Deshapathi Srinivas (@TheDeshapathi) header
Deshapathi Srinivas (@TheDeshapathi) profile picture
Hyderabad
Joined July 2013
Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)Photo by Deshapathi Srinivas (@TheDeshapathi)
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ యువత సాధించిన అసాధారణ విజయం! ప్రజాస్వామ్య శక్తులకు ఇది నూతన ప్రేరణ. ప్రజలు పాలనలో జవాబుదారీతనాన్ని, కోరుకుంటున్నారు. ఇది కొత్త రాజకీయాలకు నాంది కావాలి అవాక్కయిన అంధ భక్తులారా... ఇక ఇంస్టాగ్రామ్ యూనివర్సిటీ తెరుద్దామనే ఆలోచనలు ఆపి, ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోండి!
1
1
14
678
ప్రధాని మోడీ గారూ! మీరు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా, విజ్ఞతతో వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఇది ఏ రాజకీయ శక్తి ప్రేరేపితమో కాదు... దేశ యువత తమ భవిష్యత్తు కోసం స్వచ్ఛందంగా చేపడుతున్న ఆత్మగౌరవ సమరం. వారి హృదయాల్లో రగులుతున్న అసంతృప్తిని కేవలం నిరసనగా కాకుండా, 'సుపరిపాలన' కోసం వ్యక్తమవుతున్న తీవ్రమైన ఆకాంక్షగా గుర్తించండి. ఆ నిరుపేద యువత కళ్లలో కనిపిస్తున్నది పట్టుదల మాత్రమే కాదు—తమ హక్కుల పట్ల అవగాహన! శాంతియుతమైన, గాంధేయ మార్గంలో సాగుతున్న ఈ ఉద్యమ చేతనను అణచివేత చర్యలతో గానీ, రాజకీయ కుయుక్తులతో గానీ నొక్కేయాలని చూస్తే... అది మరింత తీవ్రమైన ప్రజా విస్ఫోటనానికి దారితీసి, ప్రభుత్వ పునాదులనే కదిలించే స్థాయికి చేరుకుంటుంది. అధికారం శాశ్వతం కాదు; అది ప్రజాస్వామ్యం ప్రసాదించిన ఒక బాధ్యత మాత్రమే. వినీతి పెచ్చుమీరి, వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం నశించినప్పుడు... కాలమూ, ప్రజాభిప్రాయమూ తిరగబడటం చరిత్ర నేర్పిన సత్యం. అన్ని వ్యవస్థలనూ తమ నియంత్రణలోనే ఉంచుకుని, ‘ఏం చేసినా చెల్లుతుంది’ అనే అహంకారంలో ఉంటే... సమాజంలో అత్యంత సాధారణంగా భావించే సామాన్యులే, రేపటి భావజాల విప్లవానికి నాయకులుగా మారి బొద్దింకలే బోధిసత్వులై దేశానికి నూతన దిశానిర్దేశం చేస్తారని గ్రహించండి.
1
1
14
597
సీజేపీ (CJP) పిలుపుతో పార్లమెంట్ ముట్టడికి దండెత్తిన యోధులై తరలివచ్చారు వేలాది యువకులు. వారి గుండెల్లో రగులుతున్న ఆగ్రహజ్వాలలు... నిరంకుశ బిజేపి ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కురుస్తున్న బాష్పవాయు గోళాలు, విరుచుకుపడుతున్న పోలీసు లాఠీల దాడికి అడుగు వెనక్కి పడలేదు సరేగదా... ఎదురొడ్డి ముందుకు సాగుతున్న యువత పోరాట పటిమ నిజంగా స్ఫూర్తిదాయకం! ఎంతటి శక్తులైనా, ఏ విధమైన కృత్రిమ చట్టాలతో కట్టిన సామ్రాజ్యాలైనా... ప్రజా చైతన్యం సునామీలా విరుచుకుపడితే, పేకమేడలై కూలిపోక తప్పదు.
