BRS Party (@BRSparty) header
BRS Party (@BRSparty) profile picture

Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

Hyderabad, Telangana
Joined March 2014
Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)Photo by BRS Party (@BRSparty)
📣 రాష్ట్రంలోని కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్‌ఎస్ఆర్‌కే❗ 🚨 రేవంత్ బినామీ కంపెనీ కావడమే కారణం 📢 🆘 దివాలా కంపెనీ.. రూ. 6వేల కోట్ల బినామీ వైభవం ⛔ తాజాగా ఎస్ఆర్ఎస్పీ స్టేజీ-2 పనులు కూడా అదే కంపెనీకి 🤑 అంచనా కన్నా ఎక్కువ కోట్ చేసినా కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ⚠️ మిగతా కంపెనీలు పోటీలో లేకపోవడంపై అనుమానాలు దివాలా అంచుకు చేరిన కంపెనీకి ఎవరైనా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెడతారా? ఉద్యోగులకు కనీసం జీతం కూడా ఇవ్వలేని స్థితికి దిగజారిపోయిన కంపెనీ భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్నదంటే ఎవరైనా నమ్ముతారా? ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసం చేసిందన్న ఆరోపణలు ఉన్నా.. ప్రభుత్వం పిలిచి మరీ పనులు అప్పగిస్తుందా? ఓ కేసులో తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలంటూ ఏకంగా నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) న్యాయమూర్తిపై ఒత్తిళ్లు తెచ్చిన ఘన చరిత్ర ఉన్న కంపెనీకి పోటీ లేకుండా టెండర్లు కట్టబెడతారా? సాధారణంగా అయితే ఇవేమీ జరగవు. కానీ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వం. పైపెచ్చు ఆ కంపెనీ రేవంత్ బినామీదంటూ వార్తలు ఉండనే ఉన్నాయి. ఇంకేమున్నది? ఈ రెండు ప్రధాన అర్హతలున్న ఆ కంపెనీకి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు రూ.వేల కోట్ల టెండర్లు కట్టబెడుతున్నది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆ ఇన్‌ఫ్రా కంపెనీనే ‘కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌’. ఒకానొక సందర్భంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక దివాలా అంచుకు చేరింది. కానీ 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఆ కంపెనీ దశ తిరిగిపోయింది. ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆ కంపెనీకి.. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 6 వేల కోట్ల పైచిలుకు విలువైన కాంట్రాక్టులు దక్కాయి. ఇందులో మెజార్టీ ప్రాజెక్టులను కాంగ్రెస్‌ ప్రభుత్వమే కట్టబెట్టింది. తాజాగా సూర్యాపేట జిల్లా మోతె పరిధిలో చేపడుతున్న ఎస్సారెస్పీ స్టేజీ 2 పనుల కాంట్రాక్టు కూడా ఎలాంటి పోటీ లేకుండా ఆ కంపెనీకే దక్కింది. దివాలా తీసిన ఓ కంపెనీకి ఇలా ప్రాజెక్టులన్నీ గంపగుత్తగా, అదీ ఎలాంటి పోటీ లేకుండా ఎందుకు దక్కుతున్నాయి? ఆ కంపెనీపై కాంగ్రెస్‌ సర్కారుకు అంత ప్రేమ ఎందుకు?
9
1
32
1,706
రేపు ఓరుగల్లు గడ్డపై.. బీఆర్ఎస్ జన చైతన్య సభ 💥 మూడేళ్ల కాంగ్రెస్ మోసాలు, వైఫల్యాలను.. పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టేందుకు వస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 🔥✊ వందలాదిగా తరలివెళ్దాం, సభను విజయవంతం చేద్దాం ✊🏻 🗓️ నవంబర్ 22, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ
1
34
1
168
4,209
నువ్వు దండయాత్ర చేయాల్సింది సిరిసిల్ల, సిద్దిపేటలపై కాదు.. సాగర్ వద్ద అక్రమ ప్రాజెక్టుతో జలదోపిడీకి తెరలేపిన చంద్రబాబుపై దండయాత్ర చేయాలి రేవంత్. - మాజీ ఎమ్మెల్యే @DrGadariBRS 🔥
33
144
3,802
కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం దోచుకుంటున్నా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస సోయి లేదు. నాగార్జునసాగర్‌లో ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టుపై నల్గొండ మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డిలు పొంతన లేని మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కృష్ణా జలాలను భారీగా వాడుకుంటున్నామని చెబుతున్న ఉత్తమ్.. ఏ ప్రాజెక్టు కింద ఎన్ని నీళ్లు తీసుకున్నారో వెంటనే లెక్కలు చెప్పాలి! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
15
35
2,255
చలో వరంగల్ బీఆర్ఎస్ జన చైతన్య సభ 🔥 మూడేళ్ల కాంగ్రెస్ సర్కార్ మోసాలు, వైఫల్యాలను పోరాటాల గడ్డ ఓరుగల్లు వేదికగా ఎండగట్టనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS 🔥✊ ఈ సభ వేదికగా ఇతర పార్టీల నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్‌లో చేరికలు. 🗓️ నవంబర్, 2026 (ఆదివారం) ⏰ సాయంత్రం 5 గంటలకు 📍 కేడీసీ మైదానం, హనుమకొండ
