Fit India Foundation🇮🇳 Official retweeted
మనసున్న మస్తీపురం మారాజు మాతృభాష పరి “రక్షకుడు” ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారికి నా 60 కిలోమీటర్స్ సైక్లింగ్ ప్రయాణం అంకితం
“మస్తిష్క శకలం కలం”గా
కాలాన్ని దాటి నిలిచే అక్షర శిల్పి
ధర్మమే దారిగ న్యాయమే నడకగా
గొప్ప మానవతా పోలీస్ ఆఫీసర్,
క్రీడ ప్రేమికుడు & మారతాన్ రన్నర్
మూలాలు మరువని మట్టి బిడ్డ
రచయిత & రచయత తో పాటు,
పదజాలం లో ప్రావీణ్యుడు,
ఫిట్నెస్ లో మా అందరికి స్ఫూర్తి,
మారథాన్ రన్నర్ చిన్న స్థాయి ఆఫీసర్స్ కానిస్టేబుల్ నుండి అతి పెద్ద స్థాయి డీజీ స్థాయి ఆఫీసర్ వరకు అందరి అభిమానించే గౌరవనీయులు మన ప్రియతమా మన రమేష్ ఐపిస్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభకాంక్షలు సార్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప విజయాలను సాధించాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ..
🪴💐🎉🎂🙏🇮🇳
ఇట్లు
మధు రిజర్వు ఇన్స్పెక్టర్
@MRAMESHIPS
@CPCyberabad
@CYBTRAFFIC
@cyberabadpolice
Fit India Foundation🇮🇳 Official retweeted
అయ్యోనివా,నువు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సబ్బండ వర్గాలను ఒక్క తాటి పైకి తీసుకురావడంలో,తన పాటలతో,కలంతో అలుపెరుగని పోరాటం చేసిన, ఆదిలాబాద్ మట్టి బిడ్డ గూడ అంజన్న జయంతి నేడు.
ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
జోహార్ గూడ అంజన్న ✊
Fit India Foundation🇮🇳 Official retweeted
#SwaeroesDay
#SRSankaranIAS
#Education
నా బలం గురుకులం
************
అది 1986వ సంవత్సరం. భువనగిరిలో కొత్తగా గురుకుల పాఠశాల ప్రారంభమైంది. గురుకులంలో చదివితే మంచి విద్య లభిస్తుందని ఎవరో మా అమ్మకు చెప్పారు. వెంటనే మా అమ్మ కోదాడ జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న నన్ను మిర్యాలగూడకు తీసుకెళ్లి 9వ తరగతిలో ప్రవేశానికి పరీక్ష రాయించింది. ఆ పరీక్షలో నాకు సీటు వచ్చింది. అలా నా గురుకుల విద్యా ప్రయాణం ప్రారంభమైంది.
ఆ రోజుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు గురుకుల పాఠశాలలు ఉండేవి. ఒకటి బాలికల కోసం మట్టంపల్లిలో, మరొకటి బాలుర కోసం భువనగిరిలో. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు ఈ పాఠశాలలను ప్రారంభించారు. ఈ ఆలోచనకు ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్. శంకరన్ గారి ఆశయాలు,పట్టుదల ఎంతో కీలకం.
మేము చదువుకున్న రోజుల్లో సరైన భవనాలు, బాత్రూములు, ఇతర మౌలిక సదుపాయాలు ఉండేవి కావు. నాణ్యమైన భోజనం లభించకపోయేది.అయినప్పటికీ, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు మాకు మంచి విద్యను అందించేవారు. చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థుల మధ్య, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో మేము ముందుకు సాగాం.
నల్గొండ జిల్లా నలుమూలల నుంచి, అన్ని కులాలు, మతాలకు చెందిన పిల్లలు అక్కడ చదువుకునేవారు. కలిసి జీవించడం ద్వారా Sharing and Caring — పంచుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం వంటి విలువలను నేర్చుకున్నాం. చదువుపై ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం అలవడ్డాయి.
