Siva Sankar Reddy retweeted
పవిత్రమైన శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్లను అనుమతిస్తారా?
ఇదేనా @ncbn మీ పాలనలో శ్రీవారి ఆలయంలో పాటించే పవిత్రత?
#SaveTirumalaFromTDP
#CBNJungleRaj
#JaganannaConnects
Siva Sankar Reddy retweeted
అంబానీ మరోసారి నీచంగా ప్రవర్తిస్తున్నారు🚨
ముఖేష్ అంబానీ భారతదేశంలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలనుకున్నారు, కానీ బిస్లరీ అప్పటికే దానిపై ఆధిపత్యం చెలాయిస్తోంది.
సెప్టెంబర్ 2025లో, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌పై జీఎస్టీ 18% నుండి 5%కి తగ్గింది.
కొద్ది రోజుల తర్వాత, రిలయన్స్ 'క్యాంపా ష్యూర్'ను ఆకర్షణీయమైన ధరలకు విడుదల చేసింది.
ఆ తర్వాత, సెప్టెంబర్ 30, 2025న, ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) బిస్లరీ గోవా ఫ్యాక్టరీ నుండి ఆరు నీటి నమూనాలను సేకరించింది మరియు ఫలితాలు ఊహించని విధంగా ఉన్నాయి.......
బిస్కెట్ లో 🍪
నీళ్ల బొటల్లు గివే వీడు చేసే వ్యాపారాలు.
Siva Sankar Reddy retweeted
🚨 ఏపీలో ఓటు చోరీపై మరో బాంబ్..
– దేశాన్ని ఊపేస్తున్న‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశోధనాత్మక కథనం
– ఒకే పోలింగ్ కేంద్రాలు, ఒకే క్యూలైన్లు.. రెండు వేర్వేరు లెక్కలు ఎలా?
ఆంధ్రప్రదేశ్‌లో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటు చోరీపై మరో బాంబు పేలింది. ఓటు చోరీకి సంబంధించిన సంచలన విషయాలను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తన పరిశోధనాత్మక కథనంలో ప్రస్తావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సాధించిన కుప్పం నియోజకవర్గం ఉన్న చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసిన వారి లెక్కల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది.
ఒకే రోజు, ఒకే పోలింగ్ కేంద్రాల్లో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘానికి పంపిన రెండు నివేదికల్లో ఏకంగా 31,471 మంది ఓటర్ల తేడా ఉండటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
👉 లోక్‌సభకు 56,067 మంది.. అసెంబ్లీకి 24,596 మందే!
‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పరిశీలించిన ఎన్నికల సంఘం అంతర్గత నివేదికల ప్రకారం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో 56,067 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు నమోదు చేశారు. అయితే అదే లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన మరో నివేదికలో ఆ సంఖ్యను కేవలం 24,596గా పేర్కొన్నారు.
రెండు నివేదికల మధ్య ఏకంగా 31,471 మంది ఓటర్ల వ్యత్యాసం ఉంది. ఈ నివేదికలను ఒక రోజు వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు పరిశోధనాత్మక కథనం పేర్కొంది. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఒకే పోలింగ్ కేంద్రంలో, ఒకే క్యూలైన్లో నిలబడిన ఓటర్లు రెండు ఎన్నికలకూ ఓట్లు వేశారు. అలాంటప్పుడు సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య రెండు నివేదికల్లో ఒకేలా ఉండాలి. కానీ భారీ తేడా ఎందుకు వచ్చిందన్న ప్రశ్నను ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ లేవనెత్తింది.
👉 చంద్రబాబు గెలిచిన కుప్పం కూడా
చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కుప్పం కూడా ఒకటి. 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయం సాధించి అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఆ ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానంతో పాటు దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలనూ టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారిక లెక్కల్లో ఇంత భారీ వ్యత్యాసం ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ లెక్కల వ్యత్యాసం ఒక్కటే ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నిర్ధారించడానికి ఆధారం కాదు. రెండు నివేదికల్లో తేడా ఎందుకు వచ్చిందన్న అంశంపై అధికారిక వివరణ అవసరమని పరిశోధనాత్మక కథనం స్పష్టం చేస్తోంది.
