
For Latest Updates Of @PawanKalyan Garu and @JanaSenaParty || Vote For #Glass For Better Society
Amaravati, India
Joined February 2021
- Tweets34.9K
- Following49
- Followers13K
- Likes16.3K
Rice Bowl of india #AndhraPradesh❤️
భారతీయులందరూ మా అన్న తమ్ముళ్లు అక్క చెల్లెలు నేర్పింది నా తెలుగు భాష నా ఆంధ్ర ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో పుట్టినందుకు గర్విస్తున్నాను ✊💯
జై ఆంధ్ర✊
జైహింద్ ✊ 🇮🇳
#AndhraPradeshFormationDay
Legend PawanKalyan FC™ retweeted
ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కోసం ఆత్మార్పణ చేసిన త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాట స్ఫూర్తికి నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
#AndhraPradeshFormationDay
Legend PawanKalyan FC™ retweeted
కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం కళ్ళ ముందు కనిపిస్తుంది.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి మంచి ప్రభుత్వానికి మన మద్దతు తెలియజేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Legend PawanKalyan FC™ retweeted
వ్యవస్థ బాగుంటే దానంతట అదే మీ జీవనాభివృద్ధికి తోడ్పడుతుంది. వ్యవస్థను సరి చెయ్యడానికి పని చేస్తున్నాం.
మాకు మీ శుభాశీస్సులు, మీ అండదండలు కావాలి.
ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సంపూర్ణ మద్దతు కూటమికి ఇవ్వాలని మా విన్నపం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
#CheppaamChestunnaam
Legend PawanKalyan FC™ retweeted
రాప్తాడులో విద్యార్థినిపై ఉన్మాది దాడి ఘటనపై ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు తీవ్ర ఆవేదన..
•బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా
•నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని దిశా నిర్దేశం
అనంతపురం జిల్లా, రాప్తాడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఉన్మాది దాడి చేసిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తరగతి గదిలో చొరబడి దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా పరిగణించారు.
ఇలాంటి అమానవీయ ఘటనలకు సమాజంలో చోటు లేదన్నారు. నిందితుడిని తక్షణం అరెస్టు చేసి, చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు శాఖకు దిశా నిర్దేశం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి గురించి విచారించారు.ఆమెకు అవసరమైన వైద్య సహాయం మెరుగైన రీతిలో అందించాలని, గాయపడిన మరో విద్యార్థినికి కూడా మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. విద్యార్థిని కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.
Legend PawanKalyan FC™ retweeted
Another giant leap for Bharat’s space journey!
Heartiest congratulations to Team ISRO on the successful GSLV-F18 launch and precise placement of the NVS-03 navigation satellite into its intended orbit.
An achievement reflecting scientific excellence, indigenous innovation and the determination to build a self-reliant nation.
Bharat is not just reaching for the stars; it is shaping its own destiny among them!
- @PawanKalyan
#ISRO #GSLVF18
4లక్షలతో వంగవీటి రాధా.! Vijayawada Mayor
@PawanKalyan
Rasipettukondi @VangaveetiOffl will rule bezawada @PawanKalyan ❤️🥵
మీ జగనన్న కు ఎలివేషన్లు వేస్ట్.. @PawanKalyan @JanaSenaParty
Legend PawanKalyan FC™ retweeted
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలి
•వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
•దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో క్షేత్ర స్థాయి పర్యటన
•ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలి
•మత్స్యకారుల సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తా
•కాకినాడ జిల్లాపై అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో వర్చువల్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా అధికారులను ఆదేశించారు. తుపానులు వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక చర్యలు చేపట్టడం కాకుండా, తీర ప్రాంత ప్రజలకు శాశ్వత రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని దిశా నిర్దేశం చేశారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి, వారి సమస్యలపై స్వయంగా అధ్యయనం చేస్తానని తెలిపారు.
అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న సాయం తదితర అంశాలపై కాకినాడ జిల్లా యంత్రాంగం, తీర ప్రాంత గ్రామాల ప్రజలతో క్యాంపు కార్యాలయం నుంచి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, తీర ప్రాంత గ్రామాలకు చెందిన మత్స్యకారులతో తుపాను కారణంగా జరిగిన నష్టం, సహాయక చర్యల వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సహాయక చర్యలను సమీక్షించి, పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడకి సంబంధించి డిజైన్ రూపకల్పన, డీపీఆర్ తదితర పనులు వేగవంతం చేయాలని, సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రివర్యులు జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. కోనపాపపేట వరకు రక్షణ గోడ పొడిగింపు అంశంపై గతంలో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థకు చేసిన ప్రతిపాదనలు త్వరితగతిన ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు పునరుద్ధరణకు తక్షణ చర్యలు
ఉప్పాడ – కాకినాడ బీచ్ రోడ్డు తుపాను అలల తాకిడికి పూర్తిగా దెబ్బ తిన్న నేపథ్యంలో తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీర ప్రాంత ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.
ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సత్వర ఉపశమనం
కాకినాడ జిల్లావ్యాప్తంగా 92 తీర ప్రాంత ఆవాసాల నుంచి 10 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, 102 పునరావాస కేంద్రాల్లో వారందరికీ ఆశ్రయం కల్పించడం పట్ల జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను నిరంతరం కొనసాగించాలని సూచించారు. సూరాడపేట, మాయాపట్నం, కొత్తపట్నం, నాయకర్ కాలనీల్లోకి సముద్రపు నీరు చొచ్చుకురావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసిన వెంటనే స్పందించి, 24 గంటల్లో నీటిని పూర్తిగా తొలగించిన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.
తుపాను గాలుల కారణంగా పిఠాపురం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. తుపాను ప్రభావం తగ్గిన వెంటనే విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినప్పటికీ, భోగాపురం, నరసింగపురం, చిత్రాడ ఎస్సీ కాలనీ, మల్లం, విరవాడ మధ్య విద్యుత్ స్తంభాలు పడిపోయాయని వివరించారు. కొన్ని చోట్ల పునరుద్ధరణ తర్వాత వైర్లు కాలిపోయినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కరించి, విద్యుత్ సరఫరాను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని అధికారులకి స్పష్టం చేశారు.
నష్టం అంచనాలను త్వరగా పూర్తి చేయాలి.
తుపాను కారణంగా దెబ్బతిన్న ఇళ్లు, పంటలు, బోట్లు, వలలు, మగ్గాలకు ఎన్యూమరేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నష్టాలపై సమగ్ర అంచనాలు రూపొందించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. రైతులు, మత్స్యకారులతో పాటు తుపాను బాధితులందరికీ న్యాయం జరిగేలా నష్టపరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ముంపునకు గురైన గ్రామాల ప్రజలకు 25 కేజీల బియ్యం, మత్స్యకారులు, చేనేతలకు 50 కేజీల బియ్యంతోపాటు పప్పు, వంటనూనె, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, పంచదార తదితర నిత్యావసర సరుకులను ప్రతి బాధిత కుటుంబానికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ చేసే సరుకుల్లో కొరత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందికి అభినందనలు
విపత్తు సమయంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరంతరం కృషి చేసిన పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి అభినందించారు. సహాయక, రక్షణ చర్యల్లో పాల్గొన్న 45 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, గ్రామాల్లో మౌలిక సదుపాయాల తక్షణ పునరుద్ధరణకు కృషి చేస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగం సిబ్బంది సేవలను ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేసి ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఈ సమావేశంలో కాకినాడ రూరల్ శాసన సభ్యులు శ్రీ పంతం నానాజీ, జిల్లా కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ శ్రీ పృధ్వితేజ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా విభాగాల ఇ.ఎన్.సీలు తదితరులు పాల్గొన్నారు.
(1/3)
Legend PawanKalyan FC™ retweeted
On the birth anniversary of Dr. Homi Jehangir Bhabha Ji, I pay my respectful tributes to the visionary scientist whose pioneering contributions laid the foundations of India’s nuclear science programme.
At a time when scientific research was still taking shape in independent India, Bhabha Ji envisioned a nation capable of advancing through indigenous knowledge, innovation and technological excellence. Through his leadership, he established institutions such as the Tata Institute of Fundamental Research and helped shape India’s long-term nuclear research capabilities.
His life reminds us that nation-building begins with vision, the courage to pursue new frontiers and the determination to create institutions that serve generations. His belief in scientific excellence continues to inspire India’s pursuit of knowledge, research and self-reliance.
A nation that invests in science shapes its own future. Let us carry forward his vision by nurturing young minds, strengthening research and making Bharat a global force in science and innovation.
- @PawanKalyan
#HomiBhabha #IndianScience #ScientificExcellence
తిరువూరు మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ జనసేన పార్టీ వీర మహిళ నివేత గారి ప్రచారం జోరుగా కొనసాగుతుంది 🥰 @PawanKalyan @JanaSenaParty
Legend PawanKalyan FC™ retweeted
Thank you from the bottom of my heart, my Chief, my Leader Your words mean so much to me. Always grateful for your trust, guidance, and inspiration. Proud to stand with you❤️
శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
చిన్నన్నయ్య శ్రీ @NagaBabuOffl గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శాసన మండలి సభ్యుడిగా, ఏపీ గ్రీన్ ఛైర్మన్ గా ఆయన మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. స్వతహాగా పర్యావరణ పరిరక్షణపై అభిలాష కలిగిన శ్రీ నాగబాబు గారు ఏపీ గ్రీన్ ఛైర్మన్ బాధ్యతలకు వన్నె తీసుకొస్తారనే విశ్వాసం ఉంది. చిన్నన్నయ్యకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada
Legend PawanKalyan FC™ retweeted
శ్రీ నాగబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
చిన్నన్నయ్య శ్రీ @NagaBabuOffl గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శాసన మండలి సభ్యుడిగా, ఏపీ గ్రీన్ ఛైర్మన్ గా ఆయన మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. స్వతహాగా పర్యావరణ పరిరక్షణపై అభిలాష కలిగిన శ్రీ నాగబాబు గారు ఏపీ గ్రీన్ ఛైర్మన్ బాధ్యతలకు వన్నె తీసుకొస్తారనే విశ్వాసం ఉంది. చిన్నన్నయ్యకి సంపూర్ణ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
@PIB_India @IPR_AP @pibvijayawada