1
27
1
94
2,968
ఒక్క కంపెనీని తీసుకురావడం చేతకాదు.. కానీ ఉన్న బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్‌ను సర్వనాశనం చేస్తున్న రేవంత్ రెడ్డి! కేసీఆర్ గారి పాలనలో కిటెక్స్, ఫాక్స్‌కాన్ వంటి అంతర్జాతీయ సంస్థలు తెలంగాణకు వచ్చాయి. వేలాది మందికి ఉపాధి లభించింది. నేడు కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులకు భద్రత, భరోసా కరువైంది! అంతర్జాతీయ సంస్థలపై దాడులు, వివాదాలతో బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోంది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు బదులు గోబర్ ఇన్వెస్టర్లను తెస్తున్న రేవంత్ ప్రభుత్వం! - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
17
49
2,485
కొత్త పెన్షన్ల పేరిట కాంగ్రెస్ మోసం! ఏ నియోజకవర్గంలో చూసినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కొత్త పెన్షన్ల కన్నా, తొలగించిన పెన్షన్లే ఎక్కువ! వృద్ధులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, వికలాంగులు, వితంతువులను ఎట్లా మోసం చేయబుద్ధి అవుతుంది నీకు రేవంత్ రెడ్డి! తెలంగాణ రాకముందు కేవలం ₹200 ఉన్న పెన్షన్‌ను ₹2,016కు, వికలాంగుల పెన్షన్‌ను ₹4,016కు పెంచిన చరిత్ర కేసీఆర్ గారిది! - ఎమ్మెల్యే @KaushikReddyBRS
14
41
2,347
తెలంగాణ సంపదను రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెరిసగం పంచుకుంటున్నారు. ఒకవైపు గురుకులాల్లో పురుగుల అన్నం తిని విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే రేవంత్ పట్టించుకోవడం లేదు. కానీ, తన కూతురితో మాత్రం ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూళ్లు తెరిపిస్తుండు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తన కూతురితో కొత్తగా ఇంటర్నేషనల్ స్కూళ్ల వ్యాపారం మొదలుపెట్టిండు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే వీళ్లు లక్ష కోట్ల రూపాయల వ్యాపార దందాకు తెరలేపారు. - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
1
21
51
2,193
ప్రభుత్వాన్ని, పాలనను గాలికొదిలేసి.. కుటుంబ వ్యాపారాలు, కార్పొరేట్ హాస్పిటళ్లు, కార్పొరేట్ స్కూళ్లు, షెల్ కంపెనీలతో పోటీ పడి దోచుకుంటున్న రేవంత్ రెడ్డి, పొంగులేటి! - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS
3
22
81
2,860
నిన్న హైదరాబాద్‌లోని ఫేస్‌బుక్ (మెటా) కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం దారుణం! కేసీఆర్ గారు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మెటా క్యాంపస్‌ను గచ్చిబౌలిలో ఏర్పాటు చేయిస్తే.. ఢిల్లీలో ఉన్న ఎవరో ఓ యూత్ కాంగ్రెస్ లీడర్ ది సోషల్ మీడియా అకౌంట్‌ను బ్లాక్ చేసినందుకు యూత్ కాంగ్రెస్ గూండాలు మూకుమ్మడిగా దాడి చేశారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సహనం గురించి రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇచ్చేది ఇందుకేనా? ప్రశ్నించిన జర్నలిస్టులపై కేసులు, అరెస్టులు.. సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు నిత్యం ప్రయత్నాలు.. మహిళా జర్నలిస్టులను సైతం వదలకుండా వేధిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ ఐటీ కంపెనీలపై దాడులు చేయలేదు.. శాంతియుతంగానే పోరాడాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గూండాల దాడులతో బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఇలాంటి అరాచకాలతో పెట్టుబడులు ఎలా వస్తాయి? అంతర్జాతీయ సంస్థలు తెలంగాణకు ఎలా వస్తాయి? - బీఆర్ఎస్ నాయకులు @Krishank_BRS 🔥
25
70
2,998