గురుకులం నాకు మంచి విద్యతోపాటు జీవితంలో ముందుకు సాగడానికి అవసరమైన పునాదిని, సరైన మార్గదర్శకత్వాన్ని అందించింది. ఆ పునాదితోనే నేను తదుపరి చదువుల్లో ముందుకు వెళ్లి ప్రతిష్ఠాత్మక ఉస్మానియా వైద్య కళాశాలలో సీటు సంపాదించగలిగాను.
నాతోపాటు చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు నేడు ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు, రాజకీయ నాయకులుగా, విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడినవారిగా ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.
గురుకుల పాఠశాలలు కేవలం చదువు చెప్పే సంస్థలు కావు. అవి పేద పిల్లల జీవితాలను మార్చే వేదికలు. ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, నాణ్యమైన విద్య, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం లభిస్తే పిల్లలు ఉన్నత శిఖరాలను చేరుకోగలరని మా జీవితాలే నిరూపిస్తున్నాయి.
మేమంతా జీవితాల్లో స్థిరపడిన తర్వాత, మా పాఠశాల పట్ల కృతజ్ఞతను చేతల్లో చూపించాలని నిర్ణయించుకున్నాం. ప్రతి సంవత్సరం నవంబర్ రెండవ ఆదివారం మా గురుకుల పాఠశాలకు వెళ్లి, అక్కడి విద్యార్థులను కలుస్తాం. మా అనుభవాలను వారితో పంచుకుంటాం. వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తూ, వారి చదువులకు తోడ్పడతాం.2012లో @RSPraveenSwaero గారు సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గురుకులాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడమే కాకుండా కాకుండా విద్యార్థులు చదువుల్లో క్రీడల్లో ఎన్నెన్నో ఘన విజయాలు సాధించారు . ఆయన పిలుపుతో విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాల్లో మేము మరింత చురుగ్గా పాల్గొనడం ప్రారంభించాం. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేలా ప్రేరేపించాం.
తదుపరి కాలంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, ఆంగ్ల భాషా బోధనలో అభివృద్ధి జరగడం వల్ల విద్యార్థులకు మరిన్ని అవకాశాలు లభిస్తున్నాయి. గురుకుల విద్య ద్వారా పిల్లల జీవితాల్లో వస్తున్న సానుకూల మార్పు ఎంతో సంతోషాన్నిస్తోంది.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ఆశయంతో గురుకుల విద్యకు స్ఫూర్తినిచ్చిన ఎస్.ఆర్. శంకరన్ గారి సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఆయన జన్మదినమైన అక్టోబర్ 22ను గురుకుల పూర్వ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా స్వేరోస్ డే గా జరుపుకుంటారు .
ప్రభుత్వాలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒక్కటే: విద్య, వైద్యం సమాజంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి.
ముఖ్యంగా పేద, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, సమర్థులైన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధన ఉండాలి. అదే విధంగా ప్రతి ఒక్కరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం లభించాలి.
విద్య, వైద్యం వంటి రంగాల్లో ప్రభుత్వాలు పెట్టే పెట్టుబడి సమాజ భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి. ఈ అవకాశాలు అన్ని వర్గాల ప్రజలకు సమానంగా అందినప్పుడే అసమానతలు తగ్గి, సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది.
గురుకుల విద్య నా జీవితానికి పునాది వేసింది. నా లాంటి ఎంతోమంది పేద పిల్లలకు ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాన్ని కల్పించింది. ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన విద్య అందే సమాజాన్ని నిర్మించడమే ఎస్.ఆర్. శంకరన్ గారి ఆశయాలకు మనం అందించగలిగే అత్యుత్తమ నివాళి.
డా॥ శ్రీకాంత్
పీడియాట్రిషియన్
హైదరాబాద్
Fit India Foundation🇮🇳 Official retweeted
📢 గురుకులాల్లో రూ. 2000 కోట్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి!
రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న రూ. 2000 కోట్ల కుంభకోణాన్ని ప్రశ్నిస్తుంటే..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు సమాధానం దాటవేస్తున్నారు. కేవలం రూ. 687 కోట్ల కాంట్రాక్టులు మాత్రమే ఇచ్చామని చెబుతూ,
ఈ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పిల్లలకు న్యాయం జరగాలన్నదే మా ఉద్దేశం.
