SHO Mehdipatnam (@HumayunnagarPS) header
SHO Mehdipatnam (@HumayunnagarPS) profile picture

S. Mallesh, Inspector of Police Ph: 8712660420

Royal Colony, Mehdipatnam, Hyd
Joined September 2022
Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)Photo by SHO Mehdipatnam (@HumayunnagarPS)
One Unknown Male Dead Body named Dheeraj Gomes aged about 65 Years fell unconscious near Hakeempet Dargah and admitted in OGH, further he exipred while undergoing treatment on 12.10.2026 and the dead body preserved in OGH Mortuary Box No: B-4. If any inf found con: 8712660422.
74
𝐀𝐬 𝐭𝐡𝐞 𝐚𝐮𝐬𝐩𝐢𝐜𝐢𝐨𝐮𝐬 𝐟𝐞𝐬𝐭𝐢𝐯𝐚𝐥 𝐨𝐟 𝐆𝐚𝐧𝐞𝐬𝐡 𝐂𝐡𝐚𝐭𝐮𝐫𝐭𝐡𝐢 𝐚𝐩𝐩𝐫𝐨𝐚𝐜𝐡𝐞𝐬 𝐂𝐢𝐭𝐢𝐳𝐞𝐧𝐬 𝐩𝐥𝐚𝐧𝐧𝐢𝐧𝐠 𝐭𝐨 𝐢𝐧𝐬𝐭𝐚𝐥𝐥 𝐆𝐚𝐧𝐞𝐬𝐡 𝐢𝐝𝐨𝐥𝐬 𝐚𝐫𝐞 𝐰𝐚𝐫𝐦𝐥𝐲 𝐞𝐧𝐜𝐨𝐮𝐫𝐚𝐠𝐞𝐝 𝐭𝐨 𝐜𝐨𝐦𝐩𝐥𝐞𝐭𝐞 𝐭𝐡𝐞 𝐢𝐧𝐭𝐢𝐦𝐚𝐭𝐢𝐨𝐧 𝐩𝐫𝐨𝐜𝐞𝐬𝐬 𝐞𝐚𝐫𝐥𝐲, 𝐡𝐞𝐥𝐩𝐢𝐧𝐠 𝐞𝐧𝐬𝐮𝐫𝐞 𝐚 𝐬𝐦𝐨𝐨𝐭𝐡, 𝐩𝐞𝐚𝐜𝐞𝐟𝐮𝐥 & 𝐬𝐚𝐟𝐞 𝐜𝐞𝐥𝐞𝐛𝐫𝐚𝐭𝐢𝐨𝐧 𝐘𝐨𝐮 𝐠𝐢𝐯𝐞 𝐮𝐬 𝐢𝐧𝐟𝐨. 𝐖𝐞 𝐡𝐞𝐥𝐩 𝐲𝐨𝐮 𝐢𝐧 𝐬𝐦𝐨𝐨𝐭𝐡 𝐆𝐚𝐧𝐞𝐬𝐡. Link : policeportal.tspolice.gov.in… #ganeshfestival2026 #hyderabadganesh #ganpatibappamorya
44
➡️సామాన్యుడిలా బైక్‌పై వచ్చి.. కేబీఆర్ వన్ వే ట్రాఫిక్‌ను పరిశీలించిన నగర సీపీ సజ్జనర్ ✳️కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో కొత్తగా అమల్లోకి తెచ్చిన వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్వయంగా పరిశీలించారు. గురువారం ఉదయం 10 గంటలకు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, సాధారణ పౌరుడిలా సివిల్ దుస్తుల్లో బైక్‌పై ప్రయాణిస్తూ క్షేత్రస్థాయి ట్రాఫిక్ ను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ✳️రోడ్ నంబర్ 45 నుంచి జూబ్లీ చెక్‌పోస్ట్‌, వెంకటగిరి, కేబీఆర్ పార్క్ ప్రధాన గేటు, ముగ్ధ జంక్షన్, బసవతారకం, అగ్రసేన్ చౌరస్తా, ఫిల్మ్‌నగర్ జంక్షన్ మీదుగా తిరిగి రోడ్డు నంబర్ 45 వరకు రెండు సార్లు బైక్‌పై తిరుగుతూ ట్రాఫిక్ ను పరిశీలించారు. ✳️అనంతరం మధ్యాహ్నం వేళల్లో కూడా మరోసారి ట్రాఫిక్ సరళిని పర్యవేక్షించారు. అగ్రసేన్‌ చౌరస్తా, ఫిల్మ్‌నగర్‌, జర్నలిస్ట్‌ కాలనీ, జూబ్లీ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్కు ప్రధాన గేటు తదితర కూడళ్ల వద్ద విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ✳️ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ సాఫీగా సాగుతోందని అన్నారు. బుధవారం నుంచి వన్‌వే విధానాన్ని అమలులోకి తెచ్చామని, మొదటి రోజు లేన్ల మార్పిడి విషయంలో వాహనదారులు కాస్త అయోమయానికి గురైనప్పటికీ, గురువారం నాటికి రాకపోకలు పూర్తిగా సాఫీగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ✳️వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జంక్షన్లలో స్పష్టమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు తగినంత మంది సిబ్బందిని కూడా మోహరించినట్లు వివరించారు. ✳️జీహెచ్‌ఎంసీ, నిర్మాణ ఏజెన్సీతో సమన్వయం చేసుకుంటూ హెచ్-సిటీ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పనులు పూర్తయ్యేంత వరకు నగరవాసులు సహకరించాలని, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.
44
🇮🇳 **80 Years of Freedom. One Nation. One Spirit.** 🇮🇳 From the courage of our freedom fighters to the dreams of a new generation, India’s journey is a story of **strength, unity and hope.** Hyderabad City Police wishes everyone a proud and inspiring 80th Independence Day 🇮🇳. #SaluteOurHeroes #HappyIndependenceDay2026
36
