SP KOTHAGUDEM (@SpKothagudem) header
SP KOTHAGUDEM (@SpKothagudem) profile picture

Official Twitter handle of Superintendent of Police, Bhadradri Kothagudem, Telangana

Kothagudem, Telangana
Joined October 2016
Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)Photo by SP KOTHAGUDEM (@SpKothagudem)
భార్యను హత్య చేసి మృతదేహాన్ని గోదావరి నదిలో పడవేసిన కేసులో ప్రధాన నిందితుడు బోడా నరేందర్‌కు సహకరించిన అతని తండ్రి బోడా హరిలాల్, సోదరుడు బోడా సురేందర్, స్నేహితుడు మాలోత్ శోభన్‌లను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించిన కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు.
2
168
Cordon and search at Rama Talkies, Nehru Basti in Kothagudem under DSP Adinarayana. 200 houses checked, 151 challans, Rs.25,460 fine collected, 3 vehicles seized, 4 liquor cases booked. DSP advised youth to avoid drugs, wear helmets and beware of cyber frauds.
2
223
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో పోలీసుల విస్తృత నాకాబందీ తనిఖీలు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, లాడ్జిలను తనిఖీ చేసి అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
12
538
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరు మండలం పెద్దపల్లి గొత్తికోయ గ్రామంలో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో నాటికలు, పాటల ద్వారా మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి.. శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోండి.
1
6
241
అశ్వాపురం పరిధిలోని ఓం శక్తి, సాయిబాబా ఆలయాల్లో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.7.54 లక్షల విలువైన 105 గ్రాముల బంగారు ఆభరణాలు, 7.9 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
4
467
రామాంజనేయ కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు. మాదకద్రవ్యాల నిర్మూలన, మూఢనమ్మకాల నివారణ, రహదారి భద్రత, సైబర్ నేరాల నియంత్రణ, CCTV కెమెరాల ఏర్పాట్ల పై ప్రజలకు అవగాహన కల్పించారు.
6
265
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అశ్వారావుపేట మండలం వడ్డెరంగాపురం గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన అశ్వారావుపేట పోలీసులు. 91 ఇళ్ల తనిఖీ.. 5 ద్విచక్ర వాహనాలు సీజ్. కోడిపందాలు, పేకాటకు దూరంగా ఉండాలని, గంజాయి, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
6
385
మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో ఇద్దరిని హత్య చేసి, మృతదేహాలను పాతిపెట్టిన ఘటనలో మణుగూరు పోలీసులు ఐదుగురిని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల విజ్ఞప్తి: మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి.. అనారోగ్యానికి వైద్య చికిత్సే సరైన మార్గం.
1
4
638
సైబర్ మోసంపై ఎస్పీ రోహిత్ రాజు IPS ప్రత్యేక పర్యవేక్షణ.. బాధితుడికి భరోసా! క్రెడిట్ కార్డు మోసంలో రూ.4.97 లక్షలు కోల్పోయిన బాధితుడికి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసుల అండ.రూ.1.62 లక్షలు రిఫండ్, మరో రూ.3.35 లక్షలు బ్యాంకు ఖాతాల్లో హోల్డ్.సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కు ఫిర్యాదు చేయండి
1
391
నక్సల్ ముక్త్ భారత్‌పై PIB–జిల్లా పోలీసుల మీడియా సదస్సు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఎస్పీ సింధు శర్మ , PIB జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొని మావోయిస్టు కార్యకలాపాలు, అరెస్టులు, లొంగుబాట్లు, అభివృద్ధి, పునరావాస కార్యక్రమాల వివరాలను వెల్లడించారు
2
23
1,472
మణుగూరు మండలం బుడుగుల గుత్తి కోయ గుంపులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు మూఢనమ్మకాలు, మంత్రాలు, చేతబడుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమంను పోలీసులు నిర్వహించారు. మూఢనమ్మకాల నిర్మూలన, శాస్త్రీయ దృక్పథంపై కళాజాత బృందం అవగాహన కల్పించింది.
1
7
320
హేమచంద్రపురం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ వార్షిక తనిఖీ నిర్వహించారు. ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలోని కార్యాలయాలు, బాంబు డిస్పోజల్ టీమ్, డాగ్ స్క్వాడ్ పనితీరును సమీక్షించి, విధుల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన నైపుణ్యాల పై పలు సూచనలు చేశారు.
6
779
భద్రాచలం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు.
9
540
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్లల అమలులో నిర్లక్ష్యం వద్దు. ఎన్డిపిఎస్ కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లపై ప్రత్యేక దృష్టి సారించాలి. నెలవారీ నేర సమీక్షలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.
1
6
432
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణ తరగతులకు హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకొని పట్టుదల, క్రమశిక్షణతో చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు.
1
9
426
ప్రైవేట్ చిట్టీల పేరుతో రూ.55.33 లక్షల మోసం – ముగ్గురు అరెస్ట్ నిందితుల వద్ద చిట్టీల లావాదేవీలకు సంబంధించిన 5 బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. అనధికారిక ప్రైవేట్ చిట్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ.
7
637
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పాకలగూడెం గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన అశ్వరావుపేట పోలీసులు. 62 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 4 ట్రాక్టర్లను తనిఖీ చేశారు.మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
8
486
ఇల్లందులో వరుస రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 10 కేసులను ఛేదించిన పోలీసులు. రూ.27.51 లక్షల విలువైన 165 గ్రాముల బంగారం, 2.2 కిలోల వెండి స్వాధీనం. కేసు చేదనలో కీలక ఆధారాలు సేకరించిన అధికారులను,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్.
1
7
1,039
ఫింగర్ ప్రింట్, క్లూస్ టీమ్ విభాగాలను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ, శాస్త్రీయ ఆధారాల సేకరణ ద్వారా నేర పరిశోధనను మరింత పటిష్టం చేసి కేసుల ఛేదనలో వేగం, ఖచ్చితత్వం సాధించాలని సిబ్బందికి సూచించారు.
1
19
629