1
3
29
894
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. మీరు కూర్చున్నది ఉన్నతమైన, బాధ్యతాయుతమైన పీఠంపై, ఫ్యాక్షన్ గద్దె పై కాదు! ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్ , కేటీఆర్ హరీష్ రావు లను ఉద్దేశించి—"నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి" అంటూ సి ఎం చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరం, అనాగరికం. ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక ముఖ్యమంత్రి ఇంతటి హింసాత్మక, క్రూరమైన పదజాలాన్ని వాడిన దాఖలాలు లేవు. మీ ప్రభుత్వ చేతకానితనాన్ని సరిచేసుకుని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే .. రైతుల కష్టాలు తీర్చండి అంతే కానీ ఇలాంటి రక్తపాత వ్యాఖ్యలతో కాదు. రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా, మాట్లాడే భాషలో కనీస సంస్కారం, విచక్షణ ఉండాలి. కక్షసాధింపులు, క్రూర కర్కోటక అమానవీయ వ్యాఖ్యలతో తెలంగాణ సమాజంలో హింసను ప్రేరేపించాలని చూస్తున్నారా ? ఇక్కడి ప్రజలు ఈ రకమైన వైఖరిని సహించరు. ముఖ్యమంత్రి తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని, తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను.
1
33
93
2,526
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అగ్రనేత, ప్రముఖ విప్లవ గాయకులు అరుణోదయ నాగన్న గారి మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక తోటి కళాకారుడిగా ఆయన నిష్క్రమణ తీవ్ర ఆవేదన కలిగించింది. ఖమ్మం జిల్లా రాజారం గ్రామానికి చెందిన నాగన్న గారు, ఇంటి పేరు ఊరి పేరు కాకుండా కేవలం ప్రజా హృదయాలనే తన చిరునామాగా మార్చుకున్న నిఖార్సైన ప్రజా గాయకుడు. దాదాపు అర్ధ శతాబ్ద కాలంగా పీడిత ప్రజల పక్షాన నిలిచి, తన ఆటపాటలతో విప్లవ భావజాలాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. సారా వ్యతిరేక ఉద్యమం, భూపోరాటాలు, గిరిజన హక్కుల పోరాటాల్లో ఆయన గొంతుక ఉద్యమాల ఊపిరిగా నిలిచింది. సామాజిక మార్పు కోసం నిరంతరం శ్రమించిన ఆయన ప్రజాసేవకు గుర్తింపుగా ఇటీవల ‘సుద్దాల హనుమంతు జాతీయ పురస్కారం’ కూడా లభించింది. గత ఏడాది బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైనా, పోరాట యోధుడిలా కోలుకుంటూ వచ్చిన నాగన్న గారు, ఇటీవల ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో నేడు అనంత తీరాలకు వెళ్లిపోయారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన పాడిన పాటలు, పలికించిన రాగాలు ఎప్పటికీ అమరమే. నాగన్న గారి మృతి విప్లవ, సాంస్కృతిక రంగాలకు తీరని లోటు
1
1
12
388
facebook.com/share/v/1JahT8J… నిజంగా అద్భుతం! ఈ రైతు మాటల్లోని లయ, ఆశువుగా పద్యంలా పలికిన తీరు చూస్తుంటే ముచ్చటేస్తోంది. కేసీఆర్ గారు చేసిన మేలును ఇంత చక్కని వకాబులరీతో, ఒక సంగీతాత్మక శైలిలో వివరించడం ఆయనలోని సహజ ప్రతిభకు నిదర్శనం. చదువుల కంటే సంస్కారమే పెద్దదన్నట్టుగా ఉందాయన అవగాహన.
1
4
1
23
1,530
ఖమ్మంలో మైనర్ బాలికపై మహమ్మద్ గౌస్' అనే వ్యక్తి జరిపిన అమానుష దాడి, హత్యాయత్నం అత్యంత హేయం, క్రూరం. ఇలాంటి మృగాన్ని సమాజం క్షమించదు. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అత్యంత కఠినమైన శిక్ష పడేలా చట్టం తన పని తాను వేగంగా చేయాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి పూర్తిగా నయం అయ్యే వరకు కార్పొరేట్ స్థాయిలో అత్యుత్తమ వైద్య సేవలను ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో అందించాలని డిమాండ్ చేస్తున్నాను. నేరగాళ్లకు వణుకు పుట్టేలా చట్టం కదలాలి. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలి — దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ, శాసనమండలి విప్
22
1
92
6,339
శప్తభూమి’, ‘కడపటి యుద్ధం’ వంటి అద్భుత నవలలతో తెలుగు సాహిత్య భాండాగారాన్ని సుసంపన్నం చేసిన విశిష్ట రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీ బండి నారాయణ స్వామి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. చరిత్ర సృష్టించిన సంక్షోభాలను, కాలగర్భంలో కలిసిపోయిన జనజాతుల ఆవేదనను, సంఘర్షణను మీ కలం ద్వారా మాకు పరిచయం చేశారు. ఇలాంటి చారిత్రక ప్రాధాన్యత కలిగిన అమూల్యమైన నవలలు మీ నుండి మరిన్ని రావాలని ఆశిస్తూ... మీరు ఆయురారోగ్యాలతో నూరు శరత్తులు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."