✳️సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం: హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌ ✳️విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లతో 'సైబర్ జాగరూకత దివాస్' అవగాహన సదస్సు ✳️అధికారులతో కలిసి ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్ ఆవిష్కరణ ➡️కష్టార్జితాన్ని సైబర్‌ నేరగాళ్ల చేతిలో పెట్టి మోసపోవద్దని, విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ హెచ్చరించారు. 'సైబర్ జాగరూకత దివాస్' పురస్కరించుకుని సిటీ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బుధవారం విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనర్‌.. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు రతన్, మాలకొండయ్య, విశ్రాంత ఈఎన్సీ కరీంలతో కలిసి సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ➡️సదస్సులో సీపీ సజ్జన‌ర్ మాట్లాడుతూ.. సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయని తెలిపారు. నగరంలో ఒక ఏడాది కాలంలో దొంగతనాలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాల వల్ల రూ.30 కోట్ల నష్టం వాటిల్లితే.. ఒక్క సైబర్ నేరాల రూపంలోనే బాధితులు ఏకంగా రూ.400 కోట్లకు పైగా కోల్పొతున్నార‌ని తెలిపారు. అంటే సగటున రోజుకు రూ.కోటికి పైగా ప్రజల సొమ్ము కేటుగాళ్ల ఖాతాల్లోకి మళ్లుతోందన్నారు. విశ్రాంత ఉద్యోగుల డిజిటల్, భౌతిక భద్రతకు నగర పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ➡️సీనియర్ సిటిజన్లను డిజిటల్ అరెస్టులు, పింఛను సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ మోసాలకు గురిచేస్తున్నార‌ని వివరించారు. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ లేదా పోలీసు అధికారులమని చెప్పి డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. మన చట్టాల్లో గానీ, పోలీసు వ్యవస్థలో గానీ ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానమే లేదని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి అలాంటి ఫోన్‌ కాల్స్‌ రాగానే భయపడకుండా వెంటనే కట్ చేయాలని సూచించారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు, ట్రేడింగ్ లింక్‌లను చూసి మోసపోవద్దన్నారు. షేర్ ట్రేడింగ్ ను సెబీ ఆమోదించిన రిజిస్టర్డ్ బ్రోకర్లు, అధీకృత డీమ్యాట్ ఖాతాల ద్వారానే చేయాల‌ని చెప్పారు. ➡️ఇంట్లోని పిల్లలు ఫోన్‌లు తీసుకుని ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లలో సభ్యత్వం తీసుకోవడం వల్ల కూడా పెద్దల రిటైర్‌మెంట్ సొమ్ము మాయమవుతుందంటూ కొన్ని ఘటనలను గుర్తుచేశారు. బ్యాంకింగ్ వివరాలు, పిన్‌ నంబర్లు, ఓటీపీలను కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. ఒకవేళ అజాగ్రత్త వల్ల సైబర్ మోసానికి గురైతే, తక్షణమే స్పందించి గోల్డెన్ అవర్ లో 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే సమాచారం ఇస్తే బాధితుల సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ➡️అనంతరం మాజీ డీజీపీ శ్రీ ఎమ్. రతన్ మాట్లాడుతూ.. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు తన ఖాతా నుంచి రూ. 