కానీ కాస్మెటిక్ ఛార్జీల పెంపు పేరుతో జరుగుతున్న అవినీతిని మేము నిలదీస్తుంటే, కావాలనే పిల్లలకు వస్తువులు అందకుండా బీఆర్ఎస్ పార్టీ కక్షగట్టి అడ్డుకుంటోందని, మేమే పిల్లలకు వ్యతిరేకం అని మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. కుంభకోణాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం ప్రభుత్వ వైఫల్యమే!
ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
@RSPraveenSwaero
Fit India Foundation🇮🇳 Official retweeted
క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే లక్ష్యంతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ఆధ్వర్యంలో ఈ రోజు గచ్చిబౌలి స్టేడియంలో ‘ఫిట్ ఇండియా – సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రములలో గౌరవ సైబరాబాద్ కమీషనర్
శ్రీ డా ఎమ్ రమేష్ ఐ పి ఎస్ గారు గౌరవ అతిథి గా పాల్గోనడం జరిగింది ..
@CPCyberabad
@MRAMESHIPS
#sundaysoncycle #fitindia #sportsauthorityoftelangana
#Cyberabadpolice
Fit India Foundation🇮🇳 Official retweeted
అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్.
#Ambedkar
💐💐💐🙏🙏🙏
Fit India Foundation🇮🇳 Official retweeted
Great going, Puneet.
Keep it up✊
ఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిర్వహించిన మార్తాన్ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకుడు.. గల్లీలో కూడా చదువుకునే స్తోమత లేని వందల మంది పేద విద్యార్థులను ఢిల్లీ యూనివర్శిటీ కి తీసుకెళ్ళిన మొనగాడు నిఖార్సైన అసలు సిసలైన నాయకుడు డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సర్ గారి తనయుడు రేపల్లె పునీత్ గారు.. మీరు ఇలాగే మాలాంటి వారికి స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను..
@puneetrepalle
@RSPraveenSwaero
#PuneetAnna #YoungLeader #NextGenLeader
Fit India Foundation🇮🇳 Official retweeted
Gym lo Boss RSP 💪🔥
Body ki strength, society ki direction!
#BossRSP #GymLife #LeaderByExample #Discipline #FitnessMotivation
@RSPraveenSwaero
Frames of a Super Semi-Final Win! 📸
#TeamIndia is all set to take on New Zealand in the #Final 💪
#T20WorldCup | #MenInBlue
Fit India Foundation🇮🇳 Official retweeted
Wish you a happy married life, Vijay Devarakonda and Rashmika. Hope you will continue to inspire the young generation with your hard work and commitment to your profession. Never Give Up.
💐💐💐
#Virosh
Fit India Foundation🇮🇳 Official retweeted
రేవంత్ రెడ్డి గారు,
మీరే హోమ్ మంత్రి. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి.
కానీ మీరు అన్నెం పున్నెం ఎరుగని @BRSparty నాయకులను అరెస్టు చేయడంలో బిజీగా ఉన్నారు.
Fit India Foundation🇮🇳 Official retweeted
బహుజన వర్గాల్లో పుట్టి,ఎన్నో అవమానాలను ఎదుర్కొని,వివక్షను అధిగమించి, 12 వేల కిలోమీటర్ల మేర,300 కోటలను నిర్మించి,దేశంలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి నేడు.
1657 లో ముంబై సమీపంలో ఉన్న ఆనాటి కళ్యాణ్ కోటను గెలిచి,రాజు కుమార్తెను బంధీగా తీసుకొస్తే... "మా తల్లి కూడా నీ అంత అందంగా ఉంటే, నేను కూడా నీలా అందంగా ఉండేవాన్ని" అని తల్లితో పోల్చి గౌరవించిన మహోన్నత విలువలు కలిగిన మహారాజు శివాజీ.
ఇంటలిజెన్స్ వ్యవస్థను తప్పుపడుతూ ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసే కుట్రలు ప్రస్తుత ప్రభుత్వంలో చూస్తున్నాం. కానీ
ఆనాడే పటిష్ఠమైన గూఢచర వ్యవస్థ (ఇంటలిజెన్స్ నెట్వర్క్) ప్రారంభించి,శత్రు దేశాల/రాజుల సమాచారాన్ని సేకరించి, వ్యూహరచనతో శత్రు రాజ్యాలను మట్టికరిపించిన మహారాజు శివాజీ గొప్పతనాన్ని,అన్ని మతాలను గౌరవించి,ఆదరించిన లౌకిక భావనను గుర్తు చేసుకుందాం.