👉 అర్ధరాత్రి దాటినా పోలింగ్.. కొన్ని చోట్ల తెల్లవారుజామున 2 గంటల వరకు
2024 ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు, హింసాత్మక ఘటనల కారణంగా పోలింగ్ ఆలస్యమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అంగీకరించినట్లు కథనం పేర్కొంది.
కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా పోలింగ్ కొనసాగిందని, ఒకచోట తెల్లవారుజామున 2 గంటల వరకు ఓటింగ్ జరిగినట్లు వివరించింది. అసాధారణంగా రాత్రి వేళల్లో పోలింగ్ కొనసాగడంపై అప్పట్లో ప్రతిపక్షాలు రిగ్గింగ్ జరిగిందని విమర్శించాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు క్యూలైన్లలో ఉన్న వారి సంఖ్యపై స్పష్టమైన లెక్కలు ఉండాల్సిన అవసరం ఉందని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ ప్రశ్నించింది.
👉 ఒకే ఓటరుకు రెండు స్లిప్పులు.. మరి లెక్కల్లో తేడా ఎందుకు?
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు పోలింగ్ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్ అధికారి, ఐదుగురు పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తారు. సాధారణంగా ఒక ఎన్నిక నిర్వహించినప్పుడు ముగ్గురు పోలింగ్ అధికారులు ఉంటారు. పోలింగ్ ప్రక్రియలో మొదటి అధికారి ఓటరు గుర్తింపును ఓటర్ల జాబితాతో సరిపోలుస్తారు. రెండో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడువేలికి సిరా గుర్తు వేసి, ఫారం 17ఏగా పిలిచే ఓటర్ల రిజిస్టర్లో సంతకం తీసుకుంటారు.
మూడో అధికారి తెలుపు, గులాబీ రంగుల్లో రెండు ఓటరు స్లిప్పులను అందజేస్తారు. నాలుగో అధికారి వద్ద తెలుపు స్లిప్పు ఇచ్చి ఓటరు లోక్‌సభకు ఓటు వేస్తారు. అనంతరం ఐదో అధికారి వద్ద గులాబీ స్లిప్పు ఇచ్చి అసెంబ్లీకి ఓటు వేస్తారు. అంటే ఒకే ఓటరు, ఒకే పోలింగ్ కేంద్రంలో రెండు ఎన్నికలకు ఓటు వేస్తారు. అందువల్ల పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్ల లెక్క రెండు ఎన్నికలకూ ఒకేలా ఉండాలని కథనం వివరించింది.
👉 సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్నవారికి ప్రత్యేక స్లిప్పులు
సాధారణంగా సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లకు ప్రిసైడింగ్ అధికారి ప్రత్యేకంగా నంబర్లు ముద్రించిన స్లిప్పులను అందజేస్తారు. ఇవి ఓటింగ్ సమయంలో ఇచ్చే తెలుపు, గులాబీ స్లిప్పులకు భిన్నమైనవి. క్యూలైన్లో చివర నిలబడిన వ్యక్తికి మొదటి నంబర్ స్లిప్పు ఇచ్చి, ముందు వరుస వైపు మిగిలిన స్లిప్పులను పంపిణీ చేస్తారు. ఇలా ఎన్ని స్లిప్పులు ఇచ్చారన్న వివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేస్తారు.