5,000 కంటే ఎక్కువ మొత్తానికి చెక్కులు వచ్చినా, విత్‌డ్రాయల్స్ ఉన్నా తన ముందస్తు అనుమతి లేనిదే క్లియర్ చేయవద్దని బ్యాంకులకు స్వయంగా సూచించినట్లు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఓటీపీలను ఇతరులతో ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని ఆయన హెచ్చరించారు. సీనియర్ సిటిజన్లు తమ ఫోన్‌లను పిల్లల చేతికి ఇచ్చేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు తెలియక ఏదైనా బటన్ లేదా సందేహాస్పద లింక్‌ను నొక్కడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ➡️మరొక అతిథి, మాజీ డీజీపీ శ్రీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. సైబర్ నేరం జరిగిన తర్వాత బాధితులు ఎంత ఆవేదన పడినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా పోగొట్టుకున్న డబ్బును తిరిగి సాధించడం చాలా కష్టమని పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల నష్టంతో పోలిస్తే రికవరీ అయ్యే మొత్తం అత్యంత స్వల్పం కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు పాటించడమే సైబర్ నేరాలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. అవగాహన లోపం వల్ల సీనియర్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉన్నత విద్యావంతులు సైతం కేటుగాళ్ల బురిడీ మాటలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధానమైన పొదుపు ఖాతాను వాడకుండా, తక్కువ మొత్తం ఉండేలా మరో ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరిచి దాన్ని మాత్రమే ఉపయోగించాలని సలహా ఇచ్చారు. ➡️అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని, అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల పౌరులు ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలన్నారు. నగరంలో సైబర్ నేరాల నియంత్రణకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు క్రైమ్ విభాగం నిరంతరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఒకవేళ సైబర్ మోసం జరిగితే బాధితులు స్వల్ప సమయంలోనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే త్వరితగతిన స్పందించేందుకు వీలవుతుందని చెప్పారు. మోసం జరిగిన వెంటనే సమాచారం అందిస్తే నేరస్థుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, బాధితుల సొమ్మును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. ➡️ఈ అవగాహన సదస్సులో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్ రమణా నాయక్, గౌరవ కార్యదర్శి రమేష్ మర్రి, డీసీపీలు శ్రీమతి శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీ ర‌మ‌ణారెడ్డి, రాజేశ్, నగర సైబర్ క్రైమ్ విభాగ ఏసీపీ శ్రీ శివ‌మారుతి, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
35
సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల బందోబస్తు చర్యల్లో భాగంగా మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత ‘క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’ను హైదరాబాద్‌ సీపీ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవస్థ పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ (క్రైమ్స్‌) శ్రీనివాసులు, సికింద్రాబాద్‌ జోన్‌ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌, సీసీఎస్‌ డీసీపీ చైతన్య కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. #Bonalu2026 #SecunderabadBonalu #UjjainiMahankali #HyderabadCityPolice #AISurveillance #SafeBonalu #FestivalSecurity
31
ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్ బోనాల ఉత్సవాల్లో తొలిసారిగా ఏఐ సాంకేతికతతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన, అమ్మవారికి పట్టువస్త్రాలు, బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్క‌డ హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నగర సీపీ సజ్జనర్ మీడియాతో మాట్లాడుతూ... భాగ్యనగరంలో ఆషాఢ బోనాల పండుగకు ఘనమైన చారిత్రక నేపథ్యం ఉందన్నారు. ప్రస్తుతం నగరవ్యాప్తంగా ఉత్సవాలు అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో సాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట బోనాల జాతరలు ప్రశాంతంగా ముగియగా, ప్రస్తుతం శ్రీ ఉజ్జయిని మహంకాళి, లాల్‌దర్వాజా అమ్మవార్ల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వివరించారు. భక్తుల భద్రత, రక్షణే ధ్యేయంగా హైదరాబాద్ సిటీ పోలీస్ శాఖ పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకలకు దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, నిఘా వ్యవస్థను మహంకాళి ఆలయం వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అత్యాధునిక ఏఐ వ్యవస్థ ద్వారా ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలతో ముఖాలను విశ్లేషించే 'ఫేషియల్ రికగ్నిషన్' సాంకేతికతను ఉపయోగిస్తున్నామన్నారు. దీనివల్ల పాత నేరస్థులు, గొలుసు దొంగలు, జేబుదొంగలను తక్షణమే గుర్తించి అప్రమత్తమయ్యే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. అలాగే ఆలయంలోకి వచ్చే, వెళ్లే భక్తుల సంఖ్యను క్యూ మేనేజ్‌మెంట్ ద్వారా కచ్చితంగా లెక్కిస్తామని పేర్కొన్నారు. ఆలయం లోపల వివిధ విభాగాలు, క్యూలైన్లలో భక్తుల రద్దీ సాంద్రతను 'థ్రెషోల్డ్ మ్యాపింగ్' ద్వారా నిరంతరం విశ్లేషిస్తూ, పరిమితికి మించి రద్దీ పెరిగితే ముందస్తు చర్యల ద్వారా తొక్కిసలాటలు జరగకుండా నివారిస్తామని స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటున్నామని వివరించారు. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవాలని, జాతర విజయవంతంగా పూర్తయ్యేలా పోలీసు శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి రక్షిత కృష్ణమూర్తి, ఐపీఎస్, ట్రాఫిక్-1 డీసీపీ శ్రీ అవినాశ్ కుమార్, ఐపీఎస్, అదనపు డీసీపీ నర్సయ్య, ఏసీపీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
29
✳️సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం: హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనర్‌ ✳️విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లతో 'సైబర్ జాగరూకత దివాస్' అవగాహన సదస్సు ✳️అధికారులతో కలిసి ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్ ఆవిష్కరణ ➡️కష్టార్జితాన్ని సైబర్‌ నేరగాళ్ల చేతిలో పెట్టి మోసపోవద్దని, విశ్రాంత ఉద్యోగులు, సీనియర్ సిటిజన్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్ హెచ్చరించారు. 'సైబర్ జాగరూకత దివాస్' పురస్కరించుకుని సిటీ సైబర్ క్రైమ్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో బుధవారం విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సజ్జనర్‌.. ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు రతన్, మాలకొండయ్య, విశ్రాంత ఈఎన్సీ కరీంలతో కలిసి సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించే ‘సురక్ష కా తిరంగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ➡️సదస్సులో సీపీ సజ్జన‌ర్ మాట్లాడుతూ.. సాంకేతికత పెరిగేకొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయని తెలిపారు. నగరంలో ఒక ఏడాది కాలంలో దొంగతనాలు, దోపిడీల వంటి సంప్రదాయ నేరాల వల్ల రూ.30 కోట్ల నష్టం వాటిల్లితే.. ఒక్క సైబర్ నేరాల రూపంలోనే బాధితులు ఏకంగా రూ.400 కోట్లకు పైగా కోల్పొతున్నార‌ని తెలిపారు. అంటే సగటున రోజుకు రూ.