ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) header
ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) profile picture

Unbiased News 📰🔎📌 Real Events. Verified Facts. Stories That Matter. మన చుట్టూ జరిగే యదార్థ సంఘటనలు, వాస్తవాలు మీ ముందుకు.

India
Joined March 2026
ముంబై డోంగ్రీలో భారీ అగ్నిప్రమాదం...నివాస ప్రాంతానికి సమీపంలో మంటలు #Dongri #MumbaiFire #MumbaiNews #FireIncident
ముంబై డోంగ్రీ–నూర్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
186
ప్రెషర్ కుక్కర్ విషయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెను ప్రమాదమే కుక్కర్‌లోని ఆవిరి పూర్తిగా బయటకు వెళ్లిన తర్వాతే మూత తెరవాలి. ఆవిరి ఉండగానే తెరిస్తే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి #PressureCooker #KitchenSafety #SafetyTips #HomeSafety
1
68
దీపావళి వేళ ఇండోర్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన దుకాణాలు 🔸 ఇండోర్‌లోని సర్వతే బస్‌స్టాండ్ సమీపంలోని దుకాణాల్లో భారీగా మంటలు చెలరేగాయి. రాకెట్‌ కారణంగానే అగ్నిప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. #Indore #FireAccident #Diwali #SarwateBusStand
1
149
జగదల్‌పూర్‌లో రూ.1.74 కోట్ల బంగారం చోరీ ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ సంజయ్ మార్కెట్‌లో ఉన్న మోతీ జ్యువెలర్స్‌లో భారీ చోరీ వెలుగుచూసింది. కస్టమర్లుగా వచ్చిన మహిళలు ఏకంగా 1,200 గ్రాముల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైన బంగారం విలువ రూ.1.74 కోట్లు. ఆభరణాలు ఉన్న బాక్స్‌ను మహిళలు తీసుకెళ్లినట్లు షాపు యజమాని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జగదల్‌పూర్ సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ ఆధారంగా చోరీకి పాల్పడిన మహిళల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. #Jagdalpur #GoldTheft #Chhattisgarh #MotiJewellers
53
లక్నోలో ఘోర రోడ్డు ప్రమాదం ఉత్తరప్రదేశ్‌లోని లక్నో దుబగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో హర్దోయ్ రోడ్డుపై అంధే చౌకీ సమీపంలో మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, ఈ-రిక్షా బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. #Lucknow #RoadAccident #UttarPradesh #Dubagga
81
ముంబై డోంగ్రీలో గ్యారేజీలకు మంటలు 🔹 మహారాష్ట్రలోని ముంబై డోంగ్రీ పోలీస్ స్టేషన్ ఎదురుగా, నూర్ బాగ్‌లోని డాక్టర్ మహేశ్వరి రోడ్, నవరోజీ హిల్ రోడ్ నంబర్ 9 వద్ద గ్యారేజీల్లో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. టపాసుల వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. #Mumbai #Dongri #FireSafety #MumbaiPolice
80
ముంబై డోంగ్రీ–నూర్ బాగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
1
235
అలీగఢ్‌లో రోడ్‌వేస్ వర్క్‌షాప్‌లో అగ్నిప్రమాదం.. టపాసు రాకెట్‌తో చెలరేగిన మంటలు ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ రోడ్‌వేస్ వర్క్‌షాప్‌లోకి టపాసు రాకెట్ పడటంతో శిథిలావస్థలో ఉన్న బస్సు పక్కన పేరుకుపోయిన స్క్రాప్‌కు మంటలు అంటుకున్నాయి. స్క్రాప్‌లో ఉన్న ఇంజిన్ ఆయిల్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది సుదీర్ఘంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. #Aligarh #UttarPradesh #FireAccident #RoadwaysWorkshop
51
విరార్‌లో నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో విరార్‌లోని హెచ్‌డీఐఎల్ కాంప్లెక్స్‌లో ఉన్న నివాస భవనంలో మంటలు చెలరేగాయి. మొదటి అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో ప్రారంభమైన మంటలు వేగంగా పై అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. మంటలు తీవ్రతరం కావడంతో భవనంలోని నివాసితులను ఖాళీ చేయించే ప్రయత్నాలు కొనసాగాయి. #Virar #FireAccident #HDILComplex #Maharashtra
63
బైక్‌కు మంటలు యువకుడి చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం లక్నోలోని కాకోరి టర్నింగ్, మోహన్ రోడ్డులో బైక్‌ అల్లాయ్ వీల్ తొలగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ భయాందోళన నెలకొంది. వెంటనే ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌తో ఓ యువకుడు మంటలను అదుపులోకి తీసుకొచ్చాడు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకముందే ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది. #Lucknow #Kakori #BikeFire #UttarPradesh
