Fact Check TDP (@FactCheckTdp) profile picture
Joined January 2025
చిత్తూరు జిల్లా వి.కోట (వెంకటగిరికోట) జెడ్పీహెచ్‌ఎస్ (బాలికల) పోలింగ్ కేంద్రం (పోలింగ్ స్టేషన్లు 27–37) వద్ద ఎన్‌టీవీ (NTV) రిపోర్టర్ అక్మల్ ను పోలీసులు ఓటు వేయకుండా భౌతికంగా అడ్డుకుని వేధించారనే ప్రచారం అవాస్తవం. మధ్యాహ్నం 1:00 గంటల సమయంలో V.కోట-II MPTC స్థానానికి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి (తన వదిన శ్రీమతి రిజ్వానా) తరఫున ఎన్‌టీవీ రిపోర్టర్ అక్మల్ పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై వైఎస్సార్‌సీపీ మాజీ సర్పంచ్ P.N. నాగరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు V.కోట సీఐ (CI) సోమశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC) ప్రకారం అక్కడ ఉన్న గుంపును ఖాళీ చేయాలని సూచించారు. ఈ క్రమంలో సీఐ మరియు రిపోర్టర్ మధ్య మాటల వాగ్వాదం చోటుచేసుకుంది. రిపోర్టర్‌పై పోలీసు అధికారులు భౌతిక దాడికి దిగారని లేదా ఓటు వేయకుండా అడ్డుకున్నారనే వార్తల్లో నిజం లేదని ఎస్పీ (SP) తెలిపారు. కేవలం ఎన్నికల నిబంధనలను అమలు చేసే క్రమంలో వివాదం జరిగిందని, ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని ఎస్పీ (SP) వెల్లడించారు. #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan
1
46
ఎన్నికల రోజు జగన్ ఫేక్ ప్రచారం హద్దులు దాటింది. పోలింగ్ బూత్‌లో ఓటింగ్ ఇంకు చెరిపేస్తూ... దొంగ ఓట్లు వేస్తున్నారంటూ గొడ్డలి పార్టీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోంది. వాస్తవం ఏంటంటే కిందపడి గాయపడిన ఒక మహిళ చేతికి టించర్‌తో ప్రథమ చికిత్స (First Aid) చేస్తున్న వీడియో ఇది. పేటీఎం బ్యాచ్ పనికిమాలిన క్రియేటివిటీ ఇలా ఉంది మరి. #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
26
గొడ్డలి పార్టీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల టూర్ షెడ్యూల్ ప్రకారం హెలికాప్టర్ మధ్యాహ్నం 12:50 PMకి భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకోవాలి. కానీ, గొడవలు సృష్టించేందుకే ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా జగన్ రెడ్డి హెలికాప్టర్‌లో బయలుదేరి వచ్చేశారు. ఉదయం 10:00 గంటలకే ల్యాండ్ అయి, ఎన్నికల వేళ భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. మరోవైపు గొడ్డలి పార్టీ మీడియా సంస్థ అయిన సాక్షి, ఇది 'ఎమర్జెన్సీ ల్యాండింగ్' అంటూ పొంతన లేని పుకార్లను ప్రచారం చేస్తోంది. #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
1
33
ఫేక్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఫేక్ ప్రచారం చేసే ఫేక్ పార్టీ వైకాపా. తాజాగా ‘‘డా.రింకు పటేల్’’ అనే పేరుతో బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వును డిపీగా పెట్టుకుని గొడ్డలి పార్టీ నడుపుతున్న ఒక ఫేక్ x (ఎక్స్) హ్యాండిల్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని చెడగొట్టే విధంగా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. జగన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఒక మహిళపై అప్పటి పోలీసులు చేసిన దాష్టీకం వీడియోను (పోలీసులు, బాధితురాలు కూడా కరోనా సమయం కావడంతో మాస్కులు ధరించి ఉండటాన్ని గమనించవచ్చు) ఇప్పుడు జరిగిన సంఘటనగా ఈ తప్పుడు హ్యాండిల్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మరియు దీన్ని రీ ట్వీట్ చేయాలని కోరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేందుకు జరుగుతున్న ఈ కుట్రలో ఎవరూ భాగస్వాములు కావద్దు. తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ ఫేక్ హ్యాండిల్ పై పోలీసులు చట్ట పరంగా తగిన చర్యలు తీసుకుంటారని తెలియచేస్తున్నాము. #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
2
4
73