కోటికి పైగా ప్రజల సొమ్ము కేటుగాళ్ల ఖాతాల్లోకి మళ్లుతోందన్నారు. విశ్రాంత ఉద్యోగుల డిజిటల్, భౌతిక భద్రతకు నగర పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ➡️సీనియర్ సిటిజన్లను డిజిటల్ అరెస్టులు, పింఛను సేవలు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ మోసాలకు గురిచేస్తున్నార‌ని వివరించారు. సీబీఐ, ఈడీ, ఆర్‌బీఐ లేదా పోలీసు అధికారులమని చెప్పి డిజిటల్ అరెస్ట్ పేరిట బెదిరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దన్నారు. మన చట్టాల్లో గానీ, పోలీసు వ్యవస్థలో గానీ ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానమే లేదని స్పష్టం చేశారు. అపరిచిత వ్యక్తుల నుంచి అలాంటి ఫోన్‌ కాల్స్‌ రాగానే భయపడకుండా వెంటనే కట్ చేయాలని సూచించారు. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూప్‌ల ద్వారా వచ్చే ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు, ట్రేడింగ్ లింక్‌లను చూసి మోసపోవద్దన్నారు. షేర్ ట్రేడింగ్ ను సెబీ ఆమోదించిన రిజిస్టర్డ్ బ్రోకర్లు, అధీకృత డీమ్యాట్ ఖాతాల ద్వారానే చేయాల‌ని చెప్పారు. ➡️ఇంట్లోని పిల్లలు ఫోన్‌లు తీసుకుని ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌లలో సభ్యత్వం తీసుకోవడం వల్ల కూడా పెద్దల రిటైర్‌మెంట్ సొమ్ము మాయమవుతుందంటూ కొన్ని ఘటనలను గుర్తుచేశారు. బ్యాంకింగ్ వివరాలు, పిన్‌ నంబర్లు, ఓటీపీలను కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. ఒకవేళ అజాగ్రత్త వల్ల సైబర్ మోసానికి గురైతే, తక్షణమే స్పందించి గోల్డెన్ అవర్ లో 1930 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వెంటనే సమాచారం ఇస్తే బాధితుల సొమ్మును ఫ్రీజ్ చేసి తిరిగి రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ➡️అనంతరం మాజీ డీజీపీ శ్రీ ఎమ్. రతన్ మాట్లాడుతూ.. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు తన ఖాతా నుంచి రూ. 5,000 కంటే ఎక్కువ మొత్తానికి చెక్కులు వచ్చినా, విత్‌డ్రాయల్స్ ఉన్నా తన ముందస్తు అనుమతి లేనిదే క్లియర్ చేయవద్దని బ్యాంకులకు స్వయంగా సూచించినట్లు తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఓటీపీలను ఇతరులతో ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోవద్దని ఆయన హెచ్చరించారు. సీనియర్ సిటిజన్లు తమ ఫోన్‌లను పిల్లల చేతికి ఇచ్చేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలు తెలియక ఏదైనా బటన్ లేదా సందేహాస్పద లింక్‌ను నొక్కడం వల్ల బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము క్షణాల్లో ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నారు. ➡️మరొక అతిథి, మాజీ డీజీపీ శ్రీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. సైబర్ నేరం జరిగిన తర్వాత బాధితులు ఎంత ఆవేదన పడినా, పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా పోగొట్టుకున్న డబ్బును తిరిగి సాధించడం చాలా కష్టమని పేర్కొన్నారు. వందల కోట్ల రూపాయల నష్టంతో పోలిస్తే రికవరీ అయ్యే మొత్తం అత్యంత స్వల్పం కాబట్టి, ముందస్తు జాగ్రత్తలు పాటించడమే సైబర్ నేరాలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. అవగాహన లోపం వల్ల సీనియర్ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉన్నత విద్యావంతులు సైతం కేటుగాళ్ల బురిడీ మాటలకు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ డిజిటల్ లావాదేవీల కోసం ప్రధానమైన పొదుపు ఖాతాను వాడకుండా, తక్కువ మొత్తం ఉండేలా మరో ప్రత్యేక బ్యాంక్ ఖాతాను తెరిచి దాన్ని మాత్రమే ఉపయోగించాలని సలహా ఇచ్చారు. ➡️అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతితో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని, అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల పౌరులు ఎల్లప్పుడూ జాగరూకతతో ఉండాలన్నారు. నగరంలో సైబర్ నేరాల నియంత్రణకు, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు క్రైమ్ విభాగం నిరంతరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఒకవేళ సైబర్ మోసం జరిగితే బాధితులు స్వల్ప సమయంలోనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా ఎన్‌సీఆర్పీ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే త్వరితగతిన స్పందించేందుకు వీలవుతుందని చెప్పారు. మోసం జరిగిన వెంటనే సమాచారం అందిస్తే నేరస్థుల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి, బాధితుల సొమ్మును రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేశారు. ➡️ఈ అవగాహన సదస్సులో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ చైర్మన్ రమణా నాయక్, గౌరవ కార్యదర్శి రమేష్ మర్రి, డీసీపీలు శ్రీమతి శిల్పవల్లి, ఐపీఎస్, శ్రీ ర‌మ‌ణారెడ్డి, రాజేశ్, నగర సైబర్ క్రైమ్ విభాగ ఏసీపీ శ్రీ శివ‌మారుతి, అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విశ్రాంత అధికారులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
50
HEAVY RAINS IN HYDERABAD: JT. CP TRAFFIC SRI JOEL DAVIS, IPS CONDUCTS FIELD INSPECTION AT WATERLOGGING POINTS HYDERABAD: In view of the heavy rainfall across Hyderabad today, Joint Commissioner of Police (Traffic), Hyderabad City, Sri Joel Davis, IPS, appealed to all city residents to remain alert and cautious. To ensure smooth traffic flow and safety, the Joint CP personally conducted field inspections at major waterlogging points, including Lakdikapul, Ayodhya Junction, and PTI Masab Tank. During the inspection, Sri Joel Davis, IPS, reviewed the water drainage arrangements and traffic regulation measures on the ground. As rainwater accumulation has slowed down vehicle movement in several parts of the city, traffic personnel are actively deployed on the roads to manage traffic flow. Advisory for Citizens and Commuters: •Avoid Unnecessary Travel: Citizens are strongly advised to stay indoors and refrain from step out unless it is absolutely necessary. •Drive Safely and Follow Instructions: Commuters on the road must drive cautiously at very low speeds and strictly follow the directions of traffic police personnel on duty. •Plan Extra Travel Time: Those who need to travel urgently are advised to plan their journeys with sufficient extra time due to slow-moving traffic. •Follow Official Updates: Citizens are urged to stay updated by checking the official social media handles of the Hyderabad Traffic Police for real-time traffic updates and advisories. Issued By:Office of the Joint Commissioner of Police (Traffic),Hyderabad City.
1
51
డ్రగ్స్ రహిత సమాజం కోసం శ్రమిస్తూ, తనిఖీల సమయంలో గాయపడిన H-NEW కానిస్టేబుళ్లు ఎన్. మహేందర్ యాదవ్, ఎమ్. వంశీధర్‌లను పరామర్శించాను. సమాజ రక్షణ కోసం వారు ప్రదర్శించిన తెగువ ప్రశంసనీయం. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారి వెంటే ఉంటుందని,, అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసానిచ్చాను. #HyderabadPolice
1
39
Cyber Awareness Meeting conducted by Sri K. Srinivas, ACP, Asif Nagar & SHO, DI & SI's and Cyber Warriors of Mehdipatnam PS and created awareness on happening crimes and explained the importance of Dial 1930 and online reporting of complaint in NCRP.