కేవలం ఒక మతానికే చెందిన వ్యక్తిగా,ఇంకో మతాలను కించపరిచారంటూ శివాజీని స్వార్థరాజకీయాలకు వాడుకుంటున్న కొన్ని పార్టీలకు బుద్దిచెబుదాం.
ఆ మహనీయునికి ఘన నివాళి అర్పిద్దాం.
జై శివాజీ✊
Fit India Foundation🇮🇳 Official retweeted
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
Happy Sankranthi to Everyone
सभी को संक्रांति पर्व पर हार्दिक शुभकामनाएँ
💐💐💐
Fit India Foundation🇮🇳 Official retweeted
ఆకలి చావుల అంచున కాగజ్ నగర్ మునిసిపాలిటీ కార్మికులు:
సిర్పూర్ నియోజకవర్గం, కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్మికులకు 5 నెలల నుండి జీతాలు రావడం లేదని, 13 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
అయినా సంబంధిత శాఖా మంత్రి సీయం రేవంత్ రెడ్డి గారు,అధికారులు పట్టించుకోకపోవడంతో చేసేదేమీ లేక కార్మికులు రాత్రి మున్సిపాలిటీ కార్యాలయం ముందే, ఎముకలు కొరికే చలిలో పడుకొని నిరసన తెలిపారు. కార్మికులకు మద్దతుగా నేను కూడా వారికి సంఘీభావం తెలిపాను.
సమ్మె వల్ల గత పది రోజులుగా కాగజ్ నగర్ పట్టణం దుర్గంధంతో నిండిపోయింది. ఇళ్లకు నీరు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించిన పాపానికి కార్మికులను,ప్రజలను ఇలా గోస పెడుతరా?
వాల్లేమీ జీతాలు పెంచాలని అడగడం లేదు,ప్రమోషన్స్ కావాలని అడగడం లేదు. వారికి ప్రతి నెలా రావాల్సిన జీతాలనే హక్కుగా అడుగుతున్నారు.
మీకు ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ప్రజలే లేని ఫ్యూచర్ సిటీ ముఖ్యమా? కార్మికులకు 3 కోట్లు కూడా ఇవ్వడం లేదు,కానీ ఫ్యూచర్ సిటీ కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు! ఇదేనా ప్రజాపాలన?
కార్మికులంటే లెక్క లేదా? వాల్లు ఆకలితో అలమటిస్తూ చనిపోయినా పట్టించుకోరా?
మీరేమో ఫ్యూచర్ సిటీ అంటరు.
స్థానిక బిజెపి ఎమ్మెల్యే హరీష్ బాబు గారు అసెంబ్లీలో హాయిగా నిద్ర పోతరు.
ఇక మా బాధలు చూసేదెవ్వరు?
ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే వారి బకాయిలు చెల్లించి,ఆదుకోకపోతే హైదరాబాద్ వచ్చి మీ ఆఫీస్ ముందే నిరవధిక నిరాహార దీక్ష చేస్తాం.
✊
@TelanganaCMO @revanth_anumula @KTRBRS @BRSparty @ANI @PTI_News
#SirpurFirst #Kagaznagar #SaveSanitationWorkers
Fit India Foundation🇮🇳 Official retweeted
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
I wish you all a healthy, happy, and prosperous new year 2026
आप सभी को नया साल २०२६ का मुबारक
💐💐💐
Fit India Foundation🇮🇳 Official retweeted
దీక్షా దివస్ స్ఫూర్తితో కేసిఆర్ వలే పోరాటానికి సిద్ధమైతేనే దోపిడి,కమీషన్ల ప్రభుత్వాన్ని గద్దె దింపి,తెలంగాణను దేశంలోనే నెం.1 రాష్ట్రంగా అభివృద్ధి చేసుకోగలం,కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సస్యశ్యామలం చేసుకోగలం.