3
2
25
2,216
జనమే తన శ్వాస... జనమే తన ధ్యాస... భూదేవికున్నంత సహనం, భగీరథుడికి ఉన్నంత పట్టుదల కలబోసిన అలుపెరుగని ప్రస్థానం ఆయనది. ప్రజాసేవలోనే పరమానందాన్ని వెతుక్కునే ఒక నిఖార్సయిన కర్మయోగి... మన హరీశన్న తెలంగాణ ఉద్యమం అందించిన అనన్య సామాన్యమైన వరం హరీశ్ రావు. గౌరవ కేసీఆర్ గారి స్ఫూర్తితో, తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా అహోరాత్రులు శ్రమించి, ప్రతి రంగంపై లోతైన ప్రజ్ఞ సాధించిన సాధికార స్వరం ఆయన. అందుకే, ఆనాడు అసెంబ్లీ వేదికగా ఉమ్మడి పాలకులైనా, ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైనా... ప్రజా సమస్యలపై నిలదీసి, నిప్పులతో కడిగిన ధీశాలి ఆయన. ఉద్యమ కాలంలో ఏ పోరాట కార్యక్రమమైనా సరే... హరీశన్న అడుగుపెట్టాడంటే అక్కడ వందకు వంద శాతం విజయం ఖాయం కావాల్సిందే! నిబద్ధతతనే తన బలం విశ్వసనీయతనే తన బలగం. తన అద్భుతమైన సమర్థతతో, తిరుగులేని క్రమశిక్షణతో చేపట్టిన ప్రతి పదవికీ వన్నె తెచ్చారు. నీటిపారుదల శాఖ అయినా, ఆర్థిక, ఆరోగ్య శాఖలైనా... ఆయన అడుగుపెడితే అక్కడ అద్భుతాలు ఆవిష్కృతమవ్వాల్సిందే. ప్రతిపక్షాలు సైతం మెచ్చుకునేలా ఫలితాలు సాధించిన ఆదర్శ నాయకుడు. "మాకూ ఇటువంటి ఎమ్మెల్యే కావాలి" అని రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ ప్రజలు కోరుకునేలా ఒక తిరుగులేని 'బెంచ్ మార్క్' క్రియేట్ చేసి, సిద్దిపేటను సమగ్రాభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలిపిన అరుదైన ప్రజాప్రతినిధి మన హరీశన్న. విసుగూ విరామం అనేది ఆయన నిఘంటువులోనే లేదు. తెల్లవారుజామున మొదలయ్యే జనదర్శనం నుండి అర్ధరాత్రి దాటే వరకు... ప్రతి ఒక్కరి ఆపదను, సంపదను ఆత్మీయంగా పలకరించే ఆప్త బంధువు. దయ, సత్యం గుండెల్లో నింపుకున్న సహృదయుడు. "పరుల క్షేమమే తన క్షేమంగా... ప్రజా హితమే తన మతంగా బ్రతుకుతున్న అరుదైన ప్రజా బంధువుకు జన్మదిన శుభాకాంక్షలు." తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, ఈ నేల ప్రయోజనాల కోసం ఆత్మీయ హరీశన్న, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం! హ్యాపీ బర్త్ డే హరీశన్న! 💐✨ దేశపతి శ్రీనివాస్ ఎం ఎల్ సి
5
17
2
159
6,645
ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ గారిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, విమర్శలు సహజం. ఒక విద్యావేత్త, విశ్లేషకుడి రాజకీయ అభిప్రాయాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని భావిస్తే, వాటిని ఆరోగ్యకరమైన చర్చ ద్వారా, తగిన సమాధానాలతో తిప్పికొట్టడమే సరైన ప్రజాస్వామ్య మర్యాద. అలా కాకుండా, సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించారంటూ, వైషమ్యాలు రెచ్చగొట్టారంటూ ఆయనపై తీవ్రమైన ఐపీసీ/బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం పూర్తిగా అసంబద్ధం, అసమంజసం. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని, భావప్రకటన స్వేచ్ఛను అణచివేయడమే అవుతుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చి, వాటిని బేషరతుగా ఉపసంహరించుకున్న తర్వాత కూడా కేసులను ముగించకుండా కొనసాగించడం ఏ న్యాయ సూత్రాలకూ లోబడి లేదు. తప్పును సరిదిద్దుకున్న తర్వాత కూడా చట్టపరమైన చర్యల పేరిట వేధించడం అనేది న్యాయాన్ని కాపాడటం కోసం కాదు; కేవలం ప్రశ్నించే గొంతులను, విమర్శకులను భయపెట్టడానికి మాత్రమేనని స్పష్టమవుతోంది.