2
88
The Hyderabad Traffic Police, on surge in citizen complaints, the Hyderabad Traffic Police has launched an intensified, special enforcement drive against vehicles using fake, tampered or unauthorized registration number plates. These violations strictly contravene the Motor Vehicles Act and other relevant legal provisions. As part of this ongoing crackdown, five (06) criminal cases were registered over the past week against individuals using fraudulent registration plates to conceal vehicle identities, evade traffic enforcement and violate regulations. Multiple vehicles were identified and seized during the operation. The criminal cases (Detailed list enclosed) were registered under various Law & Order Police Stations spanning the following jurisdictions: * JUBILEE HILLS PS * MALAKPET PS * BEGUMBAZAR PS * ABIDS PS * KACHIGUDA PS STRICT HSRP PLATES COMPLIANCE: Only government-approved High-Security Registration Plates (HSRP) are legally permitted. Any custom alterations, missing digits, or temporary stickers are strictly illegal. ZERO TOLERANCE WARNING: The Hyderabad Traffic Police reiterates its Zero Tolerance policy toward fraudulent vehicle registration practices. Citizens are strictly cautioned that using fake or manipulated registration plates will result in severe legal consequences, including criminal prosecution and the immediate seizure of the vehicle. The department appeals to all vehicle owners to strictly adhere to prescribed number plate norms and t raffic regulations. To ensure public safety, lawful road usage, and effective crime prevention, these enforcement drives will continue across the city in a sustained, systematic and vigorous manner. D. Joel Davis, IPS, Jt. Commissioner of Police (Traffic), Hyderabad City.
58
కులుసుంపుర పోలీసుల మానవత్వం – నిరాశ్రయుడైన మానసిక వికలాంగునికి పునరావాసం పురానాపూల్ 100 ఫీట్ల రోడ్డు వద్ద విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కులుసుంపురా పోలీసులకు సుమారు 35 సంవత్సరాల వయస్సు గల నిరాశ్రయుడైన మానసిక వికలాంగుడు దిక్కుతోచని స్థితిలో కనిపించాడు. వెంటనే స్పందించిన పీసీ కిరణ్ కుమార్, హెచ్‌సీ బషీర్ అతనికి ఆహారం అందించి, కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆ వ్యక్తికి తగిన సంరక్షణ, వైద్యం మరియు పునరావాసం కల్పించేందుకు అబ్దుల్లాపూర్ మెట్‌లోని ఆలేటి ఆటోమ్ వరల్డ్ అనాథ ఆశ్రమంకు సురక్షితంగా తరలించి చేర్పించారు. సమయస్ఫూర్తితో స్పందించి మానవత్వాన్ని చాటిన పీసీ కిరణ్ కుమార్, హెచ్‌సీ బషీర్‌ల సేవలను కులుసుంపురా SHO అభినందించారు. ప్రజల సంక్షేమం, ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు హైదరాబాద్ సిటీ పోలీసులు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని తెలిపారు.
41
𝗖𝗵𝗮𝗿𝗺𝗶𝗻𝗮𝗿 𝗧𝗮𝘀𝗸 𝗙𝗼𝗿𝗰𝗲 𝗕𝘂𝘀𝘁𝘀 𝗜𝗻𝘁𝗲𝗿𝘀𝘁𝗮𝘁𝗲 𝗚𝗮𝗻𝗷𝗮 𝗣𝗲𝗱𝗱𝗹𝗶𝗻𝗴 𝗥𝗮𝗰𝗸𝗲𝘁; 𝟯 𝗔𝗰𝗰𝘂𝘀𝗲𝗱 𝗛𝗲𝗹𝗱, 𝟮𝟮.𝟮𝟮 𝗞𝗴 𝗚𝗮𝗻𝗷𝗮 𝗦𝗲𝗶𝘇𝗲𝗱 The Commissioner’s Task Force, Charminar Zone, in coordination with Balapur Police, apprehended three interstate ganja peddlers near Sadat Nagar Bus Stop, Shaheen Nagar, Balapur, on 21.07.2026 and seized 22.22 kg of dry ganja, four mobile phones, two trolley bags and one backpack. The total value of the seized property is approximately ₹12 lakh. The arrested persons have been identified as Mirza Jaffer Baig alias Saddam (35), Awad Bin Ali Yafai alias Awad (22), and Sardar Manpreet Singh Dhillon alias Dhillon (22), all residents of Hyderabad. During interrogation, it was revealed that the accused procured the contraband from Berhampur, Odisha, and transported it to Hyderabad for distribution. To evade police detection, part of the journey was undertaken by bus after travelling by train up to Khammam. The accused were waiting to deliver the contraband to a customer when they were intercepted by the police. The investigation further disclosed the involvement of Ibrahim Bin Saleem Baamar alias Ibrahim Baamar of Balapur, who allegedly arranged the procurement and transportation, and Janni alias Sunny of Berhampur, Odisha, who is suspected to be the supplier. Both are absconding and efforts are underway to apprehend them. The operation was carried out under the supervision of Sri S. Saidababu, Inspector of Police, Charminar Zone Task Force, along with SI M. Madhu, SI M. Mahesh, SI K. Rama Rao, PC S. Balchander and the staff of Balapur Police Station.