పోలింగ్ ముగిసిన తర్వాత ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు ఫారం 17ఏ రిజిస్టర్‌ను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. మరుసటి రోజు రిటర్నింగ్ అధికారి వాటిని పరిశీలిస్తారు. తీవ్రమైన అవకతవకలు గుర్తిస్తే సంబంధిత పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయవచ్చు. ఒకే ప్రిసైడింగ్ అధికారి, ఒకే క్యూలైన్లో ఉన్న ఓటర్లకు స్లిప్పులు ఇచ్చినప్పుడు లోక్‌సభకు ఒక లెక్క, అసెంబ్లీకి మరో లెక్క ఎలా వచ్చిందన్నదే ఈ కథనంలో ప్రధాన ప్రశ్న.
👉 ఈసీ వద్దకు నివేదికలు.. అయినా విచారణ ఎందుకు లేదు?
31 వేల మందికి పైగా ఓటర్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంపై విచారణ చేపట్టిన ఆధారాలు తమ పరిశీలనలో కనిపించలేదని ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ పేర్కొంది.ఇలాంటి నివేదికలు సాధారణంగా ప్రజలకు అందుబాటులో ఉండవని, తాము వాటిని సేకరించి విశ్లేషించినట్లు వివరించింది. ఎన్నికల నిర్వహణపై చేపట్టిన ‘ఎలక్షన్ ఆడిట్’ సిరీస్‌లో ఇది మూడో కథనమని తెలిపింది. ఇప్పటివరకు ఒకే లోక్‌సభ నియోజకవర్గానికి సంబంధించిన రిటర్నింగ్ అధికారుల నివేదికలను పరిశీలించినట్లు స్పష్టం చేసింది. మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటన్నది ఇంకా పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.
👉 ఎన్నికల సంఘం నుంచి స్పందన లేదు
ఈ భారీ వ్యత్యాసంపై వివరణ కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించినట్లు ‘ది రిపోర్టర్స్ కలెక్టివ్’ తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం స్పందించలేదని, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం మాత్రం జిల్లా ఎన్నికల అధికారికి లేఖ రాయాలని సూచించిందని పేర్కొంది. ఆ మేరకు జిల్లా ఎన్నికల అధికారిని కూడా సంప్రదించినట్లు వివరించింది. అధికారుల నుంచి స్పందన వస్తే కథనాన్ని నవీకరిస్తామని తెలిపింది.
2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిన కుప్పంతో కూడిన చిత్తూరు లోక్‌సభ పరిధిలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటర్ల లెక్కల్లో 31,471 మంది వ్యత్యాసం ఎందుకు వచ్చింది? రెండు నివేదికల్లో ఏది సరైనది? ఎన్నికల సంఘం దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదు? అన్న ప్రశ్నలకు అధికారిక సమాధానాలు రావాల్సి ఉంది.
In the Chittoor parliamentary seat, in 2024, the ECI’s internal records counted 56,067 voters polling at 6 pm. For the seven assembly seats that make up Chittoor, they counted only 24,596. the ECI never looked into the gap of more than 31,000 voters.
@TweetSumedha explains.
Siva Sankar Reddy retweeted
क्रॉनोलोजी समझिये... 👇🏻
FSSAI आजकल बिसलेरी के पीछे क्यों पड़ा??
क्या भारत मे बिसलेरी को छोड़ कर भारत मे सारे बोतलबंद पानी ब्रांड शुद्ध है??
