the agreements signed with them.
Telangana Overseas Manpower Company (TOMCOM)
కార్మిక శాఖా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సిఫారసుతో కార్మికుల బీమా క్లెయిమ్ ఆమోదం పొందిందన్న వార్తలు అవాస్తవం.
➤ కార్మికుల పరిహార బీమా క్లెయిమ్‌ను తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సిఫారసు లేఖ ఆధారంగా ఆమోదించారన్న వార్తలు అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు.
➤ నిబంధనల ప్రకారం దరఖాస్తును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని మాత్రమే అధికారులను కోరినట్లు తెలిపారు.
➤ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా దరఖాస్తు లేకపోవడంతో అధికారులు దానిని తిరస్కరించారు.
➤ ప్రభుత్వం దరఖాస్తుదారుడికి ఎలాంటి పరిహారం చెల్లించలేదు. అందువల్ల మంత్రి సిఫారసుతో క్లెయిమ్ ఆమోదం పొంది, పరిహారం విడుదల చేశారన్న ఆరోపణలలో నిజం లేదు.
ఆరోపణలపై సమగ్ర విజిలెన్స్ విచారణ
➤ బీమా క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌లో అక్రమాలు జరిగినట్లు గుర్తించడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాథమిక విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసింది. సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
➤ అక్రమాలకు బాధ్యులుగా తేలిన వారిపై వారిపై, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
537
Reports alleging that a workers’ compensation insurance claim was approved based on a recommendation letter from Telangana labour minister G. Vivek Venkataswamy.
➤ The Minister clarified that he had only requested officials to examine the application in accordance with the prescribed rules and take appropriate action.
➤ Officials rejected the application after finding that it did not meet the eligibility criteria. No compensation was disbursed by the government to the applicant. Therefore, the allegation that the claim was approved and compensation released based on the Minister’s recommendation is incorrect.
➤ Following the detection of irregularities in the processing of Labour Welfare Board insurance claims, the government initiated action. Two officials have been suspended based on preliminary findings, and a comprehensive vigilance inquiry has been initiated.
➤ The Minister stated that strict action would be taken against anyone found responsible for the irregularities, irrespective of their role or designation.
ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ జలాశయాలు నవంబర్ చివరి నాటికి ఎండిపోతున్నాయంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) స్పష్టం చేసింది.
➤ అలాంటి మెసేజ్ ను HMWSSB ఎక్కడా కూడా విడుదల చెయ్యలేదని అధికారికంగా తెలియజేసింది
➤ జలాశయాల్లో నీటి మట్టాలు, నీటి సరఫరా నిలిపివేతకు సంబంధించి వస్తున్న ప్రచారాలలో వాస్తవం లేదు.
➤ ప్రజలు, కేవలం ప్రభుత్వం అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి అని, సామాజిక మాధ్యమాల ద్వారా ఫార్వార్డ్ అయ్యే సమాచారాన్ని నమ్మి, భయబ్రాంతులకు గురి కావద్దో అని విజ్ఞప్తి.
➤ నీటి సరఫరాకు సంబంధించిన తాజా సమాచారం కోసం HMWSSB అధికారిక మాధ్యమాలను అనుసరించాలి.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB)
Messages circulating on social media claiming that Hyderabad’s reservoirs will dry up by the end of November due to El Niño and drought, leading to restricted or suspended water supply, are not official.
➤ HMWSSB has clarified that it has not issued any such message.
➤ Claims in the circulating message regarding reservoir levels and possible restrictions or suspension of water supply are not official.
➤ Citizens are advised not to believe or forward unverified messages and to rely on official communications from HMWSSB for updates on water supply.
Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWSSB)
తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ నుంచి మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం, కల్యాణలక్ష్మి పథకం కింద రెండు తులాల బంగారం అందిస్తామని ప్రకటించినట్లు ప్రచారం అవుతున్న వీడియో మార్ఫింగ్ చేసిన వీడియో.
వాస్తవాలు:
➤ ఈ వీడియోలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు 2025 ఏప్రిల్‌లో రవీంద్రభారతిలో జరిగిన 892వ బసవ జయంతి వేడుకలకు సంబంధించినవి.