పవిత్ర తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో సైతం డబ్బుల కోసం కక్కుర్తి పడి నెయ్యి కాని కల్తీ కెమికల్ నెయ్యిని సరఫరా చేసి, హిందువుల మనోభావాలతో ఆటలాడిన వైకాపా, ఇప్పుడు తామే హిందువులకు ప్రతినిధులం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగంగా ఒక సినిమాలో వచ్చిన రాముల వారి పాటను రాములవారి కీర్తనగా చెపుతూ "మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు పేరుతో పాడి ఒక టీడీపీ కార్యకర్త అవమానించాడనే తప్పుడు ప్రచారాన్ని గొడ్డలి పార్టీ చేస్తున్నది". గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని, మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు గారిని ఏకవచనంతో సంబోధిస్తూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్న ఈ ఫేక్ పార్టీ సభ్య సమాజంలో ఉండే అర్హత కూడా కోల్పోయింది. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరుతున్నాం. అన్ని మతాల వారిని సమానంగా గౌరవించడం, వారికి ప్రభుత్వంలో, రాజకీయ వ్యవస్థలో సమాన వాటా ఇవ్వడం తెలుగుదేశం సిద్ధాంతం. హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్న ఈ గొడ్డలి పార్టీకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అందరూ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిస్తున్నాం. #YCPFakeBrathuku #PsychoFekuJagan #FactCheckTDP #AndhraPradesh
2
1
72
పేదవారికి పట్టెడన్నం పెట్టాలనే సదుద్దేశం తో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్నా క్యాంటీన్ ల పై గొడ్డలి పార్టీ తొత్తు పత్రిక సాక్షి తరచు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నది. తాజాగా ఆళ్లగడ్డ లోని అన్నా క్యాంటీన్ పై ఇదే తరహా దుష్ప్రచారం ప్రారంభించింది. మధ్యాహ్నం 3.30pm సమయంలో అన్నా క్యాంటీన్ టైం దాటిన తర్వాత వచ్చిన వారందరికీ కూడా భోజనం అన్నా క్యాంటీన్ సిబ్బంది వడ్డించారు. అక్కడికి వచ్చిన సాక్షి రిపోర్టర్ ముందుగానే అన్నా క్యాంటీన్ సిబ్బందితో భోజనం బాగోలేదు ఇప్పటివరకు ఎందుకు పెడుతున్నారు అంటూ ఆరోపణలు చేసి అక్కడ ఉన్నవారిని రెట్టించి రెట్టించి ఇదేవిధంగా అందరితో చెప్పించాలని ప్రయత్నించాడు. వాస్తవానికి అక్కడి అన్నా క్యాంటీన్ లో ఎంతో పరిశుభ్రమైన ఆహారాలను అందిస్తున్నారు. అన్నా క్యాంటీన్ లో అందిస్తున్న ఆహారం పట్ల ఎంతో మంది సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ కు చెందిన తప్పుడు ' సాక్షి ' రిపోర్టర్ ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
2
4
7
109
క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడుతున్న జగన్ రెడ్డికి, ఆయన పరివారానికి ఏం మాట్లాడాలో కూడా అర్ధం కావడం లేదు. 2014- 2019 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున టిడ్కో ఇళ్లు నిర్మించిన విషయం తెలిసిందే. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యే దశలో ఉండగా ఎన్నికలు రావడం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లకు సౌకర్యాలు కల్పించి లబ్దిదారులకు ఇవ్వాల్సి ఉండగా వాటిని పాడుపెట్టాడు. తన ఐదేళ్ల కాలంలో టిడ్కో ఇళ్లకు తన పార్టీ రంగులు వేసుకున్నాడు తప్ప వాటిని లబ్దిదారులకు ఇవ్వలేదు. అలాంటి జగన్ రెడ్డి, ఆ ‘గొడ్డలి పార్టీ’ నాయకులు ఇప్పుడు సిగ్గు లేకుండా ఆ టిడ్కో ఇళ్లు జగనన్న కట్టినవి అంటూ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. నీలి రంగు పులుముకుని వస్తున్న ఈ బ్లేడ్ బ్యాచ్ చేస్తున్న తప్పుడు ప్రచారం ఇది. దీన్నే క్రెడిట్ చోరీ డిజార్డర్ అంటారు… జగన్. #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
2
2
64
తప్పుడు ప్రచారమే తన ఆయుధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు చేస్తున్న ‘గొడ్డలి పార్టీ’ మరో తప్పుడు ప్రచారానికి తెరలేపింది. తణుకు ఎమ్మెల్యే శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ పేద పిల్లల పట్ల వివక్ష చూపించారంటూ సామాజిక మాధ్యమాలలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తున్నది. ఈ నెల 24వ తేదీన ఎమ్మెల్యే శ్రీ అరిమిల్లి రాధాకృష్ణ తణుకు మండలం దువ్వ గ్రామంలో కూటమి ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రూ.2.80 కోట్లతో నిర్మించిన రిటైనింగ్ వాల్, 5 