हर कोई यही कह रहा है की बिसलेरी बोतलबंद पानी हानिकारक है।
आप लोगों को ये कोई नहीं बताएगा की मुकेश अम्बानी बोतल बंद पानी बाजा मे उतार चुके है।
बस अडानी अम्बानी के धंधे को आगे बढ़ाने के लिए अकेली बिसलेरी पर कारवाही की जा रही है... 1/2
Siva Sankar Reddy retweeted
తమ నీరు సురక్షితమే అని వివరణ ఇచ్చిన బిస్లరీ సంస్థ
తయారీ ప్రక్రియలో 10 దశల నాణ్యత నియంత్రణతో పాటు 90కి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నాం
2025 సెప్టెంబర్ 30న తమ గోవా ప్లాంట్ నుంచి ఆరు నమూనాలను FSSAI అధికారులు సేకరించారు
అందులో ఐదు నమూనాలు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి, ఆరో నమూనాలో మాత్రమే లీటరుకు 10 మైక్రోగ్రాముల పరిమితికి బదులుగా 12 మైక్రోగ్రాముల బ్రోమేట్ ఉన్నట్లు నమోదైంది
దీనిపై తాము 2025 నవంబర్ 22న రీటెస్టింగ్ కోసం అప్పీల్ చేయడంతో FSSAI రిఫరల్ ల్యాబ్‌కు పంపగా బ్రోమేట్ స్థాయి పరిమితికి లోబడే ఉన్నట్లు తేలింది
కానీ అక్కడ పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు విడిగా పేర్కొన్నారు
తాము ఆ నమూనాను FSSAI గుర్తింపు పొందిన మరో ల్యాబొరేటరీకి పంపగా అందులోనూ బ్రోమేట్ స్థాయిలు నిర్దేశిత పరిమితిలోనే ఉన్నాయి
ఆ పరీక్షా ఫలితాలను జతచేస్తూ 2026 ఫిబ్రవరి 2న FSSAI వెస్ట్రన్ రీజినల్ ఆఫీస్‌కు అధికారిక లేఖ పంపించాం.. ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాంటి సమాచారం రాలేదు
మీడియాలో ప్రచారమవుతున్న నోటీసు FSSAI వెబ్సైట్లో కూడా కనిపించడం లేదు
ఈ విషయంపై తాము FSSAIకి పూర్తి సహకారం అందిస్తామని వివరణ ఇచ్చిన బిస్లరీ సంస్థ
Siva Sankar Reddy retweeted
Ambani Playing Dirty Yet Again🚨
Mukesh Ambani wanted to take over India's packaged drinking water market, but Bisleri was already dominating it.
In September 2025, GST on packaged drinking water dropped from 18% to 5%.
Just days later, Reliance launched Campa Sure at aggressive prices.
Then, on September 30 2025, FSSAI collected six water samples from Bisleri's Goa factory and the results were unexpected.......(1/2)
Siva Sankar Reddy retweeted
ఒక్క సారిగా బిస్లరీపై ఎందుకు దాడి జరుగుతోంది..?
మొత్తం ఆ సంస్థ నీళ్లు తాగడానికి పనికి రావని ఎందుకు ప్రచారం చేస్తున్నారు..?
కార్పొరేట్ రాజకీయాల లోతుల గురించి అంచనా వేయడం కష్టం.
కానీ బిస్లరీ వాదన కూడా వినాలి.
ఆ సంస్థ చెబుతున్న దాని ప్రకారం.. అసలు తప్పే జరగలేదు. #Bisleri
Siva Sankar Reddy retweeted
తమిళనాడు డేటాను దొంగిలించిన లోకేష్
- 15 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు
- విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారని ఆగ్రహం
తమిళనాడు పారిశ్రామిక ఒప్పందాల డేటాను లోకేష్ చోరీ చేశారన్న వార్త దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది.
తన సొంత ప్రయత్నాల ద్వారా కాకుండా తమిళనాడు వద్దనున్న డేటాను తస్కరించి ఆ మేరకు కంపెనీలతో లావాదేవీలు జరిపారన్న వార్త ఇప్పుడు దేశ పారిశ్రామిక రంగాన్ని బద్దలు కొడుతోంది.
తమిళనాడు ప్రభుత్వంతో ఏయే కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి, ఆ కంపెనీలకు అక్కడి ప్రభుత్వం ఇవ్వనున్న రాయితీలు తదితర రహస్య సమాచారాన్ని లోకేష్ తస్కరించినట్టుగా అభియోగాలు. దీంతో తమిళనాడు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహానికి గురైంది. పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న 15 మంది అధికారులను వెంటనే సస్పెండ్ చేసింది.