➤ అసలు వీడియోకు ఉన్న ఆడియోను మార్చి, దాని స్థానంలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన డీప్‌ఫేక్ ఆడియోను జత చేశారు. దీని ద్వారా, ముఖ్యమంత్రి రెండు పథకాల అమలును ప్రకటించినట్లు కనిపించేలా చేశారు.
➤ ప్రచారంలో ఉన్న ఆడియోను ఏఐ డిటెక్షన్ పరికరాలు ద్వారా పరిశీలించగా, అది డీప్ ఫేక్ ఆడియో అని తేలింది.
➤ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన విషయాల కోసం, కేవలం అధికారిక ప్రభుత్వ మాధ్యమాల ద్వారా విడుదలైన సమాచారాన్ని మాత్రమే నమ్మాలి.
➤ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్న ఏఐ వీడియోలు, ఆడియోలు, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని పౌరులకు విజ్ఞప్తి.
— తెలంగాణ ప్రభుత్వం
A video of the Telangana Chief Minister A Revanth Reddy announcing ₹2,500 monthly assistance for women and two tolas of gold under Kalyana Lakshmi from the Bathukamma festival, is a doctored video.
Facts:
➤ The video being circulated features Chief Minister A Revanth Reddy speaking at the 892nd Basava Jayanti celebrations held at Ravindra Bharathi, is from April 2025.
➤ The audio attached to the original video has been manipulated and replaced with AI-generated deepfake audio, making it appear as though the Chief Minister is announcing the implementation of the two schemes.
➤ AI-based audio detection tools used to examine the circulated audio have indicated that the audio is a deepfake.
➤ Any announcement regarding the implementation or expansion of government welfare schemes should be verified through official government communications.
➤ Citizens are advised not to rely on manipulated videos, AI-generated audio or social media posts for information about government schemes.
- Government of Telangana
రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందంటూ వస్తున్న వార్తా కథనాలు తప్పుదారి పట్టించేవిధంగా ఉన్నాయి.
➤ ములుగు జిల్లా వెంకటాపూర్‌లో సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టాలని తలపెట్టిన వెంకటాపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు విషయంలో సమగ్ర శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సింగరేణి యాజమాన్యం తెలియజేసింది.
➤ రామప్ప గుడిపై మైనింగ్ ప్రభావంపై భారత పురావస్తు శాఖతో పాటు ఇతర ప్రతిష్టాత్మక సంస్థలు శాస్త్రీయంగా అధ్యయనం చేసి ఇచ్చే నివేదికల ఆధారంగానే తదుపరి చర్యలు తీసుకుంటామని సింగరేణి తెలిపింది.
➤ ప్రపంచ వారసత్వ సంపద అయిన రామప్ప గుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం చేకూర్చబోమని, వారసత్వ సంపద పరిరక్షణకు కట్టుబడి ఉంటామని సింగరేణి పేర్కొంది.
➤ పర్యావరణహితమైన, చట్టబద్ధమైన మైనింగ్ కార్యకలాపాలకే సింగరేణి అధిక ప్రాధాన్యం ఇస్తుందని యాజమాన్యం పునరుద్ఘాటించింది.
➤ రామప్ప గుడికి సింగరేణి మైనింగ్‌తో ముప్పు పొంచి ఉందని వస్తున్న వార్తలు అపోహలు, అవాస్తవాలని సింగరేణి స్పష్టం చేసింది.
- సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
1
385
Newspaper reports claiming that Singareni mining is posing a threat to the UNESCO Heritage site Ramappa Temple, are misleading.
➤ Singareni management has clarified that it will proceed with the proposed Venkatapur Open Cast Project in Mulugu district only after a comprehensive scientific study.
➤ Singareni has stated that further action will be taken based on the scientific reports submitted by the Archaeological Survey of India (ASI) and other reputed institutions on the impact of mining on the Ramappa Temple.
➤ Singareni has clarified that it will not cause any damage to the Ramappa Temple, which is a World Heritage Site, and remains committed to protecting it.
➤ Singareni has reiterated that environmentally friendly and legally compliant mining activities will be given the highest priority.
➤ Singareni has stated that reports suggesting a threat to the Ramappa Temple from its mining activities are not factual.