21
21
99
3,585
*రాష్ట్ర కేంద్ర హోం మంత్రుల పరస్పర రక్షణ ఒప్పందంతో మైనర్ బాలికకు తీరని అన్యాయం* *నిందితుడిని తప్పించేందుకు సరిహద్దులు దాటిస్తారని అనుమానాలు* నేడు తెలంగాణ సమాజం ఒక వికృత రాజకీయ క్రీడకు సాక్షిగా నిలుస్తోంది. బాధితురాలికి అండగా నిలవాల్సిన పాలకులు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. అటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇద్దరూ కలిసి ఒక ఆడబిడ్డ ఆర్తనాదాన్ని అణిచివేస్తూ, నేరస్థులకు రక్షణ కవచంలా మారుతున్నారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన ఇంట్లోనే చట్టాన్ని బందీ చేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. పోక్సో (POCSO) చట్టం ప్రకారం నిందితుడిని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాల్సి ఉన్నా, బండి సంజయ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కుమారుడిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి సహకారంతో నిందితుడిని దేశం సరిహద్దులు దాటించే కుట్రలు సాగుతున్నాయని భావించాల్సి వస్తోంది. ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా సర్వ అధికారాలు ఉన్న రేవంత్ రెడ్డి, నిందితుడిని పట్టుకోవడంలో చూపుతున్న కాలయాపన వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ప్రధాని సభ కారణంగా విచారణ ఆలస్యమైందని చెప్పడం హాస్యాస్పదం. ఒక బాలిక ఆవేదన కంటే రేవంత్ రెడ్డికి తన రాజకీయ అస్తిత్వమే ముఖ్యమైపోయింది. "నీ పాపం నేను కడుగుతా.. నా పాపం నువ్వు కడుగు" అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర పాలకుల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది. ఓటుకు నోటు కేసు నుంచి విముక్తి కోసం కేంద్రంతో రేవంత్ చేతులు కలిపితే..కొడుకు అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. రక్షక భట నిలయాలు భక్షక నిలయాలుగా మారి, అధికార పీఠానికి మోకరిల్లుతున్నాయి. చట్టబద్ధ పాలనకు మరణశాసనం రాస్తున్న ఈ పాలకుల ఆటకట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని మహిళా లోకం, మేధావులు, విద్యావంతులు ఈ అన్యాయంపై గళమెత్తాలి. ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఈ యుద్ధంలో బాధితురాలికి అండగా నిలవాలి. పాలకులే నేరస్తులను కాపాడుతున్న ఈ తరుణంలో ప్రతిఘటన మరింత శక్తివంతంగా ఉండాలి. నేరపూరిత రాజకీయాలకు చరమగీతం పాడి, చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించే వరకు మన పోరాటం ఆగదు. *దేశపతి శ్రీనివాస్, శాసన మండలి విప్, భారత రాష్ట్ర సమితి*
12
124
5
399
16,406
కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై బీజేపీ శ్రేణులు జరిపిన దాడి నాగరిక సమాజం తలదించుకోవాల్సిన ఉదంతం. ఈ దాడిని అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ప్రజలు ఎన్నుకున్న ఒక వ్యవస్థపై జరిగిన దాడి. ప్రజాప్రతినిధుల కార్యాలయాలకే భద్రత లేకపోతే, సామాన్య పౌరుడి పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. రాజకీయ విభేదాలను సిద్ధాంతాలతో ఎదుర్కోవాలే తప్ప, భౌతిక దాడులతో అణచివేయాలనుకోవడం పిరికిపంద చర్య. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్, రాష్ట్ర హోం మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇద్దరూ రాజ్యాంగ రక్షణకు కట్టుబడి ఉండాల్సిన వారు. అరాచక శక్తులకు అండగా నిలుస్తూ, ఇటువంటి దాడులను పరోక్షంగా ప్రోత్సహించడం ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కడమే. శాంతిని కాపాడాల్సిన వారే అశాంతికి ఆజ్యం పోస్తే, ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలు ఇంకెక్కడ మిగులుతాయి? ఈ అరాచకానికి పాల్పడిన వారందరినీ తక్షణమే గుర్తించి, కఠినంగా శిక్షించాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సంస్కృతికి ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.