ప్రస్తుతం తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న కీర్తన, ప్రస్తుతం చంద్రబాబు కోసం పనిచేస్తున్న Show Time లోనూ, చంద్రబాబు క్యాంపెయిన్ కోసమూ పనిచేసింది. ఈ సంబంధాలే డేటా లీక్‌కు దారి తీసి ఉంటాయని తమిళనాడు పొలిటికల్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Siva Sankar Reddy retweeted
Bro is lying figures to save cronies and fund raisers to pm cares fund 😭😜🤘😂
Siva Sankar Reddy retweeted
దత్తపుత్రుడి దండయాత్ర
రెండేళ్ల ముందు #Suriya మూవీ #Kanguva సినిమా ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో తెలిసిందే. అది సూర్య కజిన్.. తన సినిమాల పోస్టర్ల మీద ‘సగర్వంగా సమర్పించు’ అని వేసుకునే GnanavelRaja ప్రొడ్యూస్ చేసిన సినిమా. బడ్జెట్ 300 కోట్ల పైమాటే. ఇది బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసేస్తుందని, తమిళంలో ఫస్ట్ 1000 కోట్ల మూవీ అవుతుందని (జ్ఞానవేల్ అయితే 2వేల కోట్లన్నాడు) అంచనాలు కట్టారు. కట్ చేస్తే వంద కోట్ల కలెక్షన్ కూడా రాలేదు.
జ్ఞానవేల్ నిండా మునిగిపోతే.. సూర్యనే సొంత డబ్బులు పెట్టి బయ్యర్లకు సెటిల్మెంట్ చేశాడు. తర్వాత తమ్ముడు #Karthi తో జ్ఞానవేల్ తీసిన ‘వా వాతియార్’ సినిమాకు ఏదో ఇబ్బంది తలెత్తి రిలీజ్ ఆగిపోతే.. దానికీ సాయం చేశాడు. కానీ ఆ సినిమా కూడా డిజాస్టరే. ఈ సాయాలు సరిపోదని సమ్మర్లో #Karuppu సినిమాకు రిలీజ్ రోజు బ్రేక్ పడితే.. చాలా పెద్ద మొత్తానికి స్యూరిటీ ఇచ్చి దాన్ని రిలీజ్ చేయించాడు. ఈ సినిమా ఆడకపోతే సూర్య మీద ఇంకా పెద్ద భారం పడేది.
కానీ సినిమాల కోసం ప్రాణం పెట్టి పని చేసే గొప్ప నటుడికి.. అగరం ఫౌండేషన్ ద్వారా 8 వేల మందికి పైగా పిల్లల్ని చదివించి, ఇప్పుడు వందలమందికి విద్యనందిస్తూ.. వాళ్ల కోసం ఎన్నో ఏళ్లుగా ఉంటున్న ఇంటిని కూడా రాసిచ్చేసిన దాన కర్ణుడికి అంతిమంగా మంచి జరగకుండా ఎలా ఉంటుంది?
పదేళ్లకు పైగా నిఖార్సయిన హిట్టు లేక సతమతం అయిన సూర్యకు 2026 కరవు మొత్తం తీర్చేసింది. ‘కరుప్పు’ 350 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇంకో మూడు నెలలకు #ViswanathAndSons తో 250 కోట్లు కొల్లగొట్టాడు. ఇప్పుడు #Scene కూడా అదరగొడుతోంది. ఇది ఈజీగా 200 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. విశేషం ఏంటంటే.. ‘సీన్’ను ప్రొడ్యూస్ చేసింది సూర్య, జ్యోతికలే. అగరం ఫౌండేషన్‌ను నడిపించే ఒక లేడీని ఈ మూవీకి ఇందులో భాగస్వామిని చేశారు. లాభాలను ఫౌండేషన్‌కు పంచనున్నారు. ఈ సినిమా తీసింది మలయాళ దర్శకుడు #JithuMadhavan. మాలీవుడ్ స్టయిల్లోనే తక్కువ బడ్జెట్లో సినిమా తీశాడు. ఆ బడ్జెట్ నాన్-థియేట్రికల్ రైట్స్‌తోనే వెనక్కి వచ్చేసింది. థియేటర్ల నుంచి వచ్చేదంతా లాభమే. అంటే సూర్యది మామూలు జాక్‌పాట్ కాదన్నమాట.