35
గోల్కొండ బోనాల తొలి బోనం: భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి బోనం సమర్పణను పురస్కరించుకుని హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. గోల్కొండ కోట దిగువ భాగం నుంచి పైవరకు ఉన్న బందోబస్తును ఆయన నిశితంగా పరిశీలించారు. అనంతరం జగదాంబికా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు మాట్లాడుతూ.. తొలి బోనం రోజున తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. ఉత్సవాల భద్రత కోసం సుమారు 2,000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి కోటలోని ఆలయం వరకు ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ఆకతాయిల ఆటకట్టించేందుకు అత్యాధునిక డ్రోన్ కెమెరాలు, విస్తృతమైన సీసీటీవీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. జేబు దొంగతనాలు, గొలుసు చోరీలను అరికట్టేందుకు క్రైమ్ విభాగం ప్రత్యేక నిఘా పెంచిందని.. మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ నిరంతరం గస్తీ కాస్తాయని స్పష్టం చేశారు. భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారని వివరించారు. శాంతిభద్రతలు, ట్రాఫిక్ విభాగాలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారని.. బోనాల ఉత్సవాలను ప్రశాంతమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పర్యటనలో జాయింట్ సీపీ (ట్రాఫిక్) డి. జోయల్ డెవిస్, డీసీపీ (సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్) ఆర్. వెంకటేశ్వర్లు, గోల్కొండ జోన్ డీసీపీ జె. రాఘవేంద్ర రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీఆర్వో, హైదరాబాద్ సిటీ పోలీస్ #GolcondaBonalu #HyderabadCityPolice
36
తెలంగాణ సంస్కృతీసంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలిచే గోల్కొండ ఆషాడ మాస బోనాల సందర్భంగా.. నేడు జగదాంబిక మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించాను. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించాను. ఉత్సవాలకు విచ్చేసే భక్తుల భద్రత మా ప్రథమ కర్తవ్యం. ఈ నేపథ్యంలో, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించి, సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశాను. భక్తులంతా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా, ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలను జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. #Bonalu #GolcondaBonalu #HyderabadPolice #TelanganaCulture
24
➡️అలెర్ట్! ఎస్ఐఆర్-2026 పేరుతో సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. ✳️మీ ఓటు ఎంత విలువైందో, మీ వ్యక్తిగత సమాచారం కూడా అంతే అత్యంత కీలకమైనది. ✳️ఎన్నికల అధికారులు ఎవరూ కూడా మీ ఓటీపీ అడగరనే విషయాన్ని దయచేసి గ్రహించండి. ✳️ఫోన్ కాల్స్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ మీ ఓటీపీలు లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ✳️ఒకవేళ మీకు ఏవైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే ఫోన్ కట్ చేసి, 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయండి. ✳️మీరు నిర్లక్ష్యంగా పంచుకునే ఒకే ఒక్క ఓటీపీ మీ సొమ్మును, మీ వ్యక్తిగత సమాచారాన్ని సైతం తీవ్ర ప్రమాదంలోకి నెట్టివేస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!
40
Do not delay if you become a victim of cyber enabled financial fraud. Prompt reporting is crucial, as every minute counts in enabling timely intervention and improving the chances of preventing financial loss. 📞 Dial 1930 immediately to report cyber-enabled financial fraud.
2
52
Drug Awareness Program by Sri K. Srinivas, ACP, Asif Nagar Div & Sri S. Mallesh, SHO Mehdipatnam and SI's of Mehdipatnam PS #hydcitypolice
1
3
58