తెలంగాణ అమరుల ఆశయాలు,ఆకాంక్షలను నిజం చేయాలంటే,ఢిల్లీకి మూటలు మోసే ప్రభుత్వాన్ని,ఇసుక దందాల కోసం ప్రాజెక్టులను కూల్చే దొంగలను ఓడించాలంటే మన కేసిఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి.
జై తెలంగాణ.
#DeekshaDivas
Fit India Foundation🇮🇳 Official retweeted
భారత దేశ ఐక్యతకు ప్రతీకగా అయిన సర్దార్ వల్లభ్బయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏ రైడ్ ఫర్ యూనిటీ పేరుతో ఫిట్ ఇండియా మూవ్మెంట్ లో భాగముగా జాతీయ స్థాయిలో నిర్వహించిన కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు” సైకిల్ యాత్ర లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ సైక్లింగ్ అథ్లెట్ రెగల్లా గోపీ, పి సి 3360, సి ఏ ఆర్ ఖమ్మం యూనిట్కు చెందిన పోలీసు గారు పాల్గొని విజయవంతముగా పూర్తిచేసారు
ఈ సందర్భముగా గౌరనీయులు
శ్రీ డా రమేష్ రెడ్డి ఐ పి స్ ఐ జి పి తెలంగాణ పోలీస్ (స్పోర్ట్స్ ) గారు సైక్లింగ్ విభాగంలో ప్రతిభ కనబర్చిన గోపి గారిని 10000 రూపాయిల కాష్ రివార్డ్ తో గొప్పగా అభినందనలు తెలిపారు,
తెలంగాణ పోలీస్ శాఖకు గౌరవాన్ని ప్రతిష్టను తీసుకువస్తూ క్రీడా రంగంలో విశేష ప్రతిభను కనబరుస్తున్న పోలీస్ క్రీడాకారులందరిని శిక్షణ సౌకర్యాల అభివృద్ధి, అథ్లెట్లకు అవసరమైన ప్రోత్సాహం వంటి అంశాలను ముందుకు తీసుకెళ్లేందుకు పోలీస్ స్పోర్ట్స్ విభాగం నిరంతర కృషి చేస్తుందని డా. రమేష్, ఐజి పేర్కొన్నారు.
రవి చూపించిన క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నిబద్ధత తెలంగాణ పోలీస్ శాఖ విలువలను ప్రతిబింబిస్తోందని మెచ్చుకున్నారు. .
ధన్యవాదములు సార్ 🪴🙏
@MRAMESHIPS
@TelanganaCOPs
@TelanganaDGP
instagram.com/reel/DRdyv7Wk3…
Fit India Foundation🇮🇳 Official retweeted
నిన్న నా పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, వీలయిన ప్రతిచోటా ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చేపట్టిన అందరు శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మేము సిర్పూర్-కాగజ్ నగర్ పట్టణంలో వేయి మందికి పైగా FitIndiaFoundation ఆధ్వర్యంలో 5K రన్ చేశాం, రక్తదానం కూడా చేసినం.
ప్రత్యేకించి నా కోసం 59 కిలోమీటర్ల దూరం పరిగెత్తిన ఫిట్ ఇండియా సంస్థ మాజీ అధ్యక్షులు సోదరులు చిన్నపాక స్వామి గారికి ప్రత్యేక అభినందనలు.💐💐💐
#FitIndia
#Swaeroes
#PratigyaDivas
Fit India Foundation🇮🇳 Official retweeted
Swaero Annual Convention happening on the banks of the mighty Ganga River in Uttar Pradesh. When the time comes for an idea, no force on the Earth can stop it.
उत्तर प्रदेश में गंगा नदी के किनारे पर स्वेरो बैठक हो रही है। जब किसी विचार का समय आता है, तो पृथ्वी की कोई भी शक्ति उसे रोक नहीं सकती।
గంగా నది తీరంలో ఎముకలు కొరికే చలిలో సైతం జ్ఞాన యుద్దం కోసం మేధోమథనం చేస్తున్న స్వేరో శ్రేణులు.
@Swaeroes4u
#Swaeroism #WisdomWar

