సూర్య స్థాయి స్టార్ హీరో కేవలం 6 నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేయడమే ఆశ్చర్యం. ఆ మూడూ బ్లాక్బస్టర్లు కావడం అన్ బిలీవబుల్ రికార్డు. ఇండియన్ సినిమాలో ఒకే సంవత్సరం మూడు సినిమాలు రిలీజ్ చేసి హిట్లు కొట్టిన రికార్డు #SharukhKhan పేరు మీద ఉంది. 2023లో #Pathaan, #Jawan, #Dunki సినిమాలతో ఈ ఘనత సాధించాడు. కానీ ఇందులో ‘డంకీ’ని నిఖార్సయిన హిట్ అని చెప్పలేం. కానీ సూర్య మాత్రం మూడుకు మూడు చిత్రాలతోనూ క్లీన్ హిట్లు ఇచ్చాడు.
సూర్య సినిమా హిట్టయిందంటే తమిళులతో సమానంగా తెలుగు వాళ్లు సంతోషిస్తారు అంటే అతిశయోక్తి కాదు. అతను తెలుగు వాళ్ల మీద చూపించే ప్రేమ అలాంటిది మరి. మిగతా తమిళ స్టార్లలా కేవలం సినిమాల ప్రమోషన్ కోసం దొంగ ప్రేమ చూపించే రకం కాదు. అతను తెలుగు వాళ్ల గురించి మాట్లాడేటపుడు మాటలు గుండె లోతుల్లోంచి వస్తాయి. తన సినిమాల షూటింగ్ ఇక్కడ చేస్తాడు. డబ్బింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు.
బుల్లెట్ పాయింట్: పాన్ ఇండియా మోజులో పడి రెండు మూడేళ్లకో సినిమా చేస్తూ.. ఆ ఒక్క సినిమాలోనూ ప్రేక్షకులు ఆశించే కంటెంట్ అందించలేక తీవ్రంగా నిరాశపరుస్తున్న మన తెలుగు స్టార్లు చాలామంది సూర్యను చూసి ఎంతో నేర్చుకోవాలి. 6 నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేయడమే కాదు.. మూడింటితోనూ బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఎందులోనూ భారీతనం లేదు. సింపుల్ సినిమాలు, సింపుల్ క్యారెక్టర్లతోనే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్ ఇచ్చాడు. సూర్య కూడా ‘కంగువ’ లాంటి సినిమాతో తప్పటడుగు వేశాడు. కానీ వెంటనే రియలైజ్ అయ్యాడు. మనవాళ్లలో ఈ రియలైజేషన్ ఎప్పుడొస్తుందో?
#Suriya #Scene #JithuMadhavan #Nazriaynazim #Naslen #Karthi #Ramcharan #JrNtr #Prabhas #AlluArjun #Karuppu #Veerabhadrudu #ViswanathAndSons #VenkyAtluri #RJBalaji #Ramayana #Ramayanam #SharukhKhan
Siva Sankar Reddy retweeted
ఒకవైపు రాష్ట్రాన్ని అప్పుల్లో.. మరోవైపు అమరావతి ని వరద నీటిలో ముంచెత్తుతున్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం..అభివృద్ధి చేస్తానని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన #chandrababu #saveandrapradesh
Siva Sankar Reddy retweeted
అప్పులు కొండంత, ఆస్తులు గోరంత! 📉
2026-27 బడ్జెట్ తొలి ఆరు నెలల (ఏప్రిల్–సెప్టెంబర్) లెక్కలను కాగ్ బయటపెట్టింది:
▪️ ఏడాదంతా చేస్తామన్న అప్పుల్లో 77% ఆరు నెలల్లోనే చేసేశారు, ఏకంగా ₹58,421 కోట్లు!