స్లూయిజ్ గేట్లను జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణితో కలిసి పరిశీలించారు. ఈ నూతన రిటైనింగ్ వాల్ 5 స్లూయిజ్ గేట్ల కారణంగా అక్కడి జనావాసాలు భారీ వర్షాలు కురిసినా కూడా ముంపునకు గురికాలేదు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ రక్షణ పనులతో 500 కుటుంబాలకు మేలు జగడమే కాకుండా, సుమారు 1,000 ఎకరాల ఆయకట్టుకు వరద ముప్పు నుంచి రక్షణ లభించింది. దువ్వ గ్రామానికి శాశ్వత వరద రక్షణ కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నందున భారీ వర్షాల వల్ల పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి చదలవాడ నాగరాణితో కలిసి ప్రత్యక్షంగా పరిశీలిస్తున్న సమయంలో స్లూయిజ్ గేటుపై పక్షి మలం ఉన్న విషయాన్ని చూసుకోలేదు. కలెక్టర్ తో బాటు ఆయన చేతికి కూడా అది అంటింది. దాన్ని సానిటైజ్ చేసుకోవడం మాత్రమే జరిగింది. ఎమ్మెల్యే శ్రీ రాధాకృష్ణ కుడి చేతితో కరచాలనం చేస్తున్న విషయం వీడియోలో స్పష్టంగా ఉన్నది. పిల్లలను శ్రీ రాధాకృష్ణ ఎంతో ఆప్యాయంగా పలకరించి వారితో కరచాలనం చేశారు. అక్కడి పిల్లలు కలెక్టర్ తో కూడా కరచాలనం చేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉండగా తప్పుడు ప్రచారం చేయడం వైసీపీ దుష్ట ఆలోచనకు ప్రతీకగా ఉంది. అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న తణుకు అసెంబ్లీ నియోజకవర్గం చూసి కళ్లలో నిప్పులు పోసుకుంటున్న వైసీపీ ఇలా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నది. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దు. #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
6
6
266
ఫేక్ బతుకుల ‘గొడలి పార్టీ’ నేతలు నిజమైన క్రీడాకారులను ఫేక్ అంటున్నారు. DSC 2025లో తమ ప్రతిభ ఆధారంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించిన క్రీడాకారులను దారుణంగా అవమానిస్తున్నారు. గొడ్డలి పార్టీ హయాంలో SAP చైర్మన్ గా పని చేసిన వ్యక్తి ఆనాడు పొగిడిన క్రీడాకారులనే ఈనాడు తిడుతున్నాడు. అధికారం కోల్పోగానే మతి పోయిందా? మరచిపోయారా? అంటూ క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా కు చెందిన ఎన్ శివాజీ నాయక్ సుండిపల్లి మండలం ZPHS మడితాడు ఉర్దూ స్కూల్ లో పీఈటీ గా పని చేస్తున్నారు. సాఫ్ట్ బాల్ లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన శివాజీ నాయక్ ను ‘గొడ్డలి పార్టీ’ ఫేక్ అంటున్నది. 2022 లో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన జాతీయ క్రీడల్లో కాంస్య పతకం సాధించిన ఈ క్రీడాకారుడిని మనం ఎంతో గౌరవంతో చూసుకోవాలి. అంతే కానీ ఫేక్ అంటే ఎలా? ఇదే విషయాన్ని శివాజీ నాయక్ అడుగుతున్నారు. ‘ఆట బతకాలి’ అంటూ ఎంతో ఆవేదనతో చెబుతున్నారు శివాజీ నాయక్. గురు స్థానంలోకి వచ్చిన ఆయన తనలాంటి క్రీడాకారులను తయారు చేయాలనే పవిత్ర లక్ష్యంతో పని చేస్తున్నారు. రెండు శాతం స్పోర్ట్స్ కోటా మాత్రమే ఉండేదని, దాన్ని కూటమి ప్రభుత్వం 3 శాతానికి పెంచి క్రీడాకారులను ఆదుకున్నదని శివాజీ నాయక్ చెబుతున్నారు. రాజకీయ కారణాలతో ఫేక్ ప్రచారాలు చేస్తూ క్రీడాకారులను అవమానిస్తున్న వైసీపీని గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
10
14
296
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా అధికార యంత్రాంగమే కాకుండా తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషం గా శ్రమిస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను కాపాడుకోవడం తమ బాధ్యత అని ప్రతి టీడీపీ నాయకుడు భావిస్తాడు. అలాంటి వారిలో ఒకరు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు. ప్రజా సమస్యలు తీర్చడం కోసం ఆయన అహర్నిశలు శ్రమిస్తుంటే ' గొడ్డలి పార్టీ ' తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. ఆయన ను ప్రజలు నిలదీసినట్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారు. స్థానిక ప్రజలు ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. #FactCheckTDP #YCPFakeBrathuku #PsychoFekuJagan #AndhraPradesh
7
8
161