Statement by Singareni Collieries Company Limited
1
425
విదేశాల నుంచి తెలంగాణ బొగ్గును దిగుమతి చేసుకోబోతోందంటూ వస్తున్న వార్తలు అవాస్తవం.
➤ విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే ప్రతిపాదన ఏదీ లేదని టీజిజెన్కో సీఎండీ ఎస్. హరీశ్ స్పష్టం చేశారు. ఈ అంశంపై కనీసం చర్చ కూడా జరగలేదని ఆయన తెలిపారు.
➤ భవిష్యత్తులో అవసరమయ్యే బొగ్గులో G9, G11, G12 గ్రేడ్లతో సహా మొత్తం దేశీయ సరఫరా సంస్థలు నుంచే సేకరిస్తామని ఆయన తెలియజేసారు. ఇందులో సింగరేణి కాలరీస్ ప్రధానంగా ఉంటుందని, అవసరమైతే కోల్ ఇండియా సంస్థల నుండి తీసుకుంటామని తెలిపారు.
➤ టీజిజెన్కోకు రోజుకు సుమారు 80,000 టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది.
➤ ప్రస్తుతం సింగరేణి కాలరీస్ ద్వారా ఇది సరఫరా అవుతున్నప్పటికీ, భవిషత్తులో సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా, ఒకే వనరుపై ఆధార పడకుండా ఉండేందుకు కోల్ ఇండియాతో ప్రత్యామ్నాయ లింకేజీని కూడా టీజిజెన్కో ఏర్పాటు చేస్తోంది.
➤ విదేశాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే ప్రతిపాదన లేదని టీజిజెన్కో సీఎండీ చెప్పిన విషయాన్ని వార్తాపత్రిక కథనం కూడా పేర్కొంది అని గమనించగలరు.
టీజిజెన్కో
1
501
Reports suggesting that Telangana is planning to source coal from foreign countries are misleading.
➤ TSGENCO CMD S. Harish had already clarified to the newspaper that there is no proposal to source coal from foreign countries and that there has not even been any discussion on the matter.
➤ He further clarified that future coal requirements, including G9, G11 and G12 grades, will be sourced from domestic suppliers, including Singareni Collieries and Coal India.
➤ TSGENCO requires around 80,000 tonnes of coal per day. While Singareni Collieries can meet the requirement, TSGENCO is also establishing an alternative linkage with Coal India to avoid dependence on a single source in the event of supply disruptions.
➤ The newspaper report itself carried the CMD’s clarification that there was no proposal to source coal from foreign countries. Reports suggesting otherwise have therefore presented the information without the relevant context.
TSGENCO
505
సామాజిక మాధ్యమాలలో ఈ నెలాఖరులోగా మొబైల్ నంబర్‌ను లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయి.
➤ కేవలం మొబైల్ నంబర్ లింక్ చేయకపోవడం వలన డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవటం లేదా చెల్లుబాటు కోల్పోవడం జరగదు.
➤ఈ విషయంపై వివరణ ఇస్తూ, తెలంగాణ రవాణా శాఖ జాయింట్ కమీషనర్ కె వెంకటరమణ మొబైల్ నెంబర్ లింక్ చేయనంత మాత్రానా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అయ్యే అవకాశం లేదని తెలియజేశారు.
➤ ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించిన సేవలను సులభంగా పొందేందుకు మొబైల్ నంబర్‌ను లింక్ చేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు.
➤ మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే సారథి పరివాహన్ పోర్టల్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ వివరాలు, OTP వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
➤ పోర్టల్‌లో డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు కనిపించకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని లైసెన్స్ రికార్డులు వాహన్-సారథి వ్యవస్థలోకి పూర్తిగా చేరకపోవడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంటుంది.
➤ ఆన్లైన్లో లైసెన్స్ వివరాలు కనిపించని వారు సంబంధిత రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. అక్కడ అధికారులు రికార్డులను అప్డేట్ చేసి మొబైల్ నంబర్ లింక్ చేసుకునేందుకు సహాయం చేస్తారు.
తెలంగాణ రవాణా శాఖ
1
1
412

