12
43
10
194
37,964
కుట్రల మేఘాలు ఎన్ని కమ్మినా.. ఎంతోకాలం సత్య సూర్యోదయాన్ని ఆపలేవు! కేసీఆర్ గారు, హరీష్ రావు గారి వ్యక్తిగత ప్రతిష్టపై బురద చల్లాలని చూసిన వారికి కాలమే చెంపదెబ్బ కొట్టింది. న్యాయస్థానం సాక్షిగా నేడు ధర్మం గెలిచింది. ఘోష్ విచారణలో రాజ్యాంగ విలువల ఉల్లంఘన జరిగిందని హైకోర్టు తేల్చి చెప్పడంతో రాజకీయ కక్షసాధింపులు బట్టబయలయ్యాయి. ఇకనైనా విషప్రచారాలు కట్టిపెట్టండి. ప్రాజెక్టును రాజకీయంగా ఖతం చేయాలనే దుష్ట ప్రయత్నం మానేసి, సాగునీరు అందక అల్లాడుతున్న రైతన్నల కన్నీళ్లు తుడవండి. కదిలివచ్చే కాళేశ్వర జలధార అది తెలంగాణ ప్రాణాధార జై తెలంగాణ!
1
85
3
309
4,709
ఆయన తెలంగాణ కీర్తి.. ఆయనను ఆరోగ్యంగా, ఉద్వేగంగా, ఉత్సాహంగా చూడటం ఒక స్ఫూర్తి
28
142
6
1,641
18,662
వివక్షపై గెలిచిన విశ్వమానవుడిపై.. రేవంత్ సర్కార్ వివక్ష సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక, సామాజిక న్యాయ స్ఫూర్తి ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాశయుని పై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరిని చూస్తుంటే వాళ్ళ భావదారిద్ర్యం మీద అనంతమైన జాలి, అసహ్యం కలుగుతున్నది. రేవంత్ రెడ్డి గారూ.. ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోండి! • కేసీఆర్ హయాంలో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీ రివ్యూలకు కావాలి! • కేసీఆర్ హయాంలో నిర్మించిన సచివాలయంలో, ఆ అద్భుతమైన సీఎం ఛాంబర్‌లో ‘దర్జా'వెలగబెట్టడం మీకు ఇష్టం! • కేసీఆర్ హయాంలో నోటిఫికేషన్లు వచ్చి, ఇంటర్వ్యూలు కూడా పూర్తయిన ఉద్యోగాలకు నియామక పత్రాలు పంపిణీ చేసి ఆ క్రెడిట్ తీసుకోవడం మీకు కావాలి! • మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మూసీ’ ప్రక్షాళన కోసం కేసీఆర్ హాయంలో కట్టిన మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తెచ్చుకోవడం మీకు తెలుసు! అన్నీ పనికొస్తాయి కానీ.. అదే కేసీఆర్ గారు అత్యంత భక్తితో, గౌరవంతో ప్రతిష్టించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గౌరవించడానికి మాత్రం మీకు మనసు రాదా? హుస్సేన్ సాగర్ తీరాన, సచివాలయం పక్కన గగనాన్ని తాకే విధంగా 125 అడుగుల ఎత్తున ఎత్తున కొలువై ఉన్న ఆ విగ్రహం కేవలం ఒక నిర్మాణం కాదు; అది ఈ దేశ మూలవాసుల ఆత్మగౌరవ శిఖరం! హైదరాబాద్‌కే గర్వకారణమైన ఆ విగ్రహం కింద అద్భుతమైన 'నాలెడ్జ్ సెంటర్' నిర్వహించే వీలుంది. బాబాసాహెబ్ జీవిత విశేషాలను తెలిపే ఆర్ట్ గ్యాలరీ, మ్యూజియం, మేధోమథనం సాగించే సమావేశ మందిరాలతో అది ఒక విజ్ఞాన గనిగా తీర్చిదిద్దే వీలుంది. అటువంటి స్ఫూర్తిదాయక కేంద్రాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే మీ సంకుచితత్వంతో అంబేద్కర్ ఆశయ స్ఫూర్తిని అవమానించడమే! సామాజిక వివక్షకు వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన ఆ మహనీయుడి మీద, మీరు ఇప్పుడు 'రాజకీయ వివక్ష'ను ప్రదర్శిస్తారా? చరిత్రలో గొప్ప పనులు చేసిన వారు చిరస్థాయిగా నిలిచిపోతారు.. కానీ అహంకారంతో అడ్డుపడే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఏప్రిల్ 14న మా డిమాండ్ ఇదే: రాజకీయ వైషమ్యాలను పక్కన పెట్టి, 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని సందర్శించి, అధికారికంగా పూలమాల తో పూజించి తరించండి. అంబేద్కర్ ఔన్నత్యం ముందు మీ అహంకారం చిన్నదని నిరూపించుకోండి. - దేశపతి శ్రీనివాస్