▪️ ఆ అప్పులో ఆస్తుల కల్పనకు ఖర్చు చేసింది కేవలం ₹16,447 కోట్లు. అంటే ప్రతి ₹100 అప్పులో ₹28 మాత్రమే!
▪️ ఏడాది మొత్తానికి రెవెన్యూ లోటు ₹22,002 కోట్లు అని అంచనా వేస్తే, ఆరు నెలల్లోనే ₹39,780 కోట్లకు చేరింది. అంచనాకు దాదాపు రెట్టింపు!
▪️ కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా, కేంద్ర గ్రాంట్లు వచ్చింది కేవలం ₹5,233 కోట్లు, అంటే బడ్జెట్ అంచనాలో 16% మాత్రమే.
2023-24లో ఇదే ఆరు నెలల్లో జగన్ గారి నాయకత్వంలోని మా ప్రభుత్వానికి కేంద్రం నుంచి వచ్చింది ₹21,270 కోట్లు!
ఇల్లు కట్టడానికో, బండి కొనడానికో అప్పు చేస్తే కనీసం ఆస్తి మిగులుతుంది.
కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు మెడికల్ కాలేజీలు లేవు, రోడ్లు లేవు.
మిగిలేది ప్రజల నెత్తిన అప్పుల భారం మాత్రమే!
"సంపద సృష్టిస్తాం" అన్నారు. సృష్టిస్తున్నది అప్పులనే! 🙏
#CAGReport #APDebt #ChandrababuNaidu #APFinances
Debts as big as a mountain, assets as small as a fingernail! 📉
CAG has released the accounts for the first six months (April–September) of the 2026-27 budget:
▪️ 77% of the borrowing planned for the whole year was done in just six months: a whopping ₹58,421 crore!
▪️ Of that debt, only ₹16,447 crore was spent on creating assets. That's just ₹28 out of every ₹100 borrowed!
▪️ The revenue deficit was estimated at ₹22,002 crore for the entire year. In six months it has already reached ₹39,780 crore, nearly double the estimate!
▪️ Despite being a partner in the Central government, the state received only ₹5,233 crore in central grants, just 16% of the budget estimate.
In the same six months of 2023-24, our government under Jagan garu's leadership received ₹21,270 crore from the Centre!
When you borrow to build a house or buy a vehicle, at least you're left with an asset.
But this government's borrowing has produced no medical colleges and no roads.
All that's left is the burden of debt on the people's heads!
They promised to "create wealth". All they're creating is debt! 🙏
Siva Sankar Reddy retweeted
Vietnam has become a favourite new destination for Indian travellers. But if we turn their airports into picnic spots, spreading food and litter, we risk becoming very unpopular tourists. When will we learn to travel with civic sense? 😮
Siva Sankar Reddy retweeted
🚨
మందులు ఫేక్
ఆహారం ఫేక్
పన్నీర్ ఫేక్
వంట నూనె ఫేక్
ఆఖరికి ఇవి కూడా.. ఎవరో వాడేసినవి.. 🤮
సినిమా టికెట్లకు వందల వేల రూపాయిల వసూలు చేసే కార్పొరేట్ మల్టీప్లెక్స్ లో ఈ దారుణం చూశారా?