112
దీపావళి వేళ థానేలో నాలుగు చోట్ల అగ్నిప్రమాదాలు... భయాందోళనలో ప్రజలు థానేలో ఆదివారం రాత్రి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. కల్వాలోని 40 అంతస్తుల భవనంతో పాటు ఎల్‌బీఎస్ రోడ్డులోని రాజే కార్లైన్ బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎటర్నిటీ మాల్ ఎదురుగా ఉన్న రాజే కార్లైన్ భవనంలో కొందరు చిక్కుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతమంది, ఏ అంతస్తులో ఉన్నారనే దానిపై అధికారిక స్పష్టత లేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలికి డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, ఎంపీ నరేశ్ మ్హాస్కే, ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రాకెట్లు, భారీ టపాసుల వినియోగమే ప్రమాదాలకు కారణమై ఉండొచ్చనే ప్రాథమిక అనుమానాల మధ్య మంటలకు గల కారణాలు, నష్టం వివరాలను అధికారులు అంచనా వేస్తున్నారు. #Thane #FireAccident #EknathShinde #DiwaliSafety
1
212
దీపావళి వేళ హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. మైలార్‌దేవ్‌పల్లిలో గోదాంలో మంటలు ఉడమగడ్డలోని ఈవెంట్ ఎక్విప్‌మెంట్ గోదాంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీపావళి వేడుకల్లో టపాసుల నిప్పురవ్వ గోదాంలో పడటంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈరోజు సీతాఫల్‌మండి, మైలార్‌దేవ్‌పల్లిలో కలిపి మొత్తం మూడు అగ్నిప్రమాదాలు నమోదయ్యాయి. #Hyderabad #Mailardevpally #FireAccident #Diwali2026
68
కాలభైరవతో హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్ నిశ్చితార్థం.. హాజరైన రాజమౌళి దంపతులు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి పెద్ద కుమారుడు, గాయకుడు-సంగీత దర్శకుడు కాలభైరవ.. హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్‌ను వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వేడుక నిర్వహించారు. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, రమా రాజమౌళి హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ ప్రముఖులు, అభిమానులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. #KalaBhairava #KavyaKalyanram #MMKeeravaani #SSRajamouli
82
రేణు దేశాయ్, ఆద్య దీపావళి సంబరాలు రేణు దేశాయ్, తన కూతురు ఆద్యతో కలిసి దీపావళిని మరింత ప్రత్యేకంగా చేసుకున్న సంబరాలు #PawanKalyan #RenuDesai #AadhyaDesai #Diwali2026
88
ప్రేమ, వెలుగుల మధ్య సోనాక్షి సిన్హా దీపావళి వేడుకలు 🔹 దీపావళి వేడుకల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 🔹 తమ దీపావళి ప్రేమ, వెలుగులతో నిండిపోయిందని చెబుతూ.. మీ అందరి దీపావళి కూడా ఇలాగే ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. #SonakshiSinha #Diwali2026 #Bollywood #DiwaliCelebrations
1
139
🎬 ‘సీన్’ చిత్రానికి ప్రేక్షకుల ప్రేమ.. కృతజ్ఞతలు తెలిపిన జ్యోతిక, నజ్రియా టీమ్ 🔹 భాషలు, సరిహద్దులు దాటి ‘సీన్’ సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణకు చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది. 🔹 ప్రేక్షకుల ప్రేమే కొత్త కథలు, ప్రయోగాలు చేసేందుకు మరింత ధైర్యాన్ని ఇస్తోందని పేర్కొంటూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. #SCENE #JithuMadhavan #Jyotika #Nazriya
6
318
ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ దీపావళి వేడుకలు.. అదిరిపోయిన సెలబ్రేషన్
69
కొడంగల్‌లో ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలు
79
పుష్ప స్టైల్లో దీపావళి వేడుకల్లో అల్లు అర్జున్ సందడి
కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో అల్లు అర్జున్
103
జపాన్‌ విహారయాత్రలో కుటుంబంతో సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక జపాన్‌లో దేవరకొండ కుటుంబం సందడి చేస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక, ఆనంద్ దేవరకొండ కలిసి సరదాగా గడుపుతూ మధుర జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారు. #VijayDeverakonda #Rashmika #AnandDeverakonda #JapanTrip
138