నవంబర్ 29 – దీక్షా దివస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహిద్దాం. - బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపు తెలంగాణ అమరుల త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకుంటూ నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా (21 నవంబర్ 2026) ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులతో జూమ్ ద్వారా అంతర్జాతీయ సమన్వయ సమావేశం నిర్వహించారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చారిత్రాత్మక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు. @KTRBRS గారి పిలుపు మేరకు దీక్షా దివస్ సందర్భంగా సభలు, సమావేశాలతో పాటు రక్తదాన శిబిరాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ ప్రచారాన్ని విస్తృతం చేయాలని, సోషల్ మీడియా ద్వారా పోస్టర్లు, వీడియో సందేశాలను ప్రచారం చేయాలని, తెలంగాణ ప్రవాసులను భాగస్వాములను చేయాలని కోరారు. అలాగే, వివిధ దేశాల్లో బీఆర్ఎస్ ఎన్నారై కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి రావడం ఖాయం! కేసీఆర్ గారి నాయకత్వంలో 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాబోతోందని, తెలంగాణ గడ్డపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి విజయకేతనం ఎగురవేయబోతోందని మహేశ్ బిగాల గారు ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులకు పార్టీ నాయకత్వాన్ని మరింత చేరువ చేసే లక్ష్యంతో రాబోయే రోజుల్లో కేటీఆర్ గారి దేశాల పర్యటనలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధులందరూ ఐక్యంగా పనిచేస్తూ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనించాలి… అమరుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలవాలి! జై తెలంగాణ ✊ జై బీఆర్ఎస్ ✊
11
89
3,138
LIVE: తెలంగాణ భవన్‌లో మాజీ కార్పొరేషన్ ఛైర్మెన్ @Krishank_BRS మీడియా సమావేశం teapawt.net/i/broadcasts/2jPqnvJZn…
11
31
2,362
రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తోందని చెప్పడానికి తెలంగాణ భవన్‌లో ప్రతిరోజూ జరుగుతున్న చేరికలే నిదర్శనం. అన్ని సర్వేల్లో తేలుతున్నది రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని... కేసీఆర్ ప్రభుత్వమే అని. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
26
1
119
3,516
విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న రేవంత్ రెడ్డి.. ఒకవైపు ప్రభుత్వ బడులను నిర్వీర్యం చేస్తూ, మరోవైపు హైదరాబాద్ చుట్టూ తన బిడ్డతో కార్పొరేట్ స్కూళ్లు పెట్టిస్తుండు. మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారు. హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల్లో కనీసం 16 వేలు కూడా భర్తీ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో 15 లక్షల కొత్త పింఛన్లు ఇస్తే.. రేవంత్ సర్కార్ అందులో 4 లక్షలు కోత పెట్టి, తిరిగి 4 లక్షలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటోంది. * మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
17
42
2,376
వరంగల్ "జన చైతన్య సభ" ఏర్పాట్లను పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు రేపు (ఆదివారం, నవంబర్ 22) హనుమకొండ కేడీసీ గ్రౌండ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్న జన చైతన్య సభ ఏర్పాట్లను పరిశీలించిన మాజీ మంత్రి @EDRBRS, మాజీ ఎంపీ @vinodboianpalli, మాజీ ఎమ్మెల్యేలు @dasyamofficial, @ArooriRamesh, @DharmareddyTRS, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు, ఇతర బీఆర్ఎస్ నాయకులు.
13
49
2,723
రేవంత్ రెడ్డి.. పోయినసారి ‘తెలంగాణ రైజింగ్’ అని పెట్టినవ్.. ఒక్క కంపెనీ కూడా రాలేదు! మీరు చేసుకున్న అగ్రిమెంట్లు ఎన్ని? వాటిలో పరిశ్రమలుగా కార్యరూపం దాల్చినవి ఎన్ని? ఒక్కసారి వైట్ పేపర్ విడుదల చేయ్! ఉన్న సిటీకే దిక్కులేదు కానీ.. ఫ్యూచర్ సిటీ అంటున్నవ్! ఉన్న నగరంలో నీళ్ళు ఇచ్చే శాత కాదు.. కరెంటు ఇచ్చే శాత కాదు,, చెత్త ఎత్తే శాత కాదు! నువ్వేందో.. నీ ఫ్యూచర్ సిటీ ఏందో? ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు! - మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish 🔥
31
72
2,545
రేపు వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రసంగాన్ని వినేందుకు అంచనాలకు మించి వేలాదిగా ప్రజలు తరలిరానున్నారు. ఈ సభ వేదికగా ఇతర పార్టీలకు చెందిన నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన మేధావులు, పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. వరంగల్ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపనుంది. - మాజీ ఎమ్మెల్యే @dasyamofficial
17
148
3,563
LIVE: ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన జ్వాలా ప్రవీణ్ మరియు శ్రీనాథ్ తమ అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరే కార్యక్రమం 📍 తెలంగాణ భవన్ teapawt.net/i/broadcasts/2NgQgREJV…
17
44
2,226