#PVR
Siva Sankar Reddy retweeted
"వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా" డాక్టర్ రాజేంద్ర సింగ్ అమరావతి రాజధాని ప్రాంతంలోని కృష్ణానది ఫ్లడ్ ప్లెయిన్స్, జరీబు భూములు, ఇసుక తవ్వకాల ప్రదేశాలను పరిశీలించారు. రాజధాని అభివృద్ధి పేరుతో కృష్ణానది పర్యావరణ వ్యవస్థను ధ్వంసం చేస్తే అది అమరావతి భవిష్యత్తుకే తీవ్ర ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
ముఖ్య విషయాలు & ఆందోళనలు
Ecology Condition No. 9 ఉల్లంఘన:
అమరావతి పర్యావరణ అనుమతుల్లోని నిబంధన ప్రకారం కృష్ణానదికి సమాంతరంగా ఉన్న 2 నుండి 3 కిలోమీటర్ల భూభాగాన్ని కేవలం "బ్లూ-గ్రీన్ మౌలిక సదుపాయాలు" మరియు పట్టణ వ్యవసాయం కోసమే కేటాయించాలి. కానీ ప్రస్తుతం జరుగుతున్న భూసేకరణ, భూ వినియోగ మార్పులు ఈ నిబంధనకు అనుగుణంగా ఉన్నాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైకోర్టుకు విజ్ఞప్తి:
ప్రతిరోజూ కరకట్ట మీదుగా ప్రయాణించే గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు ఈ నష్టాన్ని స్వయంగా గమనించి, అవసరమైతే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని కోరారు.
ఇసుక తవ్వకాలు - కరకట్టకు ప్రమాదం:
నదిలో 40 అడుగుల లోతు వరకు జరుగుతున్న యంత్రాల డ్రెడ్జింగ్ వల్ల నదీ గర్భం మారిపోతోందని, నదీ తీరాలు కోతకు గురవుతున్నాయని తెలిపారు. ఇది కృష్ణానది కరకట్ట భద్రతకు తీవ్ర ముప్పు కలిగించి, విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రజలకు వరద ప్రమాదం తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
జరీబు భూముల ప్రాధాన్యత:
ఈ భూములు వరద నీటిని నిల్వ చేయడానికి, భూగర్భ జలాల పునరుద్ధరణకు, జీవవైవిధ్య పరిరక్షణకు మరియు ఆహార భద్రతకు అత్యంత కీలకమైనవని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు
స్వతంత్ర కమిటీ విచారణ: ఫ్లడ్ ప్లెయిన్స్లో జరుగుతున్న నిర్మాణాలు, భూసేకరణపై నిపుణుల కమిటీతో పూర్తిస్థాయి విచారణ జరిపించాలి.
శ్వేతపత్రం విడుదల: Ecology Condition No. 9 మరియు ఇతర పర్యావరణ అనుమతుల అమలుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి.
అక్రమ తవ్వకాలపై దర్యాప్తు: లోతైన డ్రెడ్జింగ్, ఇసుక తవ్వకాలపై సమగ్ర దర్యాప్తు జరిపి తక్షణమే నిలిపివేయాలి.
కరకట్ట భద్రతపై అధ్యయనం: కరకట్ట స్థిరత్వంపై స్వతంత్ర శాస్త్రీయ, హైడ్రాలజీ అధ్యయనం నిర్వహించాలి.
నిర్మాణాల నిలిపివేత: పర్యావరణ, చట్టపరమైన సమీక్ష పూర్తయ్యే వరకు ఫ్లడ్ ప్లెయిన్స్ను ప్రభావితం చేసే నిర్మాణాలను, భూసేకరణను నిలిపివేయాలి.
సందేశం: రాజ్యాంగంలోని 48A, 51A(g) అధికరణల ప్రకారం పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ ప్రకృతి విధ్వంసానికి వ్యతిరేకం. నదులను, ఫ్లడ్ ప్లెయిన్స్ను కాపాడుకుంటేనే అమరావతి భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
facebook.com/share/p/1CGsoLg…
బొలిశెట్టి సత్యనారాయణ
పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడు
జల బిరాదరి – జాతీయ కన్వీనర్
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #AmaravatiNaturalCapital
@moefcc @AndhraPradeshCM
@APDeputyCMO @PawanKalyan









