4
22
1,030
భారతదేశంలో సామాజిక విప్లవ పితామహుడు, స్త్రీ విద్యకు ఆద్యుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నమస్సులతో... చదువుతోనే సాధికారత సాధ్యమని నమ్మిన ఆయన బాటలో నడుద్దాం. సామాజిక సమన్యాయాన్ని సాధిద్దాం
3
4
567
నేడు రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న వివక్షను మరోసారి బయటపెట్టాయి. చారిత్రక సత్యాలను వక్రీకరిస్తూ,తెలంగాణ మంత్రి తెలంగాణ వ్యతిరేక వాదనను వినిపించడం విషాదం. చంద్రబాబు నాయుడు పక్షం తీసుకొని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్రజాస్వామికంగా అప్పగించింది బీజేపీ ప్రభుత్వం. దీనికి కేసీఆర్ గారికి సంబంధం ఉందని చెప్పడం ఆత్మవంచన పరవంచన. యూపీఏ రూపొందించిన విభజన బిల్లులో ఏడు మండలాలు అప్పగించాలని ఇన్ బిల్ట్ ఉందని అసత్యాన్ని అలవోకగా చెప్పేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు-2014 (The Andhra Pradesh Reorganisation Act, 2014) పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పుడు అందులో ఈ ఏడు మండలాల బదలాయింపు అంశం లేదు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన చారిత్రక వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి: • యూపీఏ ప్రభుత్వం తెచ్చిన బిల్లు: 2014 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసిన అసలు విభజన బిల్లులో ఖమ్మం జిల్లాలోని ఈ ఏడు మండలాలు (కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, బూర్గంపాడు) తెలంగాణలోనే ఉన్నాయి. • ఆర్డినెన్స్ మార్గం: 2014 మే నెలలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే (NDA) ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడటానికి (జూన్ 2) కేవలం కొన్ని రోజుల ముందు మే 29న ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సాకుతో ఆ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. • సవరణ బిల్లు: ఆ తర్వాత జూలై 2014లో పార్లమెంట్‌లో **"ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2014"**ని ప్రవేశపెట్టి, సభ ఆమోదంతో దానిని చట్టబద్ధం చేశారు. అంటే, చట్టం తయారీలో లేదా అసలు బిల్లు ఆమోదంలో ఈ మండలాల బదలాయింపు లేదు. కేవలం రాష్ట్రం ఏర్పడే ముందర కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం (ఆర్డినెన్స్) మరియు ఆ తర్వాతి సవరణ ద్వారానే ఇది జరిగింది. కాబట్టి "ఇది విభజన బిల్లులోనే ఉంది" అని చెప్పడం సాంకేతికంగా తప్పు. ఇది తెలంగాణ ఆ ఏడు మండలాలను అన్యాయంగా త ఏ పి కి కట్ట బెడుతుంటే పార్లమెంట్‌లోకాంగ్రెస్ బీజేపీ ఎం పీలు ఎవరూ నోరు మెదపలేదు. మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేడు చరిత్రను వక్రీకరిస్తారా? తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు గెలిచింది ఇక్కడి వాదాన్ని వినిపించడానికి, కానీ మీరు చేస్తున్నది తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేయడం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలను సమాన దృష్టితో చూడండి. రెండు తెలుగు రాష్ట్రాలను రెండు కళ్ళుగా భావించండి అని భా రా స ఎం పి సురేశ్ రెడ్డి అప్పీల్ చేస్తుంటే కిషన్ రెడ్డి ఉక్రోషంతో లేచి ఊగిపోతూ ఈ రకంగా చారిత్రక అవాస్తవాలను చెప్పడం ఎవరి సంతృప్తి కోసం ?
6
